Today Top Headlines: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క మెసేజ్‌తో 161 సేవలు- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం- టాప్‌హెడ్‌లైన్స్ ఇవే
Top News: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్,జీహెచ్‌ఎంసీలో గందరగోళం వంటి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్. వాటిని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
9552300009 నెంబర్ గుర్తుపెట్టుకోండి
వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. 161 ప్రభుత్వ సేవల్ని వాట్సాప్ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు పొందవచ్చని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగకుండా సర్టిఫికెట్స్ సైతం ఆన్ లైన్‌లోనే పొందవచ్చు. మొదటి విడతలో రెవెన్యూ, దేవాదాయ, ఏపీఎస్ ఆర్టీసీ, ఎనర్జీ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో దశలో ఈ సేవల సంఖ్యను 360కు పెంచబోతున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరికి బెయిల్- మిగిలింది ఒక్కరే
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలని కోర్టు సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రణీత్ రావు మత్రమే జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరై బయట ఉన్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీకాళహస్తిలో భక్తులకు అవమానం- సిబ్బందిపై అధికారులు వేటు
శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన సెక్యూరిటీ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల ఫిర్యాదుతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇస్తున్నారని సోషల్ మీడియాలో లోకేష్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి విచారణ చేపట్టి సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భవిష్యత్‌తో ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రేటర్‌లో బడ్జెట్ ఫైటింగ్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశ పెట్టే టైంలో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫిబ్రవరి నెలఖారున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరుకు 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 24 నుంచి మొదలు కానున్నాయి. ఈ సారి సమావేశాలు దాదాపు నెలరోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌తోపాటు చాలా కీలకమైన బిల్లులు కూడా ఆమోదించుకోవాలని చూస్తోంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు వైసీపీ రావడం కూడా అనుమానంగానే ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రమే వైసీపీ సభ్యులు, జగన్ వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సమావేశాలకు గైర్హాజరవుతూ వస్తున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

