News
News
X

Bad Food For Heart: మీ గుండె జాగ్రత్త.. ఈ ఆహారాన్ని దూరం పెడితే ఆయుష్సు పెరుగుతుంది

మన శరీరంలో గుండె చాలా సున్నితమైనది. మన ఆహారపు అలవాట్లు అదుపుతప్పితే గుండె ఏదో ఒక క్షణంలో ఆగిపోతుంది. కాబట్టి.. ఈ కింది ఆహారాలను, అలవాట్లకు దూరంగా ఉండండి.

FOLLOW US: 
 

రీరానికి ఇంజిన్‌లాంటి గుండెను కాపాడుకోవడం మన బాధ్యత. అది రిపైర్‌కు వచ్చిందో.. ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడినట్లే. అందుకే.. గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలిసో.. తెలియకో మనం తీసుకొనే ఆహారం.. చేసే పనులు కూడా గుండె మీద ప్రభావం పడతాయి. కాబట్టి.. గుండెను భద్రంగా ఉంచుకొనేందుకు ఉన్న మార్గాలను తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం.. అలవాట్లు.. మన గుండెపై ప్రభావం చూపుతాయో తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. 

అతి ఎప్పుడూ అనార్థమే.. ఉప్పు, చక్కెర మితిమీరితే..: రుచిగా ఉంది కదా.. నచ్చిన ఆహారాన్ని అదే పనిగా లాగిస్తే శరీరం అదుపు తప్పుంది. గుండెపై ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి.. మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు, చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోండి. గుండెకు మేలు చేసే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

వైట్ రైస్, బ్రెడ్, పాస్తా: మనం నిత్యం ఆహారంగా తీసుకొనే బియ్యం, బ్రెడ్, పాస్తలు కూడా గుండెకు మంచివి కావు. ఆరోగ్యకరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లేకపోవడమే ఇందుకు కారణం. శుద్ధి చేసిన ఆహార ధాన్యాలు ఫైబర్‌ను కోల్పోతాయి. ఫలితంగా వాటిలో చక్కెర శాతం పెరుగుతుంది. వీటిలో కొవ్వు శాతం కూడా ఎక్కువే. వాటి వల్ల టైప్-2 డయాబెటీస్‌తో పాటు గుండె జబ్బులు ఏర్పడతాయి. వాటి స్థానంలో ఓట్స్, గోదుమలు, బ్రౌన్ రైస్, తృణధాన్యాలను తీసుకోవడం మంచిది.

వెన్న అతిగా తిన్నా అనార్థమే: వెన్నలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది మీ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బులను తీవ్రం చేస్తుంది. వెన్నకు బదులుగా మీరు ఆలివ్ నూనె లేదా కూరగాయల నూనెలను ఉపయోగించడం మంచిది. వీటిలో గుండెకు ఆరోగ్యాన్ని అందించే మోనో- బహుళ అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అలాగే, అతిగా నూనెలో వేయించిన ఆహారం, ఐస్‌క్రీమ్‌లు, బంగాళ దుంపల చిప్స్ కూడా గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 

News Reels

మద్యపానం: మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి తెలిసిందే. మీకు అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ వంటి సమస్యలు లేకపోతే మద్యం వల్ల గుండెకు ఎలాంటి హానీ జరగదు. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలి. అదే పనిగా మద్యం తాగితే గుండె జబ్బులు పెరుగుతాయి. కాబట్టి.. మద్యానికి వీలైనంత దూరంగా ఉండటం ఒక్కటే మంచి మార్గం. 

సోడా వద్దు: మీకు సోడా అతిగా తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. సోడాల వల్ల ఊబకాయం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊబకాయం వల్ల టైప్-2 డయాబెటీస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఏర్పడతాయి. సోడా హార్ట్ స్ట్రోక్‌కు కూడా దారి తీస్తుందనరి పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. సాదా, కార్బోనేటెడ్ లేదా తియ్యగా ఉండే కూల్ డ్రింక్‌లకు దూరంగా ఉండటమే బెటర్. 

Also Read: ఈ చాక్లెట్లలో రక్తాన్ని కలుపుతారు.. ఎందుకో తెలుసా?

పంది మాంసం, రెడ్ మీట్: బేకన్(పంది మాంసంలో ఒక భాగం)లో సగానికి పైగా కేలరీలు సంతృప్త కొవ్వు నుంచే వస్తాయి. ఇది లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఇది ఉప్పుతో నిండి ఉంటుంది. ఇది మీ రక్తపోటును పెంచుతుంది, మీ గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. అధిక మొత్తంలో సోడియం గుండె జబ్బులకు దారి తీస్తుంది. అలాగే గొడ్డు మాంసం, గొర్రె, పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు ఏర్పడతాయి. హాట్ డాగ్‌లు, సాసేజ్, సలామీ లంచ్ మీట్ వంటివి కూడా గుండెకు అత్యంత హానికరమైన మాంసాలు. 

Also Read: హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్: గుండె జబ్బులు లేకపోయిన హృదయం ఆగుతుంది.. ఎందుకో తెలుసా?

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Sep 2021 12:53 PM (IST) Tags: World Heart Day 2021 Heart Day 2021 Food for Heart Bad food for Heart గుండెకు కీడు చేసే ఆహారం ప్రపంచ ఆరోగ్య దినం 2021

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

టాప్ స్టోరీస్

most trending news in telangana 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

most trending news in telangana 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!