అన్వేషించండి

Manu Charitra Review - 'మను చరిత్ర' రివ్యూ : 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి'లా ఉందా? శివ కందుకూరి ఎలా చేశారు?

Manu Charitra Movie Review In Telugu : శివ కందుకూరి హీరోగా నటించిన తాజా సినిమా 'మను చరిత్ర'. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ : మను చరిత్ర
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివ కందుకూరి, ధనుంజయ్, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాత్సవ్, ప్రియా వడ్లమాని, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, హర్షితా చౌదరి, మధునందన్ తదితరులు
ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్! 
సంగీతం : గోపీసుందర్ 
నిర్మాత : ఎన్. శ్రీనివాస రెడ్డి 
రచన, దర్శకత్వం : భరత్ పెదగాని 
విడుదల తేదీ: జూన్ 23, 2023

'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' వంటి న్యూ ఏజ్ సినిమాలను రాజ్ కందుకూరి ప్రొడ్యూస్ చేశారు. ఆయన తనయుడు శివ కందుకూరి 'చూసి చూడంగానే'తో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత 'గమనం'లో ఓ హీరోగా చేశారు. ఆయన నటించిన తాజా సినిమా 'మను చరిత్ర' (Manu Charitra Movie). ప్రీ రిలీజ్ వేడుకలో ప్రచార చిత్రాలు చూస్తే 'ఆర్ఎక్స్ 100' వైబ్స్ కనపడుతున్నాయని హీరో కార్తికేయ అన్నారు. మరి, సినిమా ఎలా ఉంది?

కథ (Manu Charitra Movie Story) : మను దుర్గరాజు (శివ కందుకూరి) వరంగల్ కుర్రాడు. శ్రావ్య (ప్రియా వడ్లమాని)ని ప్రేమిస్తాడు. ఆమె కోసం వాళ్ళ అన్నయ్య చేత తన్నులు తింటాడు. శ్రావ్య ప్రేమలో పడి దగ్గరయ్యే సరికి బ్రేకప్ చెబుతాడు. ఆ తర్వాత కొంత మంది అమ్మాయిలతో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రేమించిన కొన్నాళ్ళకు ఎందుకు బ్రేకప్ చెబుతున్నాడు? గతంలో జెన్నిఫర్ (మేఘా ఆకాష్)తో ప్రేమకథ అతడికి ఎటువంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది? జాను (ప్రగతి శ్రీవాత్సవ్) రాకతో మను జీవితంలో ఏం జరిగింది? వరంగల్ మేయర్ జనార్దన్ (శ్రీకాంత్ అయ్యంగార్)తో పాటు మరికొందరి హత్యలకు, మనుకు సంబంధం ఏమిటి? పోలీసులు అతడి వెంట ఎందుకు పడుతున్నారు? రౌడీ రుద్ర ప్రతాప్ (ధనుంజయ్) దగ్గర మను ఎందుకు పని చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Manu Charitra Movie Review) : తెలుగులో ప్రేమకథలు చాలా వచ్చాయి. అయితే... 'ప్రేమ చేసిన గాయానికి మందు ప్రేమ మాత్రమే' అని చెప్పే సినిమా 'మను చరిత్ర'. పాయింట్ పరంగా కాస్త కొత్తగా ఉంది. అయితే... దానిని చెప్పిన తీరు పాతగా ఉంది. 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనపడతాయి. మ్యాగ్జిమమ్ శివ కందుకూరి నటన కొత్తగా ఫీలయ్యేలా చేసింది.

ఒక కొత్త పాయింట్ తీసుకుని కమర్షియల్ సినిమాగా 'మను చరిత్ర'ను మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు భరత్! ఒకానొక సమయంలో అసలు పాయింట్ నుంచి పక్కకి వెళ్ళి ప్రేమకథకు రొటీన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో లెంగ్త్ చాలా ఎక్కువ అయ్యింది. సినిమాలోకి బోరింగ్ మూమెంట్స్ వచ్చాయి. ఈజీగా అరగంట నిడివి తగ్గిస్తే సినిమా మరింత క్రిస్పీగా అయ్యి బావుండేది. 

'మను చరిత్ర'లో స్క్రీన్ మీద హీరో శివ కందుకూరి అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో సంగీత దర్శకుడు గోపీసుందర్. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. యాక్షన్ సీన్లకు ఇచ్చిన ఆర్ఆర్ బావుంది. ఇటు యాక్షన్, అటు లవ్... రెండిటినీ బ్యాలన్స్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమా ఆసక్తికరంగా మొదలైంది. కాసేపటికి రొటీన్ ఫార్మటులోకి వెళ్ళింది. సెకండాఫ్ మళ్ళీ ఆసక్తిగా సాగింది. నిదానంగా సాగడంతో ముగింపు కోసం ఎదురు చూసేలా దర్శకుడు తీశాడు. 

నటీనటులు ఎలా చేశారు? : హీరోగా కెరీర్ తొలినాళ్ళలో శివ కందుకూరికి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్ దక్కింది. రెండు లుక్స్‌లో కనిపించారు. గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్ ఆయనకు సూట్ అయ్యింది. 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి' తరహాలో ఇంటెన్స్ యాక్టింగ్ చేశారు. ఫ్లాష్‌బ్యాక్ ప్రేమకథలో క్యూట్ లుక్ కూడా ఓకే. అయితే... సీరియస్, యాక్షన్ క్యారెక్టర్లకు శివ కందుకూరి సూట్ అవుతారని 'మను చరిత్ర' ప్రూవ్ చేసింది. 

హీరోయిన్లు అందరిలో మేఘా ఆకాష్ (Megha Akash)కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కింది. జెన్నీ పాత్రలో ఆమె నటన ఓకే. అయితే... జానుగా ప్రగతి శ్రీవాత్సవ్ ఆకట్టుకుంటారు. ప్రియా వడ్లమాని, హర్షితా చౌదరి పాత్రల నిడివి పరిమితమే. మేయర్ జనార్ధన్ పాత్రకు శ్రీకాంత్ అయ్యంగార్, రుద్ర ప్రతాప్ పాత్రకు ధనుంజయ్ న్యాయం చేశారు. పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో స్నేహితునిగా సుహాస్ ఓకే. 

Also Read : 'అశ్విన్స్' రివ్యూ : 'విరూపాక్ష'లా భయపెడుతుందా? SVCCకి మరో హిట్ వస్తుందా?

చివరగా చెప్పేది ఏంటంటే? : 'మను చరిత్ర'లో తీసుకున్న పాయింట్ కొత్తది. కానీ, ట్రీట్మెంట్ రొటీన్‌గా ఉంది. గోపీసుందర్ సంగీతం బావుంది. హీరో శివ కందుకూరిని నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఇంటెన్స్, యాక్షన్ క్యారెక్టర్లకు కూడా శివ సూట్ అవుతారు. 

Also Read 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget