'మదరాసి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? శివకార్తికేయన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

'మదరాసి'ని శ్రీలక్ష్మి పిక్చర్స్ అధినేత ఎన్వీ ప్రసాద్ (తిరుపతి ప్రసాద్) ప్రొడ్యూస్ చేశారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఎన్వీ ప్రసాద్ సొంతంగా శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. 

తమిళనాడులో 'మదరాసి' రైట్స్ ఎంఎస్ఎం పిక్చర్స్ విడుదల చేస్తోంది. ఆ రైట్స్ వేల్యూ 25 కోట్ల కంటే ఎక్కువ. 

ఓవర్సీస్ రైట్స్ 11 కోట్లకు ఫారాస్ ఫిలిమ్స్ తీసుకుంది. 

కర్ణాటక రైట్స్ ఎస్ పిక్చర్స్ ఐదు కోట్ల రూపాయలకు తీసుకుంది. నార్త్ ఇండియన్ రైట్స్ వేల్యూ పది కోట్ల కింద లెక్క కట్టారు.

'మదరాసి' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వేల్యూ 65 నుంచి 75 కోట్ల మధ్య ఉంటుందని టాక్.

'మదరాసి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ 40 కోట్లకు అమెజాన్, టీవీ శాటిలైట్ రైట్స్ రూ. 25 కోట్లకు జీ సంస్థ తీసుకుందట.

థియేటర్స్ నుంచి సుమారు 80 కోట్ల షేర్, రూ. 150 కోట్ల గ్రాస్ రాబడితే 'మదరాసి' హిట్ కింద లెక్క.