Trump: ట్రంట్ వైట్‌హౌస్‌లోకి వెళ్లగానే భారత్‌కు ప్రత్యేక విమానాలు - 18 వేల మంది ఇండియన్స్‌ను గెంటేస్తారట!
18000 Indians: ట్రంప్ పద్దెనిమిది వేల మంది భారతీయుల్ని అమెరికా నుంచి గెంటేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుంచే ఇది జరగనుంది.
18000 Indians on first deportation list as Trump vows action against immigrants: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి వెళ్లగానే మొదట తమ దేశంలో అక్రమంగా, వ్యాలిడ్ పత్రాల్లేకుండా ఉంటున్న వారందర్నీ బయటకు గెంటేయాలనుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలో భారత్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడనుంది. మొత్తంగా పత్రాల్లేకుండా అమెరికాలో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉంటారని వారందర్నీ ట్రంప్ వెనక్కి పంపేస్తారని అంటున్నారు.
వీసా కాలపరిమితి ముగిసిన వారందర్నీ సొంతే దేశాలకు పంపేయనున్న ట్రంప్
అమెరికా డ్రీమ్స్ తో చాలా మంది రకరకాల వీసాలతో అమెరికాకు వెళ్లి ఆ వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్నారు. వారికి వీసా రెన్యూవల్ కావడం లేదు. మళ్లీ ఇండియాకు వస్తే రానివ్వరన్న ఉద్దేశంతో అక్కడే ఉంటున్నారు. కుటంబసభ్యులు అక్కడే ఉండటంతో వారంతా అక్కడే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ వారికి సరైన పత్రాలు ఉండటం లేదు. అలాగే కొన్ని వేల మంది భారతీయులు మెక్సికో, కెనడా నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. వారికి ఎలాంటి పత్రాలు ఉండవు.
Also Read: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
అక్రమంగా వలస వచ్చిన వారినీ గెంటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇలా అక్రమగా ప్రవేశించిన వారిని,సరైన పత్రాలు లేకుండా ఉండే వారందర్నీ అమెరికా నుంచి తరిమేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారసభల్లోనూ చెప్పారు. అయితే ఒక్క ఇండియన్స్ ను కాదు అన్ని దేశాలకు చెందిన పత్రాలు లేని అందర్నీ బయటకు పంపేయబోతున్నారు. ఇందు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోతున్నారు. అమెరికాలో అక్రమంగా ఏ దేశాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీస్తే.. ఇండియన్స దాదాపుగా పద్దెనిమిది వేల మంది ఉండవచ్చని అంచనా వేశారు. అక్రమంగా ఉన్న ఒక్కరిని కూడా క్షమించే అవకాశం లేదని.. అందర్నీ వెళ్లగొట్టేస్తారని చెబుతున్నారు.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
ఏ దేశ పౌరుడు అయినా సరే.. చట్టబద్దంగా లేకపోతే గెంటివేత
ట్రంప్ అమెరికాకు వచ్చే వారిని కూడా నియంత్రిస్తారన్నప్రచారం జరుగుతోంది. విద్యా సంస్థల్లో కాలేజీల్లో చదువుకునే వాళ్లను కూడా రానివ్వరని చెబుతూండటంతో అడ్మిషన్లు తీసుకున్న వాళ్లు ముందుగానే అమెరికాకు వెళ్లిపోతున్నారు. వీసాల జారీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగు పెడుతూండటం.. ప్రవాస భారతీయులకు సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి.