By: Saketh Reddy Eleti | Updated at : 10 Jun 2022 02:23 PM (IST)
777 చార్లీ రివ్యూ (Image Credits: Paramvah Studios)
777 చార్లీ
Drama
దర్శకుడు: కె.కిరణ్ రాజ్
Artist: రక్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.శెట్టి, బాబీ సింహా తదితరులు
సినిమా రివ్యూ: 777 చార్లీ
రేటింగ్: 3/5
నటీనటులు: రక్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.శెట్టి, బాబీ సింహా తదితరులు
సంగీతం: నోబిన్ పాల్
నిర్మాణ సంస్థ: పరంవా స్టూడియోస్
దర్శకత్వం: కె.కిరణ్ రాజ్
విడుదల తేదీ: జూన్ 10, 2022
కన్నడనాట విలక్షణ సినిమాలకు పెట్టింది పేరైన హీరో రక్షిత్ శెట్టి. 2019లో వచ్చిన ‘అవనే శ్రీమన్నారాయణ’ (తెలుగులో అతడే శ్రీమన్నారాయణ) సినిమా తర్వాత 777 చార్లీ అనే ప్రత్యేకమైన సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో హీరోతో సమానంగా కుక్కకు కూడా ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంది?
కథ: ధర్మ (రక్షిత్ శెట్టి) తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. అప్పట్నుంచి తనకు ఒంటరితనం అలవాటు అవుతుంది. తన ఊర్లోనే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ నిస్సారమైన జీవితం గడుపుతూ ఉంటాడు. తన జీవితంలోకి ఒక కుక్క వస్తుంది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత క్రమంగా ధర్మ కూడా ఆ కుక్క మీద ఇష్టం పెంచుకుంటాడు. దానికి చార్లీ అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఇంతలో చార్లీకి క్యాన్సర్ అని, తను ఎక్కువ కాలం బతకదని తెలుస్తుంది. దీంతో చార్లీ చనిపోయేలోపు తనకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లాలని ధర్మ అనుకుంటాడు. అసలు చార్లీకి క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? చార్లీ బతికిందా? చార్లీకి బాగా అటాచ్ అయిన ధర్మ ఏమయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే 777 చార్లీ చూడాల్సిందే.
విశ్లేషణ: సాధారణంగా ఇప్పటివరకు వచ్చిన డాగ్ బేస్డ్ సినిమాల్లో కుక్కకి, మనిషి మీద ఉండే ఎమోషన్‌ను ఎక్కువగా చూపించారు. కుక్కలు మనుషులకు ఎంత విశ్వాసంగా ఉంటాయి, ఒక్కసారి యజమానిని ప్రేమిస్తే వాటి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుంది వంటివే మనం ఎక్కువగా చూశాం. కానీ 777 చార్లీ ఈ పాయింట్‌కు రివర్స్‌లో ఉండే కథ. ఒక మనిషి కుక్కను ఎంత ప్రేమించాడు అనేది ఈ సినిమాలో ప్రధాన పాయింట్. దర్శకుడు కిరణ్ రాజ్ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు. ఇటువంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవడమే సాహసం. అయితే ఆ సాహసాన్ని కిరణ్‌రాజ్ సక్సెస్‌ఫుల్‌గా సాధించారు. కొన్ని సన్నివేశాల్లో మనకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
రక్షిత్ శెట్టి, చార్లీ మధ్య ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. కుక్క అలవాటు అవ్వకముందు రక్షిత్ శెట్టి పడే ఇబ్బందులు ఫన్నీగా చూపించారు. వీరిద్దరి మధ్య బాండ్ పెరిగేకొద్దీ సినిమా ఎమోషనల్‌గా మారుతుంది. సినిమా ముగింపు ఊహించిందే అయినా అక్కడ వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా వచ్చే అనవసర సన్నివేశాలు, కొన్ని సన్నివేశాల్లో మెలో డ్రామా ఎక్కువ అవ్వడం కొంచెం మైనస్.
నోబిన్ పాల్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అరవింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్. ముఖ్యంగా కశ్మీర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు విజువల్‌గా అద్భుతంగా ఉంటాయి. ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ సినిమాలో ప్రధాన పాత్రలు రెండే. రక్షిత్ శెట్టి, చార్లీ పాత్ర పోషించిన కుక్క. ఈ కుక్క పేరు కూడా చార్లీనే. ఎమోషనల్ సన్నివేశాల్లో రక్షిత్ శెట్టి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో అయితే ఏడిపించేస్తాడు. తను ఎంత మంచి నటుడో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఇక చార్లీ నుంచి కూడా అద్బుతంగా నటన రాబట్టారు. ఈ కుక్కకు కూడా అవార్డులు ఇవ్వాలని ఈ సినిమాను ట్వీట్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా నటించిందో. రక్షిత్ శెట్టి ఎంత ఎమోషనల్‌గా నటించాడో... చార్లీ కూడా అంతే అద్భుతంగా నటిస్తుంది. ఇక మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కామియో కూడా ఆకట్టుకుంటుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు పెట్ లవర్స్ అయితే కచ్చితంగా చూడాల్సిన సినిమా 777 చార్లీ. ఒకవేళ కాకపోతే ఈ సినిమా చూస్తే కచ్చితంగా పెట్స్‌ను ప్రేమిస్తారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది
Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా
Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!
Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>