అన్వేషించండి

ABP C Voter Opinion Poll : మళ్లీ మోదీనే - ఇండియా కూటమికి నిరాశే ! ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్స్‌ డీటైల్స్ ఇవిగో

ABP C Voter Opinion Poll Loksabha : ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ లో ఎన్డీఏ మరోసారి క్లియర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేలింది. ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పదని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

ABP C Voter Opinion Poll :  లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి., ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న అంశంపై ఏబీపీ సీ ఓటర్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒపీనియన్ పోల్ సేకరించింది. అత్యంత విస్తృతంగా , శాస్త్రీయంగా జరిగిన ఈ ఒపీనియన్ పోల్‌లో బారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. 

NDAకు 42 శాతం ఓట్లు  295-335 మధ్య సీట్లు 

దేశవ్యాప్తంగా ప్రజల ఒపీనియన్ పోల్స్ ను విశ్లేషించిన తర్వాత ఎన్డీఏ కూటమికి దాదాపుగా 42 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఈస్జ్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్‌ల వారీగా ఈ ఒపీనియన్ పోల్స్ సేకరించారు. అన్ని జోన్స్ లో కలిపి 42 శాతం ఓట్లతో పాటు 295 నుంచి 335 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఇండియా కూటమి గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీపై గెలిచేంత వరకూ వారు పోటీ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు 165 నుంచి 205 వరకూ సీట్లు రావొచ్చని అంచనా వేశారు. ఇక రెండు కూటముల్లోని పార్టీలకు 20 శాతం ఓట్లు 35 నుంచి 65 సీట్ల వరకూ రావొచ్చని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ తేల్చింది. 

ఈస్జ్ జోన్‌లో గట్టి పోటీ కానీ బీజేపీదే హవా 

దేశంలో  ఒక్క సౌత్ జోన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిపత్యం చూపిస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఎన్డీఏదే హవా. ఈస్జ్ జోన్‌లో మొత్తం 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జోన్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 42 శాతం ఓట్లు 80 నుంచి 90 వరకూ లోక్ సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 38 శాతం ఓట్లు  50 నుంచి 60 లోక్‌సభ సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఇతర పార్టీలకు 20 సాతం ఓట్లు 10 నుంచి 20 వరకూ లోక్ సభ సీట్లు సాధించే చాన్స్ ఉంది. 

నార్త్ జోన్‌లో పూర్తిగా బీజేపీ ఆధిపత్యం

ఇక నార్త్ జోన్ పూర్తిగా  బీజేపీ ఆధిపత్యం చూపించబోతోంది. మొత్తం నార్త్ జోన్ లో 180 పార్లమెంట్ సీట్లు ఉంటే.. అందులో 50 శాతం ఓట్లతో బీజేపీ 150 నుంచి 160 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమికి 36 శాతం ఓట్లతో 20 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయి. ఇతరులకు పధ్నాలుగు శాతం ఓట్లు వస్తాయి కానీ సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. సున్నా నుంచి ఐదు లోక్ సభ సీట్ల వరకూ వచ్చే చాన్స్ ఉంది. 

సౌత్ జోన్‌లో ఇండియా కూటమి ఆధిపత్యం

ఇక  బీజేపీ బలహీనంగా ఉందని భావిస్తున్న సౌత్ జోన్‌లో కాంగ్రెస్ కూటమికి మంచి ఫలితాలు వస్తాయని తేలిపింది. సౌత్ జోన్‌లో మొత్తం 132 లోక్ సభసీట్లు ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేవలం 19 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ లో వెల్లడయింది. లోక్ సభ సీట్లు 20 నుంచి 30 వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 40 శాతం ఓట్లతో  70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు కూటముల్లో లేని పార్టీలు 41 శాతం ఓట్లు తెచ్చుకుని 25 నుంచి 35 లోక్ సభ సీట్లను పొందే అవకాశం ఉందని తేలింది. ఈ స్తానాల్లో ఏపీకి చెందిన ఇరవై ఐదు లోక్ సభ స్థానాలున్నాయి. 

వెస్ట్ జోన్‌లోనూ బీజేపీదే హవా

ఇక ఇండియాలో వెస్ట్ జోన్‌గాభావించే మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కనిపించనుంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 78 సీట్లు ఉండగా  బీజేపీ కూటమి 45 నుంచి 55 సీట్లు వస్తాయి. 46  శాతం ఓటింగ్ లభిస్తుంది. కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు  25 నుంచి 35 పార్లమెంట్ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులకు 17 శాతం ఓట్లు సున్నా నుంచి ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించే అవకాశం ఉంది. 

[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget