అన్వేషించండి

Mann ki Baat: మన్‌ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల బ్రేక్ - ప్రధాని మోదీ ప్రకటన

Mann ki Baat: లోక్‌సభ ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.

Mann ki Baat Break: మన్‌ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ్టి (ఫిబ్రవరి 25) ఎపిసోడ్‌లో ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను (Lok Sabha Polls 2024) దృష్టిలో ఉంచుకుని వచ్చే మూడు నెలల పాటు మన్‌ కీ బాత్‌ని కొనసాగించలేనని స్పష్టం చేశారు. మార్చి నెలలో Model Code of Conduct (MCC) అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ కారణంగానే మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి బ్రేక్ ఇవ్వక తప్పదని వివరించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మన్‌ కీ బాత్ కార్యక్రమానికి ఇదే విధంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయాన్నే గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగేలా అందరూ ఓటు వేయాలని కోరారు. 

"మన్‌ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజల కోసమే పెట్టాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే దీన్ని కొనసాగిస్తున్నాను. కానీ...లోక్‌సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే నెలలో అమల్లోకి వచ్చే అవకాశముంది. అందుకే వచ్చే మూడు నెలల పాటు మన్‌ కీ బాత్ కార్యక్రమాన్ని కొనసాగించడం కుదరదు. ఈ విరామం తరవాత 111వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో మీ అందరితో నేను మాట్లాడతాను. ఈ సంఖ్య చాలా శుభప్రదమైంది కూడా. లోక్‌సభ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాను. "

- ప్రధాని నరేంద్ర మోదీ 

 

గుజరాత్‌లోని ద్వారకాలో భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ Sudarshan Setu ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఓఖా, బెయిత్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ వంతెనని నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.979 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకాని ఇది అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు లేన్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్‌పాత్ కోసం 2.50 మీటర్ల వెడల్పుని కేటాయించారు. ఈ ఫుట్‌పాత్‌నీ చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. గోడలపై భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు. ముందు దీన్ని Signature Bridge గా చెప్పిన ప్రభుత్వం ఆ తరవాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది.ఓఖా పోర్ట్‌కి సమీపంలో ఉన్న Beyt Dwarkaలో శ్రీకృష్ణుడి ద్వారాకాధీష్ ఆలయం (Dwarkadhish temple)  ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget