అన్వేషించండి

Case Of Kondana OTT Movie Review: ఓర్నీ, చిన్న కారణానికే హత్య? ట్విస్టులతో పిచ్చెక్కిస్తున్న భావన లేటెస్ట్ థ్రిల్లర్

Case Of Kondana Review: ఒక్కరోజులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల జీవితాలు తారుమారు అయ్యాయి. అదేంటో తెలుసుకోవాలంటే ‘కేస్ ఆఫ్ కొండాన’ చూడాల్సిందే. ఈ మూవీ కన్నడతో పాటు మలయాళంలో కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.

Director

దేవి ప్రసాద్ శెట్టి

Starring

విజయ్ రాఘవేంద్ర, ఖుషి రవి, భావన

Available On

Amazon Prime

Case Of Kondana Review In Telugu: పోలీస్ డ్రామాలలో సరైన ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తే అది మంచి థ్రిల్లర్ అవుతుంది. తాజాగా విడుదలయిన ‘కేస్ ఆఫ్ కొండానా’ అనే మూవీ కూడా ఇదే కేటగిరికి చెందుతుంది. ఈ కన్నడ చిత్రం థియేటర్లలో రికార్డులు బ్రేక్ చేసి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలియకుండా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేయాల్సి ఉంటుంది. ఇదే కథపై స్టోరీ నడుస్తుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా.. ఆ తప్పు వల్ల హీరో జీవితమే మలుపు తిరుగుతుంది. ఈ అంశంపై కథను ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు దర్శకుడు దేవి ప్రసాద్ శెట్టి. 

కథ..

కథ విషయానికొస్తే.. ‘కేస్ ఆఫ్ కొండాన’ సినిమా మొత్తం.. కర్ణాటకలోని  కొండాన అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడే జరుగుతున్న ఒక సీరియల్ కిల్లర్ కేసును ఛేదించడానికి ఏసీపీ లక్ష్మి (భావన) రంగంలోకి దిగుతుంది. అదే సమయంలో ఏఎస్ఐగా విల్సన్ (విజయ్ రాఘవేంద్ర)  కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఒక ప్రమాదంలో తన చేతికి గాయమవుతుంది. దీంతో ఒక పానీ పూరి బండి దగ్గర ఆగి ఆ పానీ పూరి అమ్మే వ్యక్తిని కారులో బ్యాండేజ్ ఉందని తీసుకురమ్మని అడుగుతాడు. కానీ కారు దగ్గరకు వెళ్లిన ఆ వ్యక్తి అందులో డబ్బును దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయాన్ని విల్సన్ గమనిస్తాడు. విల్సన్‌‌కు ఆవేశం ఎక్కువ. దీంతో ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. ఆ ప్రమాదంలో పానీ పూరీ అమ్మే వ్యక్తి చనిపోతాడు.

ఆవేశంతో ఒక అమాయకుడి ప్రాణం తీస్తాడు ఏఎస్ఐ విల్సన్. దీంతో తన జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్న ఏసీపీ లక్ష్మికి తెలియకుండానే విల్సన్ టార్గెట్ అవుతాడు. ఆవేశంలో తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ అయిన విల్సన్.. క్రిమినల్ లాగా ఆలోచించడం మొదలుపెడతాడు. పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూస్తాడు. ఇందులో తన గర్ల్‌ఫ్రెండ్ డాక్టర్ సుహానా (ఖుషి రవి) ఎలా ఇరుక్కుంది? ఏసీపీ లక్ష్మితో పాటు పెద్ద రౌడీ గ్యాంగ్‌కు విల్సన్ ఎలా టార్గెట్ అయ్యాడు? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ. 

Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?

విశ్లేషణ..

‘కేస్ ఆఫ్ కొండాన’ అనేది కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథ. దీంతో సినిమా ఎక్కువగా ల్యాగ్ అయ్యే అవకాశమే లేకుండా ప్లాన్ చేశాడు దర్శకుడు దేవి ప్రసాద్ శెట్టి. కథలోకి వెళ్లడానికి మొదటి 20 నిమిషాలు సమయం తీసుకుంటుంది. అప్పుడు ప్రేక్షకులు కాస్త ఓపికతో ఉండాలి. ఆ తర్వాత ఒక ట్విస్ట్‌ను అర్థం చేసుకునేలోపే మరో ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌ కాస్త మెల్లగా సాగినా.. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులతో నిండిపోయి ప్రేక్షకులకు మంచి థ్రిల్లర్‌ను అందించినట్టుగా అనిపిస్తుంది. ఏ ట్విస్ట్ గురించి రివీల్ చేసినా.. సినిమాలోని మజా మిస్ అవుతుంది. కానీ ఆవేశంతో ఏఎస్ఐ విల్సన్, నేరస్తులకు శిక్ష పడాలనే ఆలోచనతో చట్టాన్ని చేతులోకి తీసుకున్న ఏసీపీ లక్ష్మి.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఏర్పడేలా చేస్తుంది.

పాత కాంబినేషన్..

దేవి ప్రసాద్ శెట్టి, విజయ్ రాఘవేంద్ర కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సీతారామ్ బినాయ్ కేస్ నెం. 18’ అనే పోలీస్ డ్రామా తెరకెక్కింది. దానిని కూడా ఒక థ్రిల్లర్‌లాగానే తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈసారి ‘కేస్ ఆఫ్ కొండాన’తో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు అంటే ల్యాగ్ ఉండకూడదు. ఆ విషయంలో ‘కేస్ ఆఫ్ కొండాన’ సూపర్ సక్సెస్‌ అయ్యింది. జనవరి 26న థియేటర్లలో విడుదలయిన ఈ మూవీ.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒరిజినల్‌గా కన్నడ మూవీ అయినా కూడా ‘కేస్ ఆఫ్ కొండాన’ మలయాళం డబ్బింగ్ వర్షన్ కూడా ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: బడే మియా చోటే మియా రివ్యూ: వరదరాజ మన్నార్‌తో బాలీవుడ్ హీరోల ఢీ - ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget