అన్వేషించండి

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని చారిత్రక తీర్పులు ఓసారి చూద్దాం.

Post Independence Verdicts: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులు జరిగాయి. పాలన నుంచి న్యాయవ్యవస్థ వరకు ఎన్నో చారిత్రక ఘటనలు ఉన్నాయి.

రాజ్యాంగాన్ని అనుసరించి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులు తర్వాతి రోజుల్లో ఎన్నో కేసులకు పాఠ్యాంశాలుగా మారాయి. అలాంటి చారిత్రక తీర్పులను ఓసారి చూద్దాం. 

1. ఏకే గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం, 1950

ఏకే గోపాలన్ ఓ కమ్యూనిస్టు లీడర్. 1950లో ముందస్తు నిర్బంధ చట్టం (Preventive Detention Law) కింద ఆయనను మద్రాస్ జైలులో పెట్టారు. అప్పుడు రాజ్యంగంలోని ఆర్టికల్ 32 ఆధారంగా హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి తన నిర్బంధాన్ని ఏకే గోపాలన్ సవాల్ చేశారు. సెక్షన్లు 7, 8, 10, 11, 12, 13, 14లు ఆర్టికల్ 13, 19, 21లను అతిక్రమిస్తున్నాయని ఆయన వాదించారు. 

తీర్పు

ఈ తీర్పు సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఒక స్వతంత్ర కోడ్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సిస్టమ్ రూపొందించిన చట్ట వ్యవస్థ కింద గోపాలన్‌ను నిర్బంధించారని తెలిపింది. ఒక వేళ చట్ట ప్రకారం రూపొందించిన వ్యవస్థ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ నిర్బంధించినప్పుడు ఆ వ్యవస్థ ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేసింది.

అంతేకాదు, సెగ్మెంట్ 14ను సుప్రీంకోర్టు తొలగించింది. ఇది కీలక హక్కులను ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఆ రిట్ పిటిషన్‌ను తొలగిస్తూ ఏకే గోపాలన్ నిర్బంధం చట్టబద్ధమేనని చారిత్రక తీర్పును ఇచ్చింది.

2. కేశవానంద భారతి Vs కేరళ, 1973

భారత న్యాయవ్యవస్థలో కేశవానంద భారతి కేసును చాలా ప్రత్యేకంగా పేర్కొంటారు. 1970లో ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఎదినీర్ మఠానికి కేశవానంద భారతి మఠాధిపతి. కేరళ, కాసర్‌గోడ్‌లో ఈ మఠం ఉంది. అయితే ఆయన పేరు మీద ఆయన కొన్ని భూములను కొనుగోలు చేశారు. అదే సమయంలో అప్పటి కేరళ ప్రభుత్వం భూసంస్కరణల చట్టం 1969ని అమలు చేసింది. దీంతో ఆయన కేసు పెట్టారు.

తీర్పు

ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో కూడిన అతిపెద్ద సుప్రీం ధర్మాసనం విచారించింది. 7-6 రేషియోతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు రాజ్యాంగం మౌలిక స్వభావం, దాని సుస్థిరత్వానికి బీజాలు వేసింది.

పార్లమెంటు చట్టం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించడానికి అర్హమేనని పేర్కొంది. ప్రాథమిక హక్కులు సహా అన్నింటిని పార్లమెంటు సవరించగలదని తెలిపింది. అయితే ఏ సవరణ చేసినా రాజ్యాంగ మౌలిక స్వభావం, దాని ప్రాథమిక నిర్మాణం కోల్పోకుండా ఉండాలని వివరించింది. ఈ నిర్మాణాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మార్చలేరని తన చారిత్రక తీర్పులో స్పష్టం చేసింది. 

3. మేనకా గాంధీ Vs కేంద్ర ప్రభుత్వం, 1977

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోడలు మేనకా గాంధీ పాస్‌పోర్టును 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ చర్యను సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తీర్పు

సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను విచారిస్తూ పౌర స్వేచ్ఛకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకించలేదు.. కానీ ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛ.. పౌరులు తప్పక కలిగి ఉంటారని స్పష్టం చేసింది. ఇది ప్రాథమిక హక్కుల కేసులకు ఎప్పుడూ ఒక దిక్సూచీగా ఉంటుంది. ఈ కేసును ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో 215 సార్లు సుప్రీంకోర్టు ఉల్లేఖించిందంటే దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

4. ఇంద్రసాహ్ని, ఇతరులు Vs కేంద్ర ప్రభుత్వం, ఇతరులు

ఇంద్రసాహ్ని 1993లో అప్పటి నర్సింహా రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కేసు వేశారు. ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 10 శాతం రిజర్వేషన్ ఇస్తుందని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌తో సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లను గరిష్టంగా 50 శాతానికి పెంచుతూ చారిత్రక తీర్పు ఇచ్చింది.

5. ఎస్ఆర్ బొమ్మై Vs కేంద్ర ప్రభుత్వం, 1994

జనతా దళ్ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎస్ఆర్ బొమ్మై 1988 ఆగస్టు 13 నుంచి 1989 ఏప్రిల్ 21 వరకు సీఎంగా చేశారు. 1989 ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఆర్టికల్ 356ను ఉటంకిస్తూ రాష్ట్రపతి నిలిపేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తెచ్చారు.

ఇది సాధారణంగా ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసే ఎత్తుగడ వంటిది. దీంతో రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వాన్ని తొలగించడాన్ని సవాల్ చేస్తూ బొమ్మై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తీర్పు

ఈ పిటిషన్‌ను తొమ్మిది మంది సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. 1994 మార్చి 11న సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉండదని సుప్రీం కోర్టు తేల్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటి వరకు రాష్ట్ర శాసన సభను సస్పెండ్ చేసే అధికారం మాత్రమే రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. 

6. నవతేజ్ సింగ్ జోహర్ Vs కేంద్ర ప్రభుత్వం, 2018

ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీకి చెందిన నవతేజ్ సింగ్ జోహర్, మరో ఐదుగురు ఐపీసీలోని సెక్షన్ 377ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2016లో రిట్ పిటిషన్ వేశారు.

తీర్పు

2018 సెప్టెంబర్ 6న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ సెక్షన్‌ను రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. ఎల్జీబీటీ కమ్యూనిటి సభ్యుల మధ్య ఇరువురి అంగీకారంతో కలిసి జీవితాన్ని పంచుకోవడాన్ని అనుమతించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని వివరించింది. వారికీ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే సేమ్ సెక్స్‌ నేరపూరితం కాదని పేర్కొంది. 

వీటితో పాటు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రామ జన్మభూమి- బాబ్రీమసీదు కేసులో కూడా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఇలా పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు స్వతంత్ర భారతావనిని రాజ్యాంగబద్ధంగా పయనించడానికి ఉపయోగపడ్డాయి.

Also Read: Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!

Also Read: Women Freedom Fighters : బ్రిటిష్ వారికే దడ పుట్టించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు - వీరి గురించి ఎక్కువ మందికి తెలియదు ! ఇవిగో వారి విశేషాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget