Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Anitha : వైసీపీ అధినేత జగన్ తనలా ధైర్యంగా హిందువుగా ప్రకటించుకోవాలని హోంమంత్రి అనిత చేసిన సవాల్ వైరల్‌గా మారింది. వైసీపీ అనిత తాను క్రిస్టియన్‌ను అని అనిత చెబుతున్న వీడియోను విడుదల చేసింది.
YSP has released a video of Home Minister Anita saying she is a Christian : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అంతా హిందూ, క్రిస్టియన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడైతే లడ్డూ కల్తీ వివాదం తెరపైకి వచ్చిందో అప్పట్నుంచి ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది. ఈ వివాదం తర్వాత జగన్ తిరుమల పర్యటనను ఖరారు చేసుకోవడంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తులు ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హింధూ సంఘాలు, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. టీటీడీ కూడా అదే చెప్పింది. జగన్ తిరుమలకు వస్తే డిక్లరేషన్ తీసుకుంటామని ప్రకటించింది. అయితే జగన్ తిరమలకు వెళ్లకుండా ఆగిపోయారు.
తన మతమేమిటో అందరికీ తెలుసని.. తనను మతం అడుగుతారా.. ఇదేమి హిందూయిజం అని ఆయన శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ క్రిస్టియన్ అనేనని.. కాకపోతే తాను హిందువునని ధైర్యంగా చెప్పుకోవాలని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన హోంమంత్రి వంగల పూడి అనిత... విమర్శలు చేస్తూ జగన్ హిందువు కాకపోతే తనలా ధైర్యంగా హిందువుగా చెప్పుకోవాలన్నారు.
ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు వీరికే - రాజీనామాలు చేసిన వారెవరికీ చాన్స్ లేనట్లే ?
ఈ వీడియోకు కౌంటర్ గా వైఎస్ఆర్‌సీపీ కూడా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో గతంలో తాను ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. తాను క్రిస్టియన్ ను అని చెబుతున్న దృశ్యాలు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఆ చానల్ తో మాట్లాడిన అనిత..తాము పండుగను ఎలా జరుపుకుంటామో వివరించారు. వంగపూడి అనిత క్రిస్టియన్ అని.. హిందువునని అబద్దం చెబుతున్నారని వైసీపీ వాదిస్తోంది.
కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలాగో @ncbn దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు హోం మంత్రి @Anitha_TDP ?
— YSR Congress Party (@YSRCParty) September 28, 2024
ఊసరవెల్లిలా రంగులు మార్చి.. మరీ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం మీకే చెల్లింది @JaiTDP#SaveTTDFromTDPFakeNews#100DaysOfCBNSadistRule pic.twitter.com/kiZqmgdowA
అయితే ఈ వీడియో పాతతే.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంగలపూడి అనితకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ షిప్ పదవి ఇచ్చారు. అయితే ఈ వీడియోను అప్పుడు కూడా వైసీపీ వైరల్ చేయడంతో ఆమె స్వచ్చందంగా తన బోర్డు మెంబర్ షిప్ పదవిని చేపట్టడానికి నిరాకరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని మతాలను గౌరవిస్తానని.. పండుగ చేసుకుంటామన్న కోణంలోనే అలా చెప్పానని తర్వాత వివరణ ఇచ్చారు. హిందూత్వమే పాటిస్తామని స్పష్టం చేశారు. అియనా ఆ వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆమె పలుమార్లు శ్రీవారి దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ తీసుకోలేదని వైసీపీ ఆరోపిస్తోంది.