అన్వేషించండి

KBKJ Review: కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ రివ్యూ: సౌత్ రీమేక్‌తో అయినా సల్మాన్ హిట్టు కొట్టాడా? ఆరేళ్ల హిట్టు కల తీరిందా?

సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఎలా ఉంది?

సినిమా రివ్యూ : కిసీ కా భాయ్ కిసీ కీ జాన్
రేటింగ్ : 2/5
నటీనటులు : సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్, జగపతి బాబు, భూమిక, విజేందర్ సింగ్ అతిథి పాత్రలో రామ్ చరణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : వి. మణికందన్
పాటలు : రవి బస్రూర్, హిమేష్ రేషమ్మియా, సాజిద్ ఖాన్, సుక్బీర్, పాయల్ దేవ్, దేవిశ్రీ ప్రసాద్, అర్మాన్ మాలిక్
నేపథ్య సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : సల్మా ఖాన్
మూల కథ : శివ (వీరం)
రచన : ఫర్హాద్ సమ్జీ, స్పర్ష్ కేత్పాల్, తాషా భంబ్రా
దర్శకత్వం : ఫర్హాద్ సమ్జీ
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022

బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్‌కు దేశమంతటా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి సంవత్సరం ఈద్ సందర్భంగా ఒక సినిమా విడుదల చేసి బ్లాక్‌బస్టర్ కొట్టడం భాయ్‌కున్న అలవాటు. అయితే కోవిడ్ పుణ్యమా అని 2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత మరో సల్మాన్ ఖాన్ సినిమా ఈద్ పండుగకు రాలేదు. ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత్ ఈద్ బాక్సాఫీస్‌ను వేటాడటానికి ఆకలిగొన్న సింహంలా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో రెడీ అయ్యారు. ఈ సినిమాలో కొంత భాగం తెలుగు నేటివిటీతో సాగుతుంది. దీంతో పాటు తెలుగు టాప్ హీరో వెంకటేష్ కీలకమైన పాత్రలో కనిపించగా, టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ... సల్మాన్ భాయ్ సరసన నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో ఒక పాటతో స్టెప్పులు కూడా వేయించారు. మరి ఇంత పకడ్బందీగా తీసిన భాయ్ సినిమా ఎలా ఉంది?

కథ: భాయ్‌జాన్ (సల్మాన్ ఖాన్) ఒక అనాథ. తన లాంటి ముగ్గురు అనాథలను వారి చిన్నప్పటి నుంచి తమ్ముళ్లుగా పెంచుకుంటూ ఉంటాడు. వారు భాయ్ జాన్ సొంత తమ్ముళ్లు కాదన్న సంగతి వారికి కూడా తెలీదు. తామంతా ఎప్పటికీ కలిసుండాలంటే పెళ్లి చేసుకోకూడదని భాయ్‌జాన్ అభిప్రాయం. కానీ ముగ్గురు తమ్ముళ్లూ ముగ్గురు అమ్మాయిలను ఇష్టపడతారు. కానీ అన్న కూడా ఎవరినో ఒకరిని ఇష్టపడితే తప్ప తమకు పెళ్లి కాదని వారికి అర్థం అవుతుంది. ఇంతలో భాయ్‌జాన్‌కు భాగ్యలక్ష్మి (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది.  భాయ్‌జాన్ గురించి అబద్ధాలు చెప్పి ఆయనను భాగ్యలక్ష్మి ఇష్టపడేలా చేస్తారు. భాయ్‌జాన్ కూడా భాగ్యలక్ష్మిని ఇష్టపడతాడు. కానీ భాయ్‌జాన్ ఒక రౌడీ అని తెలుస్తుంది. ఇంతలోనే భాగ్యలక్ష్మిపై అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ఎవరు చేయించారు? భాగ్యలక్ష్మి అన్నయ్య బాలకృష్ణ గుండమనేని (వెంకటేష్) ఎవరు? నాగేశ్వర్‌కు (జగపతిబాబు) ఈ కథతో సంబంధం ఏంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 2014లో తమిళంలో వచ్చిన ‘వీరం’ పెద్ద హిట్ సినిమా. 2017లో తెలుగులో కూడా ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం కథను రీమేక్ చేయడంలో తప్పు లేదు కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు మార్పులు చేసుకోవాలి. కానీ 2014 కథకు 1980ల నాటి ట్రీట్‌మెంట్ ఇచ్చి పూర్తిగా నీరసం తెప్పించేశారు. కానీ ఈ సినిమాలో ఒక గొప్పదనం ఉంది. సినిమా మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా, పొరపాటున సినిమా చూస్తూ కాసేపు నిద్ర పోయి లేచినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. ఏ సీన్ చూసినా దీనికి ముందు ఇది జరిగి ఉండవచ్చు అనుకునేంత ప్రిడిక్టబుల్‌గా స్క్రీన్‌ప్లే ఉంది.

ఈ మధ్య బాలీవుడ్ మేకర్స్‌కు సౌత్ ఫ్లేవర్‌లో సినిమాలు తీయాలనే కోరిక ఎక్కువ అవుతుంది. కానీ ఈ సినిమా దర్శకుడు ఫర్హాద్ సమ్జీ మరో అడుగు ముందుకేసి ఏకంగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లోనే సెకండాఫ్ మొత్తం ప్లాన్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ‘వెల్‌కం టు సౌత్ ఇండియా’ అని వేశారు. వెంకటేష్, జగపతిబాబు, భూమిక, రోహిణి హట్టంగడిలు ఉన్న సెకండాఫ్ చూస్తుంటే ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ మరో సినిమా చూసినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు సెకండాఫ్‌లో సగం డైలాగులు తెలుగులోనే ఉంటాయి. కొన్నిసార్లు ఒకే వాక్యంలో కూడా సగాన్ని హిందీలో, మిగతా సగాన్ని తెలుగులో చెప్పించి భాషాపరమైన కిచిడీ కూడా చేసేశారు. ఇక క్లైమ్యాక్స్‌లో విలన్ రాయితో హీరో నెత్తి మీద ఆపకుండా పది దెబ్బలు కొట్టినా సరే చుట్టుపక్కల జనాలు విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయగానే లేచి హీరో విలన్లను పిచ్చి కొట్టుడు కొట్టడం చూస్తే స్క్రీన్‌ప్లే రాసిన పెన్ను టైమ్ ట్రావెల్ చేసి 1980ల్లోకి వెళ్లిందా అనిపిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల లవ్ ట్రాక్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్‌లో వచ్చే ‘ఏంటమ్మా’ సాంగ్‌లో రామ్ చరణ్ కామియో ఇప్పటికే వీడియో సాంగ్ ద్వారా చూసేశాం.

సల్మాన్ ఖాన్, తన తమ్ముళ్ల పాత్రధారుల మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా భాయ్ మరీ ఓవర్ ది బోర్డ్ కాకుండా ఉండటం ఊరటనిస్తుంది. సల్మాన్ ఖాయ్ సిక్స్ ప్యాక్ ఫ్యాన్స్‌కి మంచి కిక్కిచ్చే సీన్ కూడా ఉంది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... సల్మాన్ ఖాన్‌కు ఇటువంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. తమ్ముళ్లతో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. భాగ్యలక్ష్మి పాత్రలో పూజా హెగ్డే ఆకట్టుకుంటుంది. తను కూడా ఇటువంటి పాత్రలు ఇంతకు ముందు చేసింది. ఇండియన్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌ను విలన్‌గా చూపించారు. కానీ అతని పాత్రలో ప్రత్యేకత ఏమీ లేదు. జగపతి బాబుది కూడా రెగ్యులర్ విలన్ క్యారెక్టరే.

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ‘రానా నాయుడు’ చేసిన పుండు మీద కారం చల్లే తరహా పాత్ర ఇది. వెంకటేష్ క్యారెక్టర్‌ను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాక కూడా క్లైమ్యాక్స్‌లో పడిపోయిన సల్మాన్ ఖాన్ లేవాలని విజిల్స్ కొడుతూ ఉండేంత గొప్పగా రైటింగ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందులో ‘నారప్ప’ సినిమాలోని ఒక సన్నివేశాన్ని పోలిన సీన్ కూడా ఉంది. ‘నారప్ప’ లాంటి ఎక్స్‌పరిమెంటల్, కొత్త తరహా సినిమాల్లో అయితే పర్లేదు కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉంటే తనను అభిమానించే ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా హర్ట్ అవుతారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... 2017లో వచ్చిన ‘టైగర్ జిందా హై’ తర్వాత భాయ్ ఇంతవరకు హిట్ కొట్టలేదు. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా సల్మాన్ హిట్టు దాహాన్ని తీర్చలేదు. ఇదే సంవత్సరం చివర్లో రానున్న ‘టైగర్ 3’తో అయినా భాయ్ హిట్టు కొడతాడేమో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget