2000 Rupee Note: ఆ తప్పులన్నీ కప్పి పుచ్చుకునేందుకు ఇదే సింగిల్ ట్రిక్ - రూ.2 వేల నోటు ఉపసంహరణపై స్టాలిన్ కౌంటర్
2000 Rupee Note: రూ.2 వేల నోట్లను RBI ఉపసంహరించుకోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సెటైర్లు వేశారు.
![2000 Rupee Note: ఆ తప్పులన్నీ కప్పి పుచ్చుకునేందుకు ఇదే సింగిల్ ట్రిక్ - రూ.2 వేల నోటు ఉపసంహరణపై స్టాలిన్ కౌంటర్ 2000 Rupee Currency Note RBI 'Single Trick To Hide Defeat In Karnataka' Says TN CM Stalin On Withdrawal Of Rs 2,000 Notes 2000 Rupee Note: ఆ తప్పులన్నీ కప్పి పుచ్చుకునేందుకు ఇదే సింగిల్ ట్రిక్ - రూ.2 వేల నోటు ఉపసంహరణపై స్టాలిన్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/231a9e2828abb39506df5c7fcdf7b4e71684562117114517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2000 Rupee Currency Note:
స్టాలిన్ ట్వీట్
రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు RBI సంచలన ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితమే వీటి ప్రింటింగ్ ఆపేసిన RBI ఇప్పుడు అధికారికంగా వాటిని వెనక్కి తీసుకోనుంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ స్పందించారు. కర్ణాటకలో ఎదురైన ఓటమిని కప్పి పుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు. ట్విటర్ హ్యాండిల్‌లో బీజేపీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముడి పెడుతూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు.
"500 అనుమానాలు, 1000 మిస్టరీలు, 2 వేల తప్పులు..కర్ణాటకలోని ఓటమి..వీటన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఒకటే ఒక ట్రిక్ ఉంది. రూ.2 వేల నోటుని రద్దు చేయడం"
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం
500 சந்தேகங்கள்
— M.K.Stalin (@mkstalin) May 20, 2023
1000 மர்மங்கள்
2000 பிழைகள்!
கர்நாடகப் படுதோல்வியை
மறைக்க
ஒற்றைத் தந்திரம்!#2000Note #Demonetisation
కర్ణాటకలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో అక్కడికి చేరుకున్నారు. స్టాలిన్‌ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం సిద్దరామయ్య ఆహ్వానించారు. అయితే...కరెన్సీ నోట్లపై స్టాలిన్ ట్వీట్ చేసిన కాసేపటికే...అక్కడి బీజేపీ యాక్టివ అయింది. వెంటనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై ట్వీట్ చేశారు. కల్తీ మద్యం తాగి అంత మంది చనిపోయినా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
"కల్తీ లిక్కర్ తాగి 22 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు పరిహారంగా ఇచ్చారు. అసలు అలాంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలను నడిపేదే డీఎమ్‌కే పార్టీ. Tasmac ద్వారా రూ.50 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అవినీతిని దాచేందుకు చూస్తున్నారు"
- అన్నమలై, తమిళనాడు బీజేపీ చీఫ్
கள்ளச்சாராயத்தால் 22 மரணங்கள்,
— K.Annamalai (@annamalai_k) May 20, 2023
உயிர் இழப்பிற்கு காரணமானவருக்கு 50,000 ரூபாய் இழப்பீடு,
திமுகவினர் நடத்தும் சாராய ஆலைகள்,
டாஸ்மாக் வருமானம் 50,000 கோடி,
இவை எல்லாம் மறைக்க
நீங்கள் ஓடுவீர்கள் தமிழைத் தேடி.
பாசமா? எல்லாம் வேஷம்! https://t.co/94NSQO8dGs
డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రూ. 2000 నోట్ల వినియోగం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటన కేంద్ర ప్రభుత్వం, దేశంలో నోట్ల కొరతను పూరించడానికి అదే నెలలో కొత్తగా రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిందని చెప్పారు. వచ్చిన కొత్తలో ఈ నోట్లను విపరీతంగా వినియోగించారని, ఇప్పుడు ఆ ధోరణి తగ్గిందని వివరించారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలు బాగా విస్తరించడాన్ని దృష్టిలో ఉంచుకుని, పెద్ద విలువ గల నోట్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోందని, ఇకపై ఆ నోట్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. 2000 రూపాయల నోటు చెలామణిలో లేకపోతే ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. మార్కెట్ నుంచి ₹2000 నోట్లను వెనక్కు తీసుకున్నా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)