Telescope History: తొలితరం టెలిస్కోపులు ఎలా ఉండేవి - అవి ఎలాంటి ఫలితాలు ఇచ్చాయంటే ?

History of The Telescope: దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడటం సాధ్యమైన దగ్గర నుంచి టెలిస్కోపులతో ఖగోళ వింతలను జల్లెడ పట్టడం వరకూ సైన్స్ డెవలప్ అవుతూనే ఉంది. కొన్ని టెలిస్కోపులకు ప్రత్యేక స్థానం ఉంది.

FOLLOW US: 

A Brief History of The Telescope: స్పై గ్లాసెస్‌తో దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడటం సాధ్యమైన దగ్గర నుంచి టెలిస్కోపులతో ఖగోళ వింతలను జల్లెడ పట్టడం వరకూ సైన్స్ డెవలప్ అవుతూనే ఉంది. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజు జేమ్స్ వెబ్ లాంటి భారీ మానవ నిర్మిత టెలిస్కోపులను అంతరిక్షంలోకి పంపించగలిగాం అంటే కారణం ఇలాంటి ఎన్నో టెలిస్కోపులు సేకరించిన ఫలితాలే. జేమ్స్ వెబ్ అద్భుతాలు చేయబోయే ఈ సందర్భంలో ఆ పాత టెలిస్కోపులను ఓ సారి తలుచుకుందాం.

1. Galileo's Refractor(1609) : గెలిలీయో రిఫ్రాక్టర్
మొదటి టెలిస్కోపు ఎవరు తయారు చేశారన్న అంశంపై కాస్త డిబేట్ ఉన్నప్పటికీ తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సింది నెదర్లాండ్ కు చెందిన స్పెక్టకల్స్ మేకర్ హాన్స్ లిప్పర్ షే కే. ఆయనకు అది టెలిస్కోప్ అని తెలియకపోయినా జస్ట్ దాన్ని ఓ స్పై అండ్ మాగ్నిఫైర్ ఇనస్ట్ట్రుమెంట్ గానే పరిగణించారు. ఓ నిటారుగా ఉండే పైప్ లో ఓ వైపు కాన్ వెక్స్ లెన్స్, మరో వైపు కాన్ కేవ్ లైన్స్ పెట్టి దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడటం మొదలుపెట్టాడు. కానీ గెలిలీయో ఆ ఇన్స్ట్రుమెంట్ ను ఇంప్రువైజ్ చేసి టెలిస్కోపును తయారు చేశాడు. 1609లో రూలర్ ఆఫ్ వెనిస్ కు డెమనాస్ట్రేషన్ ఇచ్చి ఈ విశ్వానికి కేంద్రం భూమికాదని తేల్చిన మహనీయుడు గెలిలీయో గెలెలి.


తొలిసారి ఈ భూమిని బయటఉన్న ప్రపంచాన్ని చూడటమే కాదు జ్యూపిటర్ ను దానికున్న నాలుగు చందమామలను, సూర్యుడి మీద బ్లాక్ స్పాట్స్ ను, శని రింగులను ఇలా ఈరోజు ఆస్ట్రానమీ చెప్పుకుంటున్న చాలా విషయాలను కనుగొంది రాసింది గెలీలియోనే. నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఒకే ఒక్క టెలిస్కోపు తో నిరూపించి ఈ విశ్వం ఎంత పెద్దదో మీ ఊహకే వదిలేస్తున్నా ఈ ప్రపంచాన్ని సైన్స్ అడ్వాన్స్ మెంట్ దిశగా నడిపించిన ఘనత గెలిలీయో ఆయన రిఫ్రాక్టర్ దే.

2. Newton's Reflecting Telescope (1668) న్యూటన్ టెలిస్కోస్
ఇప్పుడున్న అత్యాధునిక టెలిస్కోప్ లు ఫాలో అవుతున్న మెథడ్ సర్ ఐజక్ న్యూటన్ దే. ఫస్ట్ లో గెలిలీయో వాళ్లందరూ వాడినట్లు లెన్స్ లు వాడి లైట్ రిఫ్రాక్ట్ అయ్యేలా చేసి ఇమేజ్ పరిశీలించినట్లు కాకుండా న్యూటన్ టెలిస్కోపుల్లో సరికొత్త మార్పులు చేశారు. ఆయన లెన్స్ ల ప్లేస్ లో మిర్రర్ వాడటం మొదలు పెట్టారు. ఫలితంగా క్లియర్ ఇమేజెస్ ను ఫాం చేసేందుకు ఉపయోగపడింది. క్రొమాటిక్ అబ్బరేషన్ వల్ల అంతకు ముందు గ్రహాలు, నక్షత్రాలన్నీ బ్లర్లీగా కనిపించేవి. కానీ ఈ పద్ధతిని వదిలి టెలిస్కోప్  మిర్రర్ ను వాడి రిఫ్లెక్టింగ్ టెలిస్కోపులకు ప్రాణం పోసింది మాత్రం సర్ ఐజక్ న్యూటన్. దీంతో ఖగోళ పరిశోధనలు మనకు మరింత చేరువయ్యాయి. కానీ ప్రాబ్లం ఏం వచ్చిందంటే మెటల్ మిర్రర్ ప్రాపర్ గా గ్రైండింగ్ చేయాలి చాలా నీట్ గా సానపెట్టాలి అలా చేయకపోవటం వల్ల అప్పట్లో ఉన్న లెన్స్ టెలిస్కోపుల కంటే ఎక్కువ దోషాలు వచ్చేవి న్యూటన్ కనిపెట్టిన రిఫ్లెక్టింగ్ టెలిస్కోపుల్లో. ఓ వందేళ్ల తర్వాత కానీ న్యూటన్ కలలు కన్న ఫార్మూలా వర్కవుట్ అయ్యి ఆయన ఎంత దార్శనుకిడో ప్రపంచం మరో సారి చూసింది.

3. Herschel's Telescopes (1781-1830) హెర్షల్ టెలిస్కోప్
ఔత్సాహికులైన ఓ తండ్రీ కొడుకులు ఈ అనంత మైన విశ్వం గురించి కలలు కన్నారు. వాళ్లే విలియం హెర్షల్, అండ్ జాన్ హెర్షల్. లేట్ 17 హండ్రెడ్స్ లో జర్మన్ మ్యూజిషీయన్ గా పాపులరైన విలియం హెర్షల్ కు ఈ విశ్వం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తితో ఓ పెద్ద రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ను తయారు చేయించారు. తన చెల్లెలు కేరోలిన్ తో కలిసి ఖగోళ వింతలను పరిశీలిస్తూ తన అబ్జర్వేషన్స్ అన్నీ నోట్ చేస్తూ ఉండేవారు. 1.2 మీటర్స్ డయామీటర్ మిర్రర్ ఉండే ఆ టెలిస్కోప్ ఎంత పెద్దంటే ఎప్పుడూ ఓ నలుగురు పనివాళ్లు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్లు. వీల్స్ తిప్పుతూ, రోప్స్ లాగుతూ, పుల్లీల సహాయంతో వర్క్ చేస్తూ అబ్బో చాలా కష్టపడేవాళ్లు. 18 శతాబ్దం మధ్య వరకూ ప్రపంచంలో ఇదే పెద్ద స్పేస్ టెలిస్కోప్.


ఎన్నో వందల నెబ్యూలాలు, బైనరీ స్టార్లను విలియం హెర్షల్ కనుగొన్నారు. 1781 లో విలియం హెర్షల్ ఈ టెలిస్కోప్ కాదు కానీ ఇంకో చిన్న టెలిస్కోప్ తో ఓ గ్రహాన్ని కనుగొన్నారు. మొదట అది నక్షత్రం అనుకున్నారు కానీ కాదు గ్రహమే. అదే యురేనస్. తండ్రి విలియం హెర్షల్ బాటలోనే నడిచిన తనయుడు జాన్ హెర్షల్ కూడా మరో టెలిస్కోప్ ను ఏర్పాటు చేసి 1830ల్లో పరిశోధనలు చేశాడు. కానీ ఎక్కువగా పరిశీలనలన్నీ సదరన్ స్కైస్ మీద చేశారు.

4. Yerkes Refractor (1895) యెర్క్‌స్ టెలిస్కోప్
అమెరికన్ ఆస్ట్రోనమర్ జార్జ్ ఎల్లరీ హేల్ ఈ భారీ టెలిస్కోప్ ను నిర్మించారు . వన్ మీటర్ వైడ్ ప్రైమరీ లెన్స్ తో ఉండే ఈ టెలిస్కోప్ నిర్మించే టైం కి ప్రపంచంలోనే అతి పెద్ద స్పేస్ టెలిస్కోప్...అండ్ ఇప్పటికీ కూడా రిఫ్రాక్టర్ టెలిస్కోప్ లో అతిపెద్దది ఇదే.  విస్కాన్సిన్ లోని విలియమ్స్ బే లో ఈ ఎర్కీస్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. అమెరికన్ టెలిస్కోప్ బిల్డర్స్ ఎల్వార్ క్లార్క్ అండ్ సన్స్ ఈ టెలిస్కోప్ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. కానీ ఓ ప్రాబ్లం వచ్చింది. మనం ఇందాక అనుకున్నాం రిఫ్రాక్షన్ టెలిస్కోప్ తయారు చేయాలంటే మిర్రర్స్ కాదు లెన్స్ లు వాడాలి. సో దాని ఓన్ లిమిట్ కు చేరుకున్న తర్వాత లెన్స్ లు కుంగిపోవటం మొదలైంది. సో మళ్లీ రిఫ్లెక్షన్ టెలిస్కోప్ గా సిద్ధం చేయాల్సి వచ్చింది ఎల్వార్ క్లార్క్ అండ్ సన్స్ కి.

5.  Mount wilson 60 inches Telescope (1908) మౌంట్ విల్సన్ టెలిస్కోప్
విస్కాన్సిన్ లో యెర్కర్స్ రిఫ్రాక్టర్ ను ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించిన జార్జ్ ఎల్లరీ హేల్ అలుపెరగని తన పరిశోధనల్లో భాగంగా ఈశాన్య్ లాస్ ఏంజెల్స్ లోని మౌంట్ విల్స్ పై ఈ టెలిస్కోప్ ను 1908 లో ఏర్పాటు చేశారు. అప్పటికి టాప్ ఆప్టిటీషియన్ గా పేరున్న జార్జ్ రిట్చే ఈ ఒకటిన్నర మీటరు ఉండే ఈ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. దీంట్లోనే తొలిసారిగా వచ్చే లైట్ ను పక్కదారి పట్టించే కోడే సిస్టమ్ ను కూడా డెవలప్ చేశారు.


ఇప్పటికీ చాలా మంది ఆస్ట్రానమర్స్ వేర్వేరు ఇన్స్ట్రుమెంట్స్ లో ఈ కోడే సిస్టమ్ ను వాడటం విశేషం.అంటే ఏం లేదు మనం దేని మీద కాన్స్టట్రేట్ చేసి అబ్జర్వ్ చేస్తున్నామో అది మాత్రమే కనిపించి పక్కన మిగిలిన డిస్ట్రర్బ్ చేస్తున్న లైట్ ను ఎలిమినేట్ చేయటం అన్నమాట. ఇప్పుజు జేమ్స్ వెబ్ లోనూ మైక్రో షట్టర్ సిస్టమ్ ద్వారా చేస్తున్న ఈ లైట్ ఎలిమినేషనే.

సో ఇది 1910 కంటే ముందు ఏర్పాటై మన ఖగోళ శాస్త్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన పాత టెలిస్కోపులు. 1910 తర్వాత వచ్చిన సరికొత్త స్పేస్ టెలిస్కోపులు వాటి వివరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటేనే ఉందాం. 

Published at : 11 Jul 2022 09:32 AM (IST) Tags: Telescope Newton Galileos Refractor Herschels Telescope Galileo Telescope

సంబంధిత కథనాలు

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది