Pregnant With Doll: బొమ్మను పెళ్లి చేసుకుంది, బిడ్డను కూడా కన్నది - అచ్చం నాన్న పోలికే!
ఆమె ఓ బొమ్మను పెళ్లి చేసుకుంది. అయితే, ఆ బొమ్మ కండోమ్ వాడకపోవడం వల్ల తాను గర్భవతిని అయ్యానని, మరో బొమ్మకు జన్మనిచ్చానని చెబుతోంది. అదెలా సాధ్యమండి?
ఆమె ఓ మగ బొమ్మను పెళ్లి చేసుకుంది. దానితో కొన్నాళ్లుగా కాపురం కూడా చేస్తుంది. ఎట్టకేలకు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా అచ్చం నాన్నలాగే ఉంది. అదేంటీ, బొమ్మను పెళ్లి చేసుకుంటే బిడ్డ ఎలా ఉంటుంది? ఇదేదో తేడాగా ఉందే అని అనుకుంటున్నారా? అయ్యో, మీరు ఆమెను అనవసరంగా అనుమానిస్తున్నారు. ఆమెకు పుట్టింది బొమ్మ బిడ్డ. అయితే, ఆమె మాత్రం అది ఒప్పుకోవడం లేదు. ఆ బొమ్మ తనకే పుట్టిందని, తన బొమ్మ భర్త వల్ల తాను గర్భవతిని అయ్యానని.. తమ ప్రేమకు ప్రతిరూపమే ఈ భర్త అని కన్‌ఫ్యూజ్ చేసేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
మెయిరివోన్ రోచా మోరేస్, అనే 37 ఏళ్ల మహిళ ఇటీవల ఓ రాగ్‌డాల్‌ను పెళ్లాడి వైరల్‌గా మారింది. అయితే, ఈ పెళ్లి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. రోచా ఓ రోజు తన తల్లికి ఫోన్ చేసి.. తాను ఒంటరిగా ఉంటున్నానని, తనతో డ్యాన్స్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని అని చెప్పింది. దీంతో ఆమె తల్లి సూదీ, దారం తీసుకుని తనకు తోచిన విధంగా రాగ్‌డాల్‌ను తయారు చేసింది. దానికి మార్సెలో అని పేరు పెట్టింది.
మార్సోలోనుతో కొద్ది రోజులు గడిపిన తర్వాత దాని ప్రేమలో పడింది. ఓ రోజు తన తల్లితో మాట్లాడుతూ.. తాను ఆ బొమ్మ వల్ల గర్భవతిని అయ్యానని చెప్పింది. తనకు తానే ఓ ప్రత్యేకమైన ఊహాలోకాన్ని సృష్టించుకుని ఆ బొమ్మే తన బాయ్‌ఫ్రెండ్ అన్నట్లుగా మాట్లాడింది. కొద్ది రోజుల తర్వాత గర్భవతిగా దుస్తులు ధరిస్తూ తిరిగింది. దీంతో పెళ్లి చేసుకోకుండా బిడ్డను ప్రసవించకూడదంటూ ఆమె తల్లి కూడా రోచా బాటలో వెళ్లింది. 250 మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రోచా.. మార్సోలోను పెళ్లి చేసుకుంది.
బొమ్మకు ప్రసవం: చిత్రం ఏమిటంటే.. ఆమె పురిటి నొప్పులతో డాక్టర్‌ను సంప్రదించిందట. డాక్టర్, నర్సు సమయంలో 35 నిమిషాల ప్రసవ వేదనలో రాగ్‌డాల్‌కు జన్మనిచ్చిందట. అయితే, ఆ ప్రసవం తనకు అస్సలు నొప్పి కలిగించలేదని చెప్పింది. పైగా ఈ ఘటనను ఆమె ఆన్‌లైన్‌లో ప్రసారం చేసింది. దీన్ని సుమారు 200 మంది వీక్షించారు.
ఇదేం పిచ్చి?: ‘‘నేను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తా. నేను రచియిత్రిని కాదన్నవారిని రాళ్లతో కొడుతా..’’ అన్నట్లుగా ఆమె స్పందన ఉంది. ఆమె చెబుతున్నదంతా ఫేక్, అభూత కల్పన అనేవాళ్లపై ఆమె మండిపడుతోంది. ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మార్సెలో గొప్ప, నమ్మకమైన భర్త. అలాంటి వ్యక్తి తమకు భర్త దొరకడలేని మహిళలు అసూయపడతారు. అమ్మ.. మార్సెలోను తయారు చేసి నాకు పరిచయం చేసిన రోజే ప్రేమలో పడ్డాను. పెళ్లి రోజు రాత్రి మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేశాం. అతడి లక్షణాలు మంచివే. కానీ సోమరితనం ఎక్కువ. అస్సలు పనిచేయడు. నన్ను అతడు గర్భవతిని చేశాడు. కండోమ్ లేకుండా నాతో కలవడం వల్ల నేను గర్భవతిని అయ్యాను. పరీక్షలో నేను ప్రేగ్నెంట్ అయ్యానని తెలిసి ఆశ్చర్యపోయా. కానీ, నేను రాగ్‌డాల్‌కు జన్మనివ్వడాన్ని ఫేక్ అంటున్నారు. వారిపై నాకు చాలా కోపంగా ఉంది’’ అని తెలిపింది. మీరే చెప్పండి. ఈమె చెబుతున్నది నిజం ఎలా అవుతుంది? అయినా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా సరికొత్త నాటకాలతో ఫేమస్ అయ్యేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది కదూ. అయినా, ఆ బొమ్మ ఆమెకు ఒక ‘ఎమోషన్’ కావచ్చు. కానీ, దానితో బిడ్డను కనడం అనేదే కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది కదూ.
View this post on Instagram
Also Read: లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి
Also Read: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు