Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 40 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 18,738 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది.
18,738 new COVID19 cases recorded in India in the last 24 hours; Active caseload at 1,34,933 pic.twitter.com/ARKK2okOW9
— ANI (@ANI) August 7, 2022
కొవిడ్ నుంచి తాజాగా 18,558 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు: 4,40,78,506
- మొత్తం మరణాలు: 5,26,689
- యాక్టివ్ కేసులు: 1,34,933
- మొత్తం రికవరీలు: 4,34,84,110
వ్యాక్సినేషన్
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 7, 2022
➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 206.21 Cr (2,06,21,79,411).
➡️ Over 3.94 Cr 1st dose vaccines administered for age group 12-14 years.https://t.co/Gl145kIF8w pic.twitter.com/DxVYAyKcBE
దేశంలో కొత్తగా 29,58,617 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.21 కోట్లు దాటింది. మరో 3,72,910 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో ఇటీవల కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Chandrababu Modi Meet: హాట్ టాపిక్‌గా మోదీ-చంద్రబాబు మీటింగ్, చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలా!
Also Read: Vice President Election 2022: ఉపరాష్ట్రపతి పీఠంపై రైతు బిడ్డ- ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్ విజయం
Also Read: