అన్వేషించండి

World Malaria Day 2024 : ప్రాణాలను హరించే దోమకాటు.. అందుకే మలేరియా డే రోజు కొత్త థీమ్​తో ముందుకు వస్తున్న WHO

World Malaria Day 2024 Telugu : మలేరియాతో ఇబ్బంది పడుతూ ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ విషయంపై అవగాహన కలిపిస్తూ ఏటా.. ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 

World Malaria Day 2024 History and Significance : దోమకాటు వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది అధిక జ్వరం, చలి వంటి ప్రధాన లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మలేరియాతో ఇబ్బంది పడుతూ.. ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ.. ఏటా మలేరియా దినోత్సవం (World Malaria Day 2024) నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మలేరియా డేని ఎప్పటి నుంచి చేస్తున్నారు? దీని థీమ్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మలేరియా డేని ఎప్పటినుంచి చేస్తున్నారంటే.. 

మలేరియా దినోత్సవాన్ని మొట్టమొదటిగా ఆఫ్రికాలో నిర్వహించారు. 2001 నుంచి ఆఫ్రికన్ ప్రభుత్వం మలేరియా దినోత్సవం నిర్వహిస్తూ.. అవగాహనలు కల్పించారు. 2008లో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దీనిని ప్రజారోగ్య సమస్యగా గుర్తించి.. ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని.. ప్రపంచ మలేరియా దినోత్సవంగా మార్చింది. మలేరియా కేసులు, మరణాలను సగానికి తగ్గించడానికి ప్లాన్ చేయడం వంటి వాటిని ప్లాన్ చేశారు. 2016లో WHO గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016-2030ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే WHO ఏప్రిల్ 25వ తేదీని ప్రపంచ మలేరియా దినోత్సవంగా డిక్లేర్ చేశారు. 2030 నాటికి మలేరియా కేసులు, మరణాలను 90 శాతం తగ్గించే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లారు. 

మలేరియా డే థీమ్

ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం రోజు మలేరియా నివారణ, నియంత్రణపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మలేరియా నియంత్రణకై చేపట్టిన లక్ష్యాలను చేర్చుకోవడానికి మరిన్ని ప్రాంతాలలో దీనిపై అవగాహన కలిపించే దిశగా ముందుకు వెళ్తున్నారు. కొన్ని రకాల దోమలవల్ల మలేరియా వస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ఈ సదస్సులు ప్రపంచ మలేరియా దినోత్సవం అవగాహన పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్​గా మై హెల్త్​, మై రైట్​తో ముందుకు వచ్చారు. మలేరియా నివారణ, గుర్తింపు, చికిత్స సేవలపై అవగాహన కల్పిస్తారు. 

ప్రాణాలను హరిస్తుంది..

మలేరియా అనేది పరాన్న జీవి వల్ల కలిగే ఒక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మలేరియా వచ్చిన వ్యక్తులు అధిక జ్వరం, వణుకు వంటి లక్షణాలతో అనారోగ్యాల బారిన పడతారు. మలేరియా ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ.. కొన్ని చికిత్సలతో వాటిని నివారించవచ్చు. అయితే సరైన అవగాహన లేక తగిన వనరులు ఉన్న దేశాలలో కూడా ప్రాణాలను హరిస్తుంది. అందుకే మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 

అవగాహన కార్యక్రమాలు..

బెడ్​నెట్​లు ఉపయోగించడం, ఇండోర్ రెసియువల్ స్ప్రేయింగ్ వంటివి దోమలు నివారించడంలో హెల్ప్ చేస్తాయి. మలేరియా అనే డౌట్​ వస్తే.. వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వర్క్​ షాప్​లు, సెమినార్లు, హెల్త్ ఫెయిర్​లు, కమ్యూనిటీ ఈవెంట్​లు నిర్వహించాలి. మొబైల్ క్లినిక్​లు ఏర్పాటు చేయడం, మలేరియా ప్రభావిత ప్రాంతాలలో మలేరియా స్క్రీనింగ్​లు, రోగనిర్ధారణ పరీక్షలను చేయించవచ్చు. మలేరియా దినోత్సవం సందర్భంగా వాగులు, చెరువులు, టైర్లలో నిలిచిపోయిన నీటిని దోమల ఉత్పత్తి ప్రదేశాలను క్లీన్ చేయడం వంటివి చేయవచ్చు. ఇవి మలేరియా వ్యాప్తిని అరికట్టడంలో హెల్ప్ చేస్తాయి.

Also Read : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget