By: ABP Desam | Updated at : 18 Jan 2022 06:03 PM (IST)
Edited By: Murali Krishna
అబుదాబిలో అడుగుపెట్టాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి
ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వేళ అబుదాబి కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌లో అడుగుపెట్టాలనుకునే వారికి కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇక నుంచి అబుదాబి వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న సర్టిఫికెట్ చూపించాలని పేర్కొంది.
ఒమిక్రాన్ ధాటికి యూఏఈలో కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది అక్కడ సర్కార్. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు..
వ్యాక్సినేషన్ పూర్తయిందనే దానికి గుర్తుగా ఇటీవల యూఏఈ ప్రభుత్వం పౌరులకు గ్రీన్ పాస్ ఇచ్చింది. నగరంలో తిరిగే వారు విధిగా గ్రీన్ పాస్ తమ వద్ద ఉంచుకోవాల్సిందే. అయితే తాజాగా బూస్టర్ డోస్ కూడా తీసుకుంటేనే గ్రీన్ స్టేటస్ యాక్టివ్ అయ్యేలా ప్రభుత్వ ఆరోగ్య యాప్‌లో అప్‌డేట్ చేశారు. పక్కనే ఉన్న దుబాయ్‌తో పోలిస్తే యూఏఈలో కరోనా ఆంక్షలు కఠినతరం చేశారు.
డ్రోన్ దాడి..
యూఏఈ రాజధాని అబుదాబిలో సోమవారం డ్రోన్ దాడులు కలకలం సృష్టించాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు సమాచారం. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్ దాడులు చేసినట్లు ఒప్పుకుంది.
ప్రధాన విమానాశ్రయంలో ముందుగా పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. తర్వాత మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలినట్లు వెల్లడించారు. ఇందుకు డ్రోన్ దాడులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.
విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ మస్తఫా ప్రాంతంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన మూడు పెట్రోలియం ట్యాంకర్లపైనా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎగిరే చిన్న వస్తువులు పడిన తర్వాత చమురు ట్యాంకులు పేలినట్లు పోలీసులు వివరించారు.
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?