Heart Health: చలికాలం వచ్చేసింది, మీ గుండె జాగ్రత్త
Heart Health: చలికాలంలో ప్రత్యేకంగా గుండెకు రక్షణ అవసరం.
Heart Health: వేడి వాతావరణం అయినా, అతి చల్లని వాతావరణం అయినా అనర్ధమే. ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. ముఖ్యంగా గుండెకు అతి వేడి, అత్యంత చల్లదనం కూడా హానిచేస్తుంది. కాబట్టి గుండెకు ప్రత్యేక రక్షణ అవసరం. ఇప్పుడు చలికాలం ప్రారంభమైపోయింది. చలి మెల్లగా పెరగడం మొదలైంది. కాబట్టి గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఇప్పుడు చల్లగా మారడంతో శరీరంలోని హార్మోన్ల పై ఆ ప్రభావం పడుతుంది. కొన్ని హార్మోన్ల స్థాయిలు హఠాత్తుగా పెరగడం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వు పగిలే అవకాశం ఉంది. ఆ కొవ్వు రక్తనాళాల్లో రక్తప్రసారానికి అడ్డంకిగా మారవచ్చు. దీనివల్ల గుండెకు రక్తస్రావం జరగక గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆరోగ్యం తేడాగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గుండె జబ్బులు బారిన పడినవారు యాభై ఏళ్లు దాటిన వారు చలికి వణకడం వచ్చేవరకు ఉండకూడదు. వణుకు రావడం మంచిది కాదు. ఇలా వణకడం వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. కొవ్వు నిల్వల వల్ల రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వణికే వరకు తెచ్చుకోవద్దు. చలి ప్రారంభమవడానికి ముందే స్వెట్టర్లు లేదా దుప్పట్లు కప్పుకోవడం మంచిది. ఆస్తమా, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల్లోకి సరిపడినంత గాలి చేరకపోతే గుండె మీద ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఆహారంపై శ్రద్ధ అవసరం. భారీ భోజనాలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి ఏడు గంటల దాటాక భారీ భోజనాలను చేయడం మానేయాలి. అలాగే మసాలాలు, కారాలు, నూనెలు, ఉప్పు బాగా దట్టించి చేసిన ఆహారాన్ని దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆహారం అరగడం చాలా కష్టం. దీనివల్ల గుండె మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు బారిన పడినవారు రక్తపోటు అదుపులో ఉండేలా చూసుకోండి. లేకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు అనేవి గుండెపై నేరుగా ప్రభావం చూపే వ్యాధులు.
చలికాలంలో చల్లని పదార్థాలు తినడం మానేయాలి. వీలైనంత రాత్రి అన్నాం వేడిగా ఉన్నప్పుడూ తినేయాలి. చల్లని వాతావరణంలో వేడి భోజనం శరీరానికి కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే నిద్ర కూడా చక్కగా పడుతుంది. ఐస్ క్రీములు, ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాలను మాత్రం తినడం మానేయాలి. గుండె పోటు ఉన్నవారు చలికాలంలో చల్లని పదార్థాలు తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉంది.