Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?
Earth Second Moon 2024: భూమికి రెండో చంద్రుడు రాబోతుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా.. ఇదొక కాస్మిక్ సర్ప్రైజ్ అని స్పేస్ సైంటిస్ట్‌లు చెప్తున్నారు. అసలు Earh కి రెండో మూన్ రావడం ఏంటి? ఈ యూనివర్స్ పుట్టినప్పటి నుంచి భూమికి ఉన్న ఒకే ఒక నేచురల్ శాటిలైట్ చంద్రుడు. అప్పటికి ఇప్పటికి ఎర్త్ నుంచి మనం చాలా సులభంగా చూడగలిగేది ఈ చంద్రు డనే ఉపగ్రహాన్ని మాత్రమే. ఇప్పటిదాకా భూమికి ఒకే ఒక చంద్రుడు ఉండగా... ఇంకో చంద్రుడు కూడా యాడ్ అవనున్నట్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టెంబర్ 29 నుంచి భూమి, చంద్రుడికి తోడుగా ఇంకో ఖగోళ వస్తువు కూడా కలుస్తుంది. దీన్నే మినీ మూన్ అని సైంటిస్ట్ లు పిలుస్తున్నారు. సాధారణంగా స్పేస్‌లో గ్రహశకలాలు వాటికి నచ్చిన దిశలో కదులుతూ ఉంటాయి. అంటే దగ్గర్లోని ఏ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ వాటి మీద పని చేస్తే అటువైపుగా కదులుతుంటాయి.