By: ABP Desam | Updated at : 05 Jul 2022 03:03 PM (IST)
image credit: pixabay
పండ్లు తినడం మంచిదా వాటి జ్యూస్ తాగడం మంచిదా అని ప్రతి ఒక్కరికీ డౌట్ వస్తుంది. పండు అయితే ఒక్కటే తింటాం అదే జ్యూస్ అయితే అందులో ఎక్కువ కాయలు వేస్తాం కదా అని చాలా మంది జ్యూసులు తాగడానికే మొగ్గు చూపుతారు. కానీ అసలు విషయం ఏంటంటే జ్యూస్ కంటే పండ్లు తినడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటమే కారణం. అందుకే నిపుణులు జ్యూస్ కంటే పండ్లు తినమనే సలహా ఇస్తారు.
పండ్లతో చేసిన జ్యూస్ చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. అవి కేవలం పంచదార నీళ్ళు లాగా మాత్రమే మిగిలిపోతాయి. అదే కాయలు అయితే ఒకటి లేదా రెండు తిని ఆపేస్తాం. కానీ జ్యూస్ అలా కాదు చాలా కాయలు వేసి చేస్తారు. ఆహారం మితంగా తీసుకుంటే మంచిది.. అదే అమితంగా తీసుకుంటే విషం అని పెద్దలు అంటారు. అది జ్యూస్ విషయంలోనూ వర్తిస్తుంది.
జ్యూస్ లు ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదంటే..
*ఫైబర్ తక్కువ: కాయలు తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరచడంతో పాటు పేగుల పని తీరుని సరిచేస్తుంది. కానీ జ్యూస్ వల్ల మీ శరీరానికి అవసరమైన ఫైబర్ అందదు.
* చక్కెర స్థాయి అధికం: ఒక గ్లాస్ జ్యూస్ లో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. కాయలు జ్యూస్ గా చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు నశించిపోతాయి. అందువల్ల కేవలం అవి పంచదార నీళ్ళలాగా మారిపోతాయి. అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.
*ఆకలి తీరదు: మీకు బాగా ఆకలి వేసినప్పుడు ఒక పండు తిన్నా మీ ఆకలి తీరి కడుపు నిండుగా అనిపిస్తుంది. అంతే కాదు మీరు బరువు తగ్గేందుకు కూడా పండ్లు మంచి ఆహారం. అందుకే వ్యాయామం చేసేన తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో చాలా మంది ఫ్రూట్ సలాడ్ ని భాగంగా చేసుకుంటారు. అదే జ్యూస్ తాగితే మాత్రం కడుపు నిండినట్లు కాసేపు అనిపించినా తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అందువల్ల మళ్ళీ మీరు ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాల్సిందే.
* పోషకాలు తక్కువ: పండ్లని జ్యూస్ చేయడం వల్ల అందులో ఉండే అన్నీ పోషకాలు నశించిపోతాయి. అందుకని జ్యూస్ కంటే పండ్లు తినడమనే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు
Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ
Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి
Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్