Tiger in Alluri District: అల్లూరి జిల్లాలో పులి సంచారం - అసలే కరెంట్ లేక కష్టాలు, రాత్రయితే భయం భయం !
అసలే కరెంట్ లేని గ్రామాలు కావడంతో రాత్రయితే ప్రజలు బిక్కుమిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలానికి చెందిన ప్రజలు.
ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల ప్రజలను గత ఏడాది నుంచి పులులు, ఎలుగుబంట్లు ముప్పుతిప్పలు పెట్టాయి. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పులి సంచరిస్తోంది. అసలే కరెంట్ లేని గ్రామాలు కావడంతో రాత్రయితే ప్రజలు బిక్కుమిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనంతగిరి మండలం రొంపెల్లి. ఎన్ ఆర్ పురం పంచాయతీ పరిధిలో కరెంటు లేని గ్రామాల్లో గత వారం రోజుల నుంచి సోముల అప్పలరాజు, సోముల రామారావుమూడు ఆవులు పులి దాడిలో మృతి చెందాయి. వారం రోజుల్లో మూడుసార్లు పులి దాడి చేయగా మూడు ఆవులు మృతి చెందాయని వాటి యజమానులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు బూరు పెంటయ్య మాట్లాడుతూ... పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించాం. రాత్రి వేళలో కరెంట్ లేని గ్రామాల్లో ఉన్నటువంటి వెయ్యి మంది జనాభా కలిగిన గ్రామాల్లో రాత్రివేళ నిద్ర పట్టడం లేదు. పులి ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది చీకటి పడగానే గడ్డిలో తలదాచుకుంటే, తలుపు లేని ఇండ్లలో ఉండేవారు బిక్కుబిక్కుమని అరచేతుల్లో గుండె పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కరెంటు సౌకర్యం కోసం స్తంభాలు ఏర్పాటు చేయడం కోసం ఫారెస్ట్ అడవుల్లో గోతులు తవ్వితే ఫారెస్ట్ అనుమతులు లేవని కరెంటు రాకుండా చేసేశారు.
మేం చీకట్లో బతుకుతున్నాము. పెద్ద పులి సంచరిస్తుందని తెలిశాక మా అందరిలో భయాందోళన అధికమైందని స్థానికులు చెబుతున్నారు. మా పశువులు పులి దాడిలో మృతి చెందాయి. ఫారెస్ట్ అధికారులే దీనికి నష్టపరిహారం ఇవ్వాలని మా ఆదివాసి గిరిజనులకు రక్షణ కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మా గ్రామాల్లో ఒకరోజు బస చెయ్యాలని ఆదివాసి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పులి బారి నుంచి బూరిగ చిన్నకానిలా గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు బూరు పెంటయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జనావాసాల్లోకి పులులు
ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం కలకలం రేపుతోంది. చాలా చోట్ల పులులు కనిపిస్తున్నాయి. బయట దాడులు చేస్తున్నాయి. పసుశులను చంపుతున్నాయి. అయితే.. చిక్కడం లేదు. తప్పించుకుని వెళ్తున్నాయి. ఏపీతో పాటు ఇటీవల ఆదిలాబాద్ అడవుల్లోనూ ఇలా పులుల సంచారం ఎక్కువగా ఉంది. వాటిని పట్టుకునే ప్రయత్నాలు ఫెయిలవుతున్నాయి. హెటెరో ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో గత డిసెంబర్ నెలలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత సంచరించడంతో ఉద్యోగులు షాకయ్యారు. గత మూడు నెలల కిందట సైతం పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాకు లభ్యమయ్యాయి. దీంతో అక్కడే ఉందని నిర్ధారించుకున్న ఫ్యాక్టరీ అధికారులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమయిన అటవీ శాఖ సిబ్బంది.. 45 మంది అటవీ శాఖ జు అధికారులతో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చేశారు. జూ నుండి రెండు బోన్లు తీసుకు వచ్చారు. రెండు బోన్లు లలో రెండు మేక పిల్లలను ఎరగా వేసి పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనిపిస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పులి కనిపించీ కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతూండటంతో అటీవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేసి చివరికి ఆరోజు సాయంత్రానికి పులిని పట్టుకున్నారు. దాంతో హెటిరో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.