అన్వేషించండి

World's Largest Kidney Stone: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయి తీసిన వైద్యులు- అసలు కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయంటే?

సాధారణంగా కిడ్నీలో రాళ్ళు అంటే చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కిడ్నీని మించి కిడ్నీలో రాయి ఉందట.

కిడ్నీలో రాళ్ళు అంటే చాలా చిన్నగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇక్కడ రాయి మాత్రం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత ఉందండోయ్. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీరాయిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించింది. శ్రీలంక ఆర్మీ వైద్యులు శస్త్రచికిత్స చేసి పేషెంట్ నుంచి తొలగించారు. ఈ రాయి 13.372 సెంటీ మీటర్లు(5.26 అంగుళాలు), 801గ్రాము బరువు ఉంది. జూన్ 1న్ కొలంబోలోని ఆర్మీ హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేసి ఈ అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించినట్టు శ్రీలంక ఆర్మీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. అతిపెద్ద కిడ్నీ రాయిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 2008లో పాకిస్తాన్ కి చెందిన ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువు ఉన్న కిడ్నీ రాయిని తొలగించారు. ఇప్పుడు ఈ రికార్డుని శ్రీలంకలో పేషెంట్ నుంచి తీసిన రాయి  బ్రేక్ చేసింది.

కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి?

జన్యుపరమైన, పర్యావరణ కారణాల వల్ల మూత్రపిండాలు,మూత్ర నాళాలు లేదా మూత్రాశయంలో ఘనీభవించిన స్పటిక పదార్థాల ముక్కలు రాళ్ళుగా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్పటికాల వల్ల ఏదో ఒక సమయంలో 10 శాతం మంది వ్యక్తులు ప్రభావితమవుతున్నారని అనేక గణాంకాలు చూపిస్తున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం రాళ్ళు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అవి చాలా పెద్దగా ఉండి బయటకి రాలేకపోయిన సందర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే వచ్చే సమస్యలు

⦿దిగువ వీపులో తీవ్రమైన నొప్పి

⦿మూత్రంలో రక్తం రావడం

⦿ఎప్పుడూ వికారంగా అనిపిస్తుంది

⦿వాంతులు

⦿జ్వరం, చలి

⦿దుర్వాసనతో కూడిన మూత్రం

⦿మూత్రం రంగు కూడా మారిపోతుంది

కిడ్నీలో రాయి ఏర్పడిన తర్వాత దాని పరిమాణాన్ని బట్టి అది మూత్ర నాళంలోకి కూడా వచ్చే అవకాశం ఉండి. కొన్ని సార్లు ఎటువంటి నొప్పి లేకుండానే మూత్రంలో చిన్న చిన్న రాళ్ళు సహజంగానే శరీరం నుంచి బయటకి వస్తాయి. కానీ పెద్ద సైజులో ఉండే రాళ్ళ వల్ల మూత్రం రాకుండా అడ్డుకుంటాయి.

కిడ్నీలో రాళ్ళకి కారణం ఏంటి?

యురాలజీ కేర్ ఫౌండేషన్ పరాక్రమ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి గల కారణాలు..

⦿సరిపడా నీళ్ళు తాగకపోవడం

⦿విపరీతమైన వ్యాయామం

⦿ఊబకాయం లేదా బరువు పెరగడం

⦿బరువు తగ్గించే శస్త్రచికిత్సలు

⦿ఉప్పు లేదా చక్కెర అధికంగా తీసుకోవడం

⦿దీర్ఘకాలిక అంటువ్యాధులు

⦿ఫ్యామిలీ హిస్టరీ

కిడ్నీలో రాళ్ళు ఎలా నివారించాలి?

హైడ్రేట్ గా ఉండాలి: శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉండాలంటే తగినన్ని నీళ్ళు తాగాలి. హార్వర్డ్ హెల్త్ ప్రకారం రోజుకి కనీసం 2-3 లీటర్ల నీరు తీసుకోవాలి. అప్పుడే మూత్ర వ్యవస్థ నుంచి చిన్న రాళ్ళను తొలగించుకోవచ్చు.

కాల్షియం తీసుకోవాలి: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ళు కాల్షియం ఆక్సలెట్ తో తయారువుతాయి. కాల్షియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్ నివారించాలి.

జంతు ప్రోటీన్ తక్కువ తినాలి: జంతు ప్రోటీన్ ఆహారాలు మరింత ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఇందులోని యూరిన్ యాసిడ్ ప్రమాదాన్ని పెంచి చివరికి రాళ్ళు ఏర్పడేలా చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మధుమేహులకు మేలు చేసే పండ్లు- ఇవి తిన్నారంటే షుగర్ లెవల్స్ పెరగవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Kanguva Release Trailer: కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
iPhone 15 Sales: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
Embed widget