News
News
X

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైస్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

FOLLOW US: 

ర్ష సాయి, ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. అదేనండి యూట్యూబ్‌లో పేదలకు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఆశ్చర్యపరిచే యువకుడు. కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేయడం హర్ష సాయికి అలవాటు. పేదల కళ్లల్లో ఆనందం చూడటం కోసం అతడు చేసే పనులు.. చాలామందికి స్ఫూర్తిదాయకం. అందుకే, ఆయన యూట్యూబ్, సోషల్ మీడియా పోస్టులకు అంత ఫాలోయింగ్. 

హర్షసాయి తాజాగా మరో అద్భుతం చేశాడు. ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రయత్నం చేశాడు. 101 మంది పేదలకు ఫైస్టార్ హోటల్‌లో కడుపు నిండా భోజనం పెట్టాడు. ఇంతకీ ఒక్కో ప్లేటు భోజనం విలువ ఎంతో తెలుసా? రూ.30 వేలు. ఔనండి, మీరు విన్నది నిజమే. ఎందుకంటే.. అతడు ఎంచుకున్నది సాదాసీదా హోటల్ కాదు. దేశంలోనే అత్యంత సంపన్నులు, రాజకీవేత్తలు, అంతర్జాతీయ నేతలు మాత్రమే బస చేసే అత్యంత విలాశవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌‌లో. అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక ట్రంప్‌లు కలిసి విందు ఆరగించినది ఇక్కడే. 

ఆ చిన్నారుల వీడియోనే స్ఫూర్తి: పేదలు గేటు ముందు ఉంటేనే చీదరించుకొనే ఫైవ్‌స్టార్ హోటల్‌లో.. వారికి ప్రవేశం ఉంటుందంటే ఊహించుకోగలమా? కానీ, హర్షసాయి అది చేసి చూపించాడు. ఈ ఆలోచన రావడానికి గల కారణం ఓ వైరల్ వీడియో. ముంబైలో ముగ్గురు పిల్లలు దాచుకున్న డబ్బులతో పిజ్జా కొనడానికి వెళ్లారు. ఆ పిల్లల దుస్తులు మురికి ఉండటంతో అక్కడి సిబ్బంది వారిని బయటకు పంపేశారు. మేం డబ్బులు తెచ్చుకున్నా పిజ్జా ఇవ్వండన్నా.. ఇవ్వకుండా వారిని వెళ్లగొట్టారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన హర్ష సాయి గుండె బరువెక్కింది. పేద, ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలనే లక్ష్యంతో హర్షసాయి ఈ ప్లాన్ చేశాడు. 

రైతుకు చుక్క నీరు ఇవ్వని ఫైవ్‌స్టార్ హోటల్: తన ప్లాన్‌లో భాగంగా.. హర్ష సాయి ఓ రైతును ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు వెళ్లి ఒక గ్లాస్ వాటర్ అడగమని పంపారు. అయితే, అక్కడి సెక్యూరిటీ అతడికి నీళ్లు ఇవ్వకుండానే బయటకు పంపేశాడు. ఇలా రెండు మూడు హోటళ్లలో జరిగింది. దీంతో హర్షసాయి హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన, రాయల్ హోటల్‌లో పేదలకు ఉచితంగా విందు భోజనం తినిపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎంపిక చేసుకున్నాడు. 

ప్రపంచంలోనే అతి పెద్ద రాయల్ డైనింగ్ టేబుల్: ఫలక్‌నూమా ప్యాలెస్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అక్కడ ఒకేసారి 101 మంది కలిసి భోజనం చేయొచ్చు. దీంతో హర్ష సాయి తనతోపాటు వచ్చే పేదలకు ఇక్కడ విందు ఏర్పాటు చేయబోతున్నానని ఆ హోటల్ యజమాన్యానికి తెలియజేశాడు. తన పేరు మీద ఆ డైనింగ్ హాల్ బుక్ చేయాలని అడిగాడు. అయితే, హర్షసాయి చెప్పిన సమయానికి ఆ డైనింగ్ హాల్ అందుబాటులో లేదని తెలిసింది. దీంతో హర్షసాయి.. ఎప్పుడు ఖాళీగా ఉంటుందో చెబితే అప్పుడే వస్తానని తెలిపాడు. మరోవైపు వైరల్ వీడియోలో ఉన్న ఆ ముగ్గురు పిల్లల కోసం ముంబయి వెళ్లారు హర్షసాయి. ఎట్టకేలకు వారి ఆచూకీ తెలుసుకుని వారితో కేక్ కత్తిరించి, డబ్బులిచ్చాడు. ఆ తర్వాత వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. లగ్జరీ కార్లలో వారిని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకొచ్చారు. పిల్లలతోపాటు పారిశుధ్య పనులుచేసుకొనే వ్యక్తులు, రైతులు ఇతరాత్ర పేదలందరినీ తనతో తీసుకొచ్చారు హర్షసాయి. 

ఒక్కో ప్లేటు భోజనం రూ.30వేలు: ఆ డైనింగ్ హాల్‌లో వడ్డించే భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి కూర్చొని తినాలంటే ప్లేటుకు రూ.30వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పైగా అక్కడ సాధారణ ప్లేట్లలో వడ్డించరు. అన్నీ బంగారం, వెండి పళ్లాలే. నిజాం కాలం నాటి వంటకాలను మాత్రమే అక్కడ వడ్డిస్తారు. అందుకే, అక్కడ భోజనం అంత ఖరీదు. అంతకు ముందు ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు వెళ్లి నీళ్లు అడిగిన రైతు కూడా ఈ విందుకు వచ్చారు. ఆయన్ని నిజాం రాజు కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టి మరీ పసందైన వంటకాలు వడ్డించారు. హైదరాబాదుకు దేశవిదేశాల నుంచి ఎంత పెద్ద అతిథి వచ్చినా అక్కడే భోజనం చేస్తారు. అలాంటి ప్లేసులో పేదలు భోజనం చేయడమంటే మాటలు కాదు. అయితే, హర్షసాయి కేవలం తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోని పేద ప్రజలను సైతం ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లి కడుపునిండా ఖరీదైన భోజనం తినిపించాడు. వారికి డబ్బులిచ్చి సాయం చేశాడు. ఆగస్టు 3న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 73 లక్షల మంది వీక్షించారు. హర్ష సాయి ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. 

Also Read: ‘హర్ ఘర్ తిరంగా’లో మీ పేరును ఇలా నమోదు చేస్కోండి, ఈ సర్టిఫికెట్ పొందండి

Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు

Published at : 08 Aug 2022 04:14 PM (IST) Tags: Harsha Sai Harsha Sai Five Star Hotel for Poor Harsha Sai Dine with Poor Harsha Sai Taj Falaknuma Poor in Taj Falaknuma

సంబంధిత కథనాలు

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam