సోమాలియాలో ఉగ్రదాడి! 100 మంది మృతి, వందలాది మందికి గాయాలు
Somalia Blast: సోమాలియాలో జరిగిన ఉగ్రదాడిలో 100 మంది మృతి చెందారు.
Somalia Blast:
మొగడిషులో దాడి..
సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించారు. రాజధాని మొగడిషులో రెండు కార్లలో బాంబులు పెట్టి పేల్చారు. ఈ ఉగ్రదాడిలో 100 మంది మృతి చెందారు. విద్యాశాఖ కార్యాలయం వెలుపలే ఈ బీభత్సం జరిగింది. ఈ ఘటనపై సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ స్పందించారు. 300 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. శనివారమే ఈ దాడి జరగ్గా..ముందుగా 30 మంది మృతి చెందినట్టు వెల్లడించారు. ఆ తరవాత మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. ప్రస్తుతానికి 100 మంది చనిపోయినట్టు తేలింది. ఇప్పటి వరకూ
ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడి తామే చేసినట్టు ప్రకటించకపోయినా...అధ్యక్షుడు హసన్ షేక్ మాత్రం ఇది ఉగ్రవాదుల పనే అని స్పష్టం చేస్తున్నారు. Al-Shabaab ఉగ్రసంస్థ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు.
One of the most devastated, poor country faces imperialist violence!
— K K (@kk0000000000) October 30, 2022
Death toll from 2 car explosions in Somalia’s capital, #Mogadishu, has risen to 100, while over 300 others were injured, the Somali National News Agency (SONNA) reports. pic.twitter.com/Vvxn97xJsJ
తరచూ దాడులు..
ఈ ఏడాది ఆగస్ట్‌లోనూ ఉగ్రవాదులు ఇదే విధంగా దాడికి పాల్పడ్డారు. రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై అల్ షహబ్ ( Al-Shabab) టెర్రరిస్ట్ గ్రూప్ దాడి చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌లోని రెండు చోట్ల కార్లలో బాంబులు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. ఆ తరవాత కాల్పులు జరిపారు. ఈ పని చేసింది తామేనని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఘటనలో గాయపడిన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. "హోటల్ హయాత్‌లో రెండు కార్లలో బాంబులు అమర్చారు. ఓ కారు హోటల్ బ్యారియర్‌కు ఢీకొట్టి పేలిపోగా...మరోటి గేట్‌ను ఢీకొట్టి బ్లాస్ట్ అయింది" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఇది ఉగ్రవాదుల పనేనని తేల్చి చెప్పారు. అల్ షహబ్..అల్‌ఖైదాతో లింకులున్న ఉగ్రవాద సంస్థ. సోమాలియాలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దాదాపు పదేళ్లుగా ఇలా అలజడి సృష్టిస్తూనే ఉంది ఈ గ్రూప్. దేశంలో ఇస్లామిక్ లా ని అమలు చేసి...ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది.
ఇప్పుడే కాదు. గతంలోనూ ఇలాంటి దాడులకు తెగబడ్డారు అల్ షహబ్ ఉగ్రవాదులు.
గతేడాది ఆగస్టులో మొగదిషులోనే ఓ హోటల్‌పై దాడి చేసింది. ఆ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇది కూడా తమ పనేనని అప్పట్లో ప్రకటించింది అల్ షహబ్.ఆఫ్రికన్ యూనియన్ ఫోర్స్ (African Union Force) 2011లోనే ఈ ఉగ్రవాదులతో తీవ్ర పోరాటం చేశారు. రాజధానిలో వాళ్ల ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నించారు. కొంత మేర విజయం సాధించినా...ఇంకా కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని తిరుగుతూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే పనిలో ఉన్నారు. గతంలో అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. తమ భద్రతా బలగాలు..13 మంది అల్‌షహబ్ ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ప్రకటించింది.
Also Read: KCR National Politics : ఫామ్‌హౌస్ కేసు కేసీఆర్ అనుకున్నంతగా పేలలేదా ? జాతీయ నేతలు ఎందుకు సైలెంట్ ?