Madharaasi Review - 'మదరాసి' రివ్యూ: 'తుపాకీ' టైపులో ఉందా? మురుగదాస్ ఈజ్ బ్యాక్ అనొచ్చా? శివకార్తికేయన్ సినిమా హిట్టేనా?
Madharaasi Review Telugu: శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా 'మదరాసి'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
ఏఆర్ మురుగదాస్
శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్, విద్యుత్ జమాల్, బిజూ మీనన్ తదితరులు
Sivakarthikeyan's Madharaasi Review In Telugu: శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా 'మదరాసి'. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. 'సికిందర్' ఫ్లాప్ తర్వాత మురుగదాస్ తీసిన చిత్రమిది. సల్మాన్ వల్ల ఆ సినిమా ఆడలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయినా అంచనాలు బావుండటానికి కారణం హీరో శివకార్తికేయన్. అంతకు ముందు దర్శకుడు తీసిన సినిమాలు. పైగా, ప్రచార చిత్రాలు బావున్నాయి. రుక్మిణీ వసంత్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Madharaasi Story Telugu): తమిళనాడులోకి ఆరు కంటెయినర్లలో గన్స్ వస్తున్నాయని ఎన్ఐఏకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్ (బిజు మీనన్) తన టీమ్ తో దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ అనుకోకుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ విరాట్ (విద్యుత్ జమ్వాల్) అందరినీ బోల్తా కొట్టించి తమిళనాడులోకి గన్స్ తీసుకెళ్లిపోతాడు. అక్కడ జరిగిన గొడవలో ప్రేమ్ తీవ్రంగా గాయాల పాలవుతాడు.
మరోవైపు లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు రఘు (శివ కార్తికేయన్). అనుకోకుండా ప్రేమ్, రఘు ఒకే ఆంబులెన్స్ లో ఆస్పత్రికి వెళ్తారు. ఈ మిషన్ లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ (Madharaasi Review Telugu): 'గజినీ', 'తుపాకీ', 'కత్తి'... యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో మురుగుదాస్‌కు సపరేట్ స్టయిల్ ఉంది. యాక్షన్ సీన్స్ తీయడంలో, యాక్షన్ సన్నివేశాలకు కామెడీ మేళవించడంలో ఆయనది సపరేట్ స్టయిల్. ఈ 'మదరాసి'లో ఆ మురుగదాస్ మళ్ళీ కనిపించారు.
'మదరాసి' కథలో పోరాటం హీరోది కాదు. కానీ, తనది కాని శత్రువుతో తాను ఫైట్ చేయాలని హీరో అనుకోవడం, ఆ పాయింట్ కన్వీన్సింగ్‌గా చెప్పడంలో ఏఆర్ మురుగదాస్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. చావాలని అనుకున్న హీరో... తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటడం బావుంటుంది. అయితే ఈ కథలో ప్రేమ అంతగా అతకలేదు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెరపై కనిపిస్తున్నంత సేపు ఆమెను చూస్తుంటారు. అయితే ప్రేమ కథను సాగదీశారు. బ్యాక్ టు బ్యాక్... ఇంటర్వెల్ ముందు మూడు పాటలు రావడం ఇబ్బంది కలిగించింది. సెకండాఫ్ వచ్చే సరికి యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ బావుంది. కానీ కథ తక్కువైంది. అయితే చూడబుల్‌గా ముందుకు వెళ్ళింది.
'సికిందర్'తో కంపేర్ చేస్తే మురుగదాస్ నుంచి మంచి ప్రోడక్ట్ ఇది. రోలర్ కోస్టర్ రైడ్ కింద మధ్య మధ్యలో కిందకు వెళ్ళినా ఓవరాల్‌గా ఒక విధమైన శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది. ఇటీవల ప్రతి సినిమాకు సంగీతంతో ప్రాణం పోస్తున్న అనిరుధ్... ఈ మూవీకి పాటలు, ఆర్ఆర్ విషయంలో అన్యాయం చేశారు. ఆయన మ్యూజిక్ డిజప్పాయింట్ చేస్తుంది. కెమెరా వర్క్ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.
Also Read: 'ఘాటీ' రివ్యూ: క్రిష్ నుంచి పుష్ప, దసరా రేంజ్ రస్టిక్ యాక్షన్... అనుష్క సినిమా హిట్టా? ఫట్టా?
శివకార్తికేయన్ మరోసారి తన ప్రతిభ చూపించారు. ఆయనది టిపికల్ కామెడీ టైమింగ్. దాన్ని మురుగదాస్ బాగా వాడుకున్నారు. సీరియస్ యాక్షన్ మధ్యలో కామెడీని భలే మిక్స్ చేశారు. నవ్విస్తుంది కూడా! విద్యుత్ జమాల్ మరోసారి విలనీ రోల్ కుమ్మేశారు. రుక్మిణీ వసంత్ అందంతో, అభినయంతో కట్టిపడేస్తుంది. మిగతా నటీనటులు ఓకే.
ఏఆర్ మురుగదాస్ ఈసారి మంచి పొటెన్షియల్ ఉన్న కథతో 'మదరాసి' తీశారు. ఈ తరహా సినిమాల్లో ప్రేమకథ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. పోనీ ఆ ప్రేమ నేపథ్యంలో వచ్చే పాటలు బావున్నా పాస్ అయిపోయేది. అనిరుధ్ సంగీతం, ఆర్ఆర్ మిస్ ఫైర్ అవ్వడం వల్ల లవ్ స్టోరీ ఆకట్టుకోలేదు. అయితే కథతో పాటు యాక్షన్ సీన్స్, కామెడీ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు శాటిస్‌ఫై చేస్తాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు. శివకార్తికేయన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు.
Also Read: 'లిటిల్ హార్ట్స్' రివ్యూ: ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లవ్ స్టోరీ... బాహుబలి కనెక్షన్ ఏంటి?





















