Onion Fight: వీడియో: ‘భయ్యా తోడా పియాజ్ డాలో’ అంది.. లేవని చెప్పడంతో ఎంత పని చేసిందో చూడండి
కచోడీ చాట్‌లోకి ఉల్లిపాయలు లేవనే కారణంతో ఓ యువతి ఎంత పని చేసిందో చూడండి.
అమ్మాయిలకు పానీ పూరీ, చాట్, కచోడీ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. వాటి కోసం ప్రాణం కూడా పెడతారు. లాక్‌డౌన్ సమయంలో వైరస్ భయం కంటే.. పానీ పూరీ దొరకడం లేదనే ఆందోళనే వారిని ఎక్కువ బాధ పెట్టింది. మొత్తానికి లాక్‌డౌన్ సడలింపుల వల్ల.. మళ్లీ పానీపూరీ, చాట్‌ల కోసం ఎగబడటం మొదలుపెట్టారు. కొన్ని నెలలుగా వాటిని బాగా మిస్సయ్యామనే ఫ్రస్ట్రేషన్ వల్లో ఏమో.. ఓ యువతి అడిగినన్ని ఉల్లిపాయలు ఇవ్వలేదనే కారణంతో రచ్చ రచ్చ చేసింది. ఆ చిరు వ్యాపారిని తిట్టడమే కాకుండా.. అన్నీ నేలపాలు చేసి తన ప్రతాపం చూపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
ఓ పార్క్‌లో షికారుకు వచ్చిన యువతి.. సైకిల్ మీద కచోడీ చాట్ అమ్ముతున్న చిరు వ్యాపారి వద్దకు వచ్చింది. ఆమెకు కచోడీలో ఉల్లిపాయలు వేయకపోవడంతో అందరి అమ్మాయిల్లాగానే ‘‘భయ్యా తోడా పియాజ్ డాలో’’ అని అడిగింది. ‘‘ఉల్లిపాయలు అయిపోయాయి.. ఇక లేవు’’ అని ఆ వ్యాపారి చెప్పాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘చాట్‌కు డబ్బులు తీసుకోవడం లేదా? నాకు ఉల్లిపాయలు వేయాల్సిందే’’ అని పట్టుబట్టింది. ‘‘ఉల్లిపాయలు లేనే లేవు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి’’ అని అతడు వాదించాడు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె వారితో కూడా వాదనకు దిగింది. చివరికి ఫ్రస్ట్రేషన్‌తో చాట్ వ్యాపారి సైకిల్‌ను తన్నింది. దీంతో చాట్ మొత్తం నేలపాలైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూసి.. ఉల్లిపాయల కోసం ఇంత రచ్చ అవసరమా? వాటిని తన్ని పేదోడి కడుపు కొడతావా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ వీడియోపై కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు ఓ ప్లాన్ ప్రకారం తీసిన వీడియో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
Wo stree hai kuch bhi kar sakti hai pic.twitter.com/IyLB45sZzk
— Sarcastic Caravan ™ (@Saffron_Smoke) November 7, 2021
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి