(Source: ECI/ABP News/ABP Majha)
ఈ టీ కప్పు ఖరీదుతో జీవితాంతం ఏ లోటు లేకుండా బతికేయొచ్చు
ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ పాట్ ఇది. దీని ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పెద్ద టీ జార్‌లో తేనేటిని పోసి... దాని నుంచి గ్లాసుల్లో వేసుకొని తాగుతూ ఉంటారు. ఇది అందరికీ మార్కెట్లో దొరికే వస్తువే. దీని ఖరీదు 100 రూపాయల నుంచే మొదలవుతుంది. పింగానీతో చేసినదైతే కాస్త ఖరీదు ఉంటుంది. కానీ ఓ టీ పాట్ ధర కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది. ఈ ఒక్క టీపాట్ మన దగ్గర ఉంటే చాలు జీవితాంతం ఎలాంటి లోటు లేకుండా లగ్జరీగా బతికేయొచ్చు. దాని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 24 కోట్ల రూపాయలు. ఇది ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ఈ టీ పాట్‌కు అంత ఖరీదు. దీన్ని‘ ది ఇగోయిస్ట్’ అని అంటారు. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ వారు దీన్ని తయారు చేయించారు. ఇటలీకి చెందిన ఒక ఆభరణాల వ్యాపారితో దీన్ని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ పాట్‌గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఈ ఒక్క టీ జార్‌లోనే 1658 వజ్రాలు, 386 కెంపులను వాడారు. 2016లోనే దీని విలువ 24 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇప్పటికి దాని ధర ఇంకా పెరిగిపోయి ఉంటుంది.
గిన్నిస్ బుక్ వారు తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ టీ పాట్ గురించి రాసుకొని వచ్చారు. ఇది 18 క్యారెట్ బంగారంతో తయారు చేశారని, ఆ టీ పాట్ పై ఉన్న వజ్రాలు, కెంపుల విలువే చాలా అద్భుతమని చెప్పారు. దీనికి ఉన్న హ్యాండిల్‌ను శిలాజాల రూపంలో దొరికిన మమ్మోత్ ఐవరీ నుండి తయారు చేశారు. అంటే ఎన్నో వేల వేల క్రితం మరణించి, శిలాజ రూపంలోకి మారిన అతి పెద్ద ఏనుగు జాతి మమ్మోత్ దంతం నుంచి దీన్ని తయారు చేశారు. ఈ టీ పాట్ ఎంతో విలువైనది. దీన్ని చూడడం కోసం ఎంతోమంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని కేవలం రికార్డు క్రియేట్ చేసుకోవడం కోసమే తయారు చేశారు. ఎవరూ ఈ వస్తువును వాడుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ ఖరీదైన టీ కప్పులో టీ ఎవరు వేస్తారు అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు తన టీ కప్పును పోస్టు చేశారు.
This is the most valuable teapot in the world.
Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre.
The teapot's handle is made from fossilised mammoth ivory.
It… pic.twitter.com/TFZZF63YiW
">
The tea in my cup this morning will taste same as the one in any... pic.twitter.com/Q1F9PKpaT8
— Saint-247 (@EnjelSaint) August 9, 2023">
Also read: ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు
Also read: టమోటాలతో పురుషుల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం?