అన్వేషించండి

AIADMK Leadership Tussle: పన్నీర్ సెల్వంకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్, పళనిస్వామికే పార్టీ పగ్గాలు!

AIADMK Leadership Tussle: మద్రాస్ హైకోర్ట్ పన్నీర్‌ సెల్వంకు షాక్ ఇచ్చింది. పళనిస్వామికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

AIADMK Leadership Tussle: 

ఆ తీర్పుని పక్కన పెట్టేసి..

తమిళనాడులో పనీర్ సెల్వం, పళనిస్వామి మధ్య యుద్ధం ఆగటం లేదు. రెండు, మూడు నెలలుగా ఇది కొనసాగుతూనే ఉంది. AIDMK జనరల్ సెక్రటరీ పదవిపై చెలరేగిన వివాదం ముదిరి చివరకు కోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్ట్ మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా  తీర్పునిచ్చింది. పార్టీ నాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే లీడర్ పళనిస్వామి కోర్టులో అప్పీల్ వేయగా...దీన్ని కోర్టు అనుమతించింది. అంతకు ముందు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. జులై 11న జరిగిన AIDMK జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుని...జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ తోసి పుచ్చింది. ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో...అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పళనిస్వామికే అందనున్నాయి. మొత్తానికి...మాజీ డిప్యుటీ సీఎం పనీర్ సెల్వంకు షాక్ తగిలింది. 

అంతకు ముందు ఏం జరిగిందంటే..? 

అన్నా డీఎంకే పార్టీకి ఆగస్టు 17న మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. జులై 11వ తేదీన జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్‌ చెల్లదని, మరోసారి ఈ సమావేశం నిర్వహించాలని తేల్చి చెప్పింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్‌కు మాత్రమే జనరల్ కౌన్సిల్ నిర్వహించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వమ్ వేసిన పిటిషన్‌పై చేపట్టిన విచారణలో భాగంగా..ఈ వ్యాఖ్యలు చేసింది. తనను పార్టీ నుంచి బహిష్కరించటమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించటాన్ని హైకోర్ట్‌లో సవాలు చేశారు పన్నీర్‌సెల్వం. జులై 11వ తేదీన జరిగిన ఈ సమావేశంలో...పన్నీర్‌సెల్వంని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించటంతో పాటు, ట్రెజరర్‌ పోస్ట్ నుంచి కూడా తప్పిస్తున్నట్టు తీర్మానం పాస్ చేశారు. ఆయన స్థానంలో పళనిస్వామి AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం తరవాత తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్ల కారణంగా...పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మూసేశారు.

ఎత్తులకు పై ఎత్తులు..

పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియ‌ర్ నేత‌లు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. దీంతో రెండు నెలల క్రితం ఓ సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో వాకౌట్ చేశారు. అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపునకు నీళ్ల సీసాలు విసిరారు. బయట పన్నీర్ సెల్వం కారు టైర్లో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళం తరవాతే...జులై 11న మరోసారి మీటింగ్ పెట్టుకున్నారు. తరవాత అది కూడా చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పు పన్నీర్‌ సెల్వంకి మింగుడు పడేలా లేదు. 

Also Read: Pappu Charu Uppu Chepa : శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామం పేరు చెబితే నోరూరాల్సిందే..! | DNN | ABP Desam

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Insta Love Affair: యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే
యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Embed widget