Vegan Diet: సెలెబ్రిటీలు వీగన్లుగా ఎందుకు మారుతున్నారు? ఈ డైట్ వల్ల లాభాలేంటి?

వీగన్ డైట్ అనుసరిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

FOLLOW US: 

సెలెబ్రిటీల డైట్‌గా మారిపోయింది వీగన్ డైట్. చాలా మంది సెలెబ్రిటీలు వీగన్ డైట్‌ను ఫాలో అయ్యేందుకు  ఆసక్తి చూపిస్తున్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, ఆలియా భట్, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ వంటి ఎంతో మంది సెలెబ్రిటీలు ప్రస్తుతం వీగన్ డైట్ లవర్స్ గా మారారు. మరింత మంది ఇదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సెలెబ్రిటీలకు అంతగా నచ్చేలా ఈ డైట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? 

అసలు ఏంటి వీగన్ డైట్?
పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారమే వీగన్ డైట్. జంతువుల నుంచి వచ్చే, తయారయ్యే ఏ ఉత్పత్తిని వీరు తినరు. చివరికి పాలు, పెరుగు, తేనె వంటివి కూడా ముట్టుకోరు. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే వీరు స్వీకరిస్తారు. కొంతమంది కనీసం లెదర్ బ్యాగులు వాడేందుకు కూడా ఇష్టపడరు. ఇలాంటి వీగన్ డైట్ ఫాలో అయ్యేవారిని వీగన్లు అంటారు. 

ఈ డైట్ వల్ల ఎన్ని లాభాలో...
చురుగ్గా పనిచేసేందుకు వీగన్ డైట్ చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా నటీనటులు, క్రీడాకారులకు శరీరం ఫ్లెక్సిబుల్ గా, ఉత్సాహంగా, చురుగ్గా ఉండడం చాలా అవసరం. వీగన్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ డి, కార్బోహైడ్రేట్లు, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. గాయాలు త్వరగా మానేందుకు కూడా ఈ డైట్ చాలా అవసరం.  ఈ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగరు. పైగా అధిక బరువు ఉన్న వారు సులువుగా తగ్గుతారు. 

ఆరోగ్యానికీ... పర్యావరణానికీ...
వీగన్ డైట్ వల్ల ఆరోగ్యానికే కాదు పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఈ డైట్ ను అనుసరించడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహం, క్యాన్సర్ బారిన పడే  అవాకాశం చాలా తక్కువ. అందుకే ఈ ఆహారాన్ని అధిక శాతం మంది తినేందుకు ఇష్టపడుతున్నారు. పర్యావరణానికి ఈ డైట్ వల్ల చాలా లాభం. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఈ డైట్‌ను అనుసరించడం వల్ల మైక్రో న్యూట్రియంట్ల లోపం,ప్రొటీన్ల లోపం కూడా తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే ఈ డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు గోధుమలు, సోయాబీన్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. పోషకాలన్నీ ఉండేలీ వీగన్ మెనూని సిద్ధం చేసుకోవాలి. 

Also read: ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు, బరువు తగ్గాల్సిందే

Also read: సల్మాన్ ఖాన్‌కున్న ఆరోగ్య సమస్య ఇదే, ఇదో వింత రోగం

Also read: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం

Published at : 11 May 2022 02:36 PM (IST) Tags: Vegan Diet Virat Kohli Vegan Celebrity Vegans Vegan Diet benefits

సంబంధిత కథనాలు

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

టాప్ స్టోరీస్

Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

Regional Parties  Income  :  అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?