అన్వేషించండి

Bujji and Bhairava Review: బుజ్జి అండ్ భైరవ రివ్యూ: ‘కల్కి’లో ఇంత కామెడీ ఉంటుందా? ‘బీ అండ్ బీ’ ఎలా ఉందంటే?

Bujji and Bhairava: ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేషన్ సిరీస్ ఎలా ఉంది? ప్రభాస్, కీర్తి సురేష్, బ్రహ్మానందం కలిసి ఎంత నవ్వించారు? సినిమా స్టోరీని ఎంత వరకు రివీల్ చేశారు?

Bujji and Bhairava Animated Prelude Review: ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన యానిమేషన్ సిరీస్ ‘బుజ్జి అండ్ భైరవ’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 14 నిమిషాలుగా ఉంది. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్లలో ఏం ఉంది?

బుజ్జి ఎవరు?
అసలు బుజ్జి అంటే ఎవరు అనేది ఈ యానిమేటెడ్ ప్రిల్యూడ్‌లో చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్‌నే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక వెహికిల్‌కి అటాచ్ చేస్తారు. 99 మిషన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈ డివైస్ 100వ మిషన్‌లో ఉండగా... తనపై దాడి జరిగి వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన చిన్న డివైస్ మాత్రం మిగులుతుంది. 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది దీని డ్రీమ్. ‘కల్కి’  సినిమా గ్లింప్స్‌లో ఒక పెద్ద ట్రయాంగిల్ చూపించారు కద. దాని పేరు కాంప్లెక్స్ అంట. ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది.

భైరవ ఎవరు?
బుజ్జిలాగానే భైరవకి కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది డ్రీమ్. దానికి ఒక మిలియన్ యూనిట్స్ అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా భైరవ జీవిస్తూ ఉంటాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపిస్తాడు. బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి.

శంభల సిటీ రిఫరెన్స్...
మహా విష్ణువు పదో అవతారం కల్కి... శంభల నగరంలో పుడతాడనేది మన పురాణాల్లో రాసిన విషయమే. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ ప్రిల్యూడ్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు.

ఆ విగ్రహం కమల్ హాసన్‌దేనా?
ఈ సిరీస్‌లో ఒక చోట చాలా పెద్ద విగ్రహం ఒకటి నిర్మాణంలో ఉన్నట్లు చూపిస్తారు. ఆ విగ్రహం చుట్టూ ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఆ విగ్రహం పోలికలు చూడటానికి కాస్త కమల్ హాసన్ తరహాలో ఉంటాయి.

Also Readఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?

వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంది?
తాము బిల్డ్ చేసిన 2898 నాటి వరల్డ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా ఈ గ్లింప్స్‌లో చేశారు. ‘ఆల్టర్డ్ కార్బన్’, ‘రెడీ ప్లేయర్ వన్’, ‘డ్యూన్’ వంటి ఫ్యూచరిస్టిక్ సినిమాలు, సిరీస్‌ల్లో చూసినట్లే బాగా డబ్బులున్న వాళ్లు, పాలించే వాళ్లు అంతా ప్రత్యేకమైన ప్రాంతంలో, డబ్బు లేని వాళ్లు మరో ప్రాంతంలో ఉన్నట్లు చూపించారు. 2898 నాటికి కరెన్సీ రూపాయల్లో ఉండదు. అది యూనిట్స్‌లోకి మారిపోయి ఉంటుంది. అప్పటికి పూర్తిగా డిజిటల్ మనీనే. ప్రతి ఒక్కరి చేతికి ఒక డివైస్ ఉంటుంది. నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయో ఆ డివైస్‌లో కనిపిస్తుంది. మన డివైస్‌ని వేరే వారి డివైస్‌ దగ్గరికి తీసుకెళ్లి ఆథెంటికేషన్ ఇస్తే మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓవరాల్‌గా అరగంట యానిమేషన్ సిరీస్‌తో సినిమా మీద ఇంట్రస్ట్‌ని డబుల్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యారు.

కల్కి... భైరవ ఒక్కరు కాదా?
మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా... ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Also Readగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ రివ్యూ: 'పుష్ప'కు ఫాస్ట్ ట్రాకా? ఎన్టీఆర్‌తో తీస్తే ఇంకా బాగుండేదా? జనాలు గొర్రెలు డైలాగ్ ఏంట్రా బాబూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget