News
News
X

Clove: తేనె, లవంగం కలిపి తీసుకుంటే ఈ రోగాలన్నీ దూరం

లవంగం అదృష్టాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది. దానితో తేనె కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

FOLLOW US: 
Share:

తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే పాలు, టీ, ఫ్రూట్ సలాడ్ ఇలా అనేక వాటితో కలిపి తేనె తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా లవంగాలతో కలిపి తేనె తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే ఇప్పటి నుంచి తీసుకోవడం మొదలుపెట్టండి. ఇది ఆరోగ్యాన్నికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తేనెలాగే లవంగం కూడ ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇవి రెండింటినీ కలిపి తీసుకుంటే మీ శరీరంలోని ఈ జబ్బులన్నీ దూరం చేసేస్తుంది.

జలుబు తగ్గిస్తుంది

సాధారణంగా జలుబు తగ్గించుకునేందుకు తేనె తీసుకుంటారు. ఇక దగ్గు ఎక్కువగా ఉంటే ఒక లవంగం నోట్లో పెట్టుకుని నమిలేస్తారు. అయితే లవంగం, తేనె కలిపి దగ్గు తగ్గించుకునేందుకు సిరప్ గా తీసుకోవచ్చు. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గు, జలుబు, ఫ్లూ ని తగ్గించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తుంటే ఇది మీకు చక్కని ఎంపిక. తేనె, లవంగాలను కలిపి తింటే జీవక్రియని పెంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

నోటి పూత

నోటి పూత వస్తే ఏ ఆహార పదార్థాలు తీసుకోలేరు. నోరంతా మంటతో చాలా ఇబ్బంది పడతారు. దాని నుంచి బయట పడాలంటే లవంగం, తేనె అధ్భుతమైన రెమిడీ. నోటి పుండ్లని నయం చేయడంలో చక్కగా పని చేస్తుంది. లవంగం పొడిలో కొద్దిగా తేనె, పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకుని నోట్లో అల్సర్ ఉన్న చోట రాయాలి. ఇది నోట్లోని పుండ్లను తగ్గించేస్తుంది.

రోగనిరోధక శక్తి మెరుగు

తేనె, లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుంది. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికడుతుంది.

కాలేయానికి మేలు

శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపించడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తేనె, లవంగాల మిశ్రమం తీసుకుంటే మంచిది. ఇది కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గొంతుకి మంచిది

గొంతు నొప్పిగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తే లవంగం నోట్లో వేసుకుంటారు. కానీ దానితో పాటు కాసింత తేనె కూడా కలుపుకుని తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపుని తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పిల్లల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- లక్షణాలు ఏంటి? గుర్తించడం ఎలా?

Published at : 15 Feb 2023 02:41 PM (IST) Tags: Honey Honey benefits Clove Clove Benefits Honey And Clove Health Benefits

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి