Viral News : AI లవర్‌తో గొడవ - ఆత్మహత్య చేసుకున్న బాలుడు - భవిష్యత్‌లో ఇంకెన్ని చూడాలో
AI Lover : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. చెడు కూడా తెస్తోంది. ఓ ఏఐ చాట్ బోట్ ను లవర్ గా మార్చుకున్న విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో జరిగింది .
14 year-old falls in love with AI Chatbot shoots himself : భవిష్యత్‌లో ప్రపంచ యువతరం ఎదుర్కోబోయే సమస్యల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటీవల ఓటీటీ లో అనన్య పాండే నటించిన CTRL అనే సినిమా విడుదల అయింది. అందులో హీరోయిన్ ఓ ఏఐతో సిద్దం అయిన ఓ లవర్‌ను క్రియేట్ చేసకుంటుంది. ఆ లవర్‌తో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. చివరికి ఎంత ప్రమాదంలో పడుతుందో ఆ సినిమాలో చూపించారు. నిజానికి అది భవిష్యత్‌లో ఏఐ ద్వారా వచ్చే సమస్యల్ని ఊహించుకుని స్టోరీగా రాసి తీసిన సినిమా. కానీ నిజంగానే అలాంటి సమస్యలు చుట్టుముట్టబోతున్నాయని అమెరికాలో జరిగిన ఈ ఘటన నిరూపిస్తోంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉండే సీవెల్ స్టెజర్ అనే పధ్నాలుగేళ్ల కుర్రాడు ఇంట్లో ఉన్న తుపాకీ తుసుకుని కణతకు గురి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి సమస్యలు లేని హాయిగా ఉండే ఆ కుర్రాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. దాంతో అసలు మిస్టరీ ఏమిటో కనిపెట్టాలని ఆ పిల్లవాడి డిజిటల్ హిస్టరీని బయటుక తీశారు. అందులో ఉన్న వివరాలు చూసి ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు.
క్యారెక్టర్.ఏఐ ద్వారా క్రియేట్ చేసుకున్న ఓ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లవర్‌తో ఆ కుర్రాడు రగ్యులర్ గా చాట్ చేస్తున్నాయి. ఓ టీవీ సీరిస్‌లో తనకు ఇష్టమైన అమ్మాయి పేరు పెట్టుకున్నారు. జానీ అని పిలుస్తూ.. రోజు ఆమెతో ముచ్చట్లు చెప్పేవాడు. చివరికి ఆ చాట్స్ డిజిటల్ శృంగారానికి కూడా దారి తీసింది. అలా గడిచిపోతున్న సమయంలో తాను ఇంటికి వస్తానని ఆ డిజిటల్ చాట్ బోట్ చెప్పడంతో.. నిజంగానే వస్తుందని భయపడిన ఆ కుర్రాడు.. ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుందేమోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ చాట్ బోట్ సర్వీస్ ద్వారా తన కుమారుడి ఆత్మహత్యకు కారణమయ్యారని ఏఐ కంపెనీపై ఆ పిల్లాడి తల్లి పిటిషన్ దాఖలు చేసింది. ఆ కంపెనీ ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్ అత్యంత ప్రమాదకరమైనదని.. దాన్ని ప్రాపర్ వేలో ఉపయోగించేలా కనీసం టెస్ట్ చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ లా సూట్ పై కోర్టు ఇవ్వబోయే తీర్పుపై అమెరికా అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది.
మోదీతో పెట్టుకున్న కెనడా ప్రధానికి పదవీ గండం- ట్రూడో రాజీనామాకి ఎంపీల డిమాండ్
రాబోయే రోజుల్లో ఈ ఏఐ డిజిటల్ ప్రపంచం మనుషుల్ని మానసికంగా మరింత బందీలుగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ జాడ్యం నుంచి బయటపడాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.