By: Ram Manohar | Updated at : 11 Feb 2023 03:11 PM (IST)
ఎయిర్ ఏషియాకు DGCA భారీ జరిమానా విధించింది.
Air Asia Fined:
రూ.20 లక్షల ఫైన్
ఎయిర్ ఏషియా కంపెనీకి DGCA షాక్ ఇచ్చింది. పైలట్‌లకు సరైన విధంగా శిక్షణ ఇవ్వలేదని రూ.20 లక్షల జరిమానా విధించింది. పైలట్‌లకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఎక్సర్‌సైజ్‌లను నిర్లక్ష్యం చేశారని మండి పడింది. పైలట్ ప్రొఫీషియెన్సీ చెక్, ఇన్‌స్ట్రుమెంట్ చెక్ లాంటివి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అంతే కాదు. ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌నీ సస్పెండ్ చేసింది. మూడు నెలల పాటు విధుల్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. మొత్తం ట్రైనింగ్ టీమ్‌లో ఉన్న ఎగ్జామినర్లకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల ఫైన్ వేసింది. వీటితో పాటు షో కాజ్ నోటీసులు కూడా పంపింది. రూల్స్ ఎందుకు పాటించలేదో వివరించాలని ఆదేశించింది. రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని చెప్పింది. వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనుంది DGCA. ఇప్పటికే తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా...DGCA అన్ని సంస్థలపైనా ప్రత్యేక నిఘా పెడుతోంది. ఏ చిన్న లోపం ఉందని తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే Air Asiaను మందలించి జరిమానా వేసింది.
DGCA imposes financial penalty of Rs 20 lakhs on Air Aisa for violation of applicable DGCA Civil Aviation Requirements, says few mandatory exercises of the pilots of Air Asia not done during Pilot Proficiency Check as per schedule. pic.twitter.com/8Bq5Vxm5fP
— ANI (@ANI) February 11, 2023
ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఈ మధ్యే సంచలనం రేపిన ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం రోజు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది. గతేడాది నవంబర్ 26వ తేదీన నిందితుడు శంకర్ మిశ్రా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్ లో వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఇతడు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ నిందితుడిని తేలిగ్గా వదిలేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన టాటా సన్స్ కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నిందితుడిని బెంగళూరు నుంచి అరెస్టు చేశారు.
Also Read: Viral News: ఆన్లైన్లో బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాడు, బ్రెడ్‌తో పాటు ఎలుక కూడా వచ్చింది
Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు
Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !
Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?