Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ
Accenture Layoffs: అసెంచర్‌లోనూ 19 వేల మందిని తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Accenture Layoffs:
18 నెలల్లో లేఆఫ్‌లు..
మరో ఐటీ కంపెనీ అసెంచర్ (Accenture Layoffs)కూడా లేఆఫ్‌లు ప్రకటించింది. త్వరలోనే 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. వచ్చే 18 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 2.5%. Non Billable విభాగంలోనే ఎక్కువ సగం మందికి పైగా తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
" మా గ్రోత్‌కు తగ్గట్టుగా రిక్రూట్‌మెంట్ కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నాన్ బిల్లబుల్ కార్పొరేట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి. వచ్చే 18 నెలల పాటు లేఆఫ్‌లు కొనసాగుతాయి. దాదాపు 19 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుంది"
- అసెంచర్ యాజమాన్యం
ఈ ఉద్యోగులకు ప్యాకేజీ రూపంలో కొంత మొత్తం అందించనుంది కంపెనీ. ఇందుకోసం ప్రత్యేకంగా 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిపింది. వార్షిక ఆదాయం,లాభాల అంచనాలనూ తగ్గించుకుంది. ఈ వృద్ధి రేటు 8-11% వరకూ ఉంటుందని గతంలో అంచనా వేసినప్పటికీ..ప్రస్తుత పరిస్థితుల్లో అది 10%కే పరిమితమవుతుందని భావిస్తోంది. అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"వీలైనంత వరకూ మా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ లక్ష్యం సాధించాలనుకుంటున్నాం. ఇదే సమయంలో అవసరమైన చోట కచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాం"
- జూలీ స్వీట్, అసెంచర్ సీఈవో
విప్రోలోనూ...
ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో విప్రో (Wipro Layoffs) కూడా చేరిపోయింది. ఒకేసారి 120 మందిని తొలగించింది. అయితే...ఈ లేఆఫ్‌లు జరిగింది ఇండియాలో కాదు. అమెరికాలోని ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌కు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. వీరిలో 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్స్ ఉన్నారని చెప్పిన విప్రో...వీరితో పాటు టీమ్ లీడర్‌లు, టీమ్ మేనేజర్‌లు కూడా ఉన్నారని వెల్లడించింది Tampa ప్రాంతంలోని క్యాంపస్‌లోని ఉద్యోగులను తొలగించినట్టు వివరించింది. అయితే...ఇతర ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. మరోసారి ఉద్యోగాల కోత విధించే అవకాశాలు లేనట్టే అన్న సంకేతాలిచ్చింది. అయితే మే నెలలో విప్రోలో లేఆఫ్‌లు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో విప్రో ఈ వార్తల్ని ధ్రువీకరించింది కూడా. అయితే..తంప రీజియన్‌లోని ఆఫీస్‌లో మాత్రం ఈ కోతలు ఉండవని తెలిపింది. ఇక్కడి ఉద్యోగులు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నా మిగతా చోట్ల మాత్రం ఎంప్లాయిల్ తెగ కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు "Fired" అంటూ మెయిల్స్ వస్తాయో అని భయ పడుతున్నారు. ఇటీవలే విప్రో ఓ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. ఫ్రెషర్స్ జీతాల్లో సగం కోత విధించింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పుడు అందులో కోట్ చేసిన సీటీసీలో సగమే ఇస్తామని చెప్పింది. ఇందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగంలో చేరాలని చెప్పింది. మెటాలో మరోసారి 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. గూగుల్‌లోనూ విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు టెక్ సెక్టార్‌లో బాగా వినిపిస్తున్న పదం "లే ఆఫ్‌లు". దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Also Read: Coronavirs Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, కొత్త స్ట్రాటెజీ ప్రకటించిన కేంద్రం