మాల్దీవులను మెచ్చుకున్న WHO - ఎందుకో తెలుసా?
Maldives: రెండు దేశాల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా దృవీకరించింది. మరి అవి ఏ దేశాలు? ఏం జరిగిందో తెలుసుకుందాం.
మాల్దీవులు, శ్రీలంక హెపటైటిస్ బి వ్యాధి మీద పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో పిల్లల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కువ మందికి సిఫారసు చేసిన డోసుల్లో పూర్తిచేశారని, ఇటీవల నిర్వహించిన సెరోలాజికల్ సర్వేల ద్వారా ఈ విషయాలను దృవీకరిస్తున్నట్టు నిపుణుల బృందం ప్రకటించింది.
WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ ఖేత్రపాల్ సింగ్ ఈ దేశాల్లోని ఆరోగ్య సంస్థలను, అక్కడి అధికారులను, కార్యకర్తలను వారి కృషిని ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలిపారు.
WHO సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్‌లోని హెపటైటిస్ బి నియంత్రణను ధృవీకరించేందుకు నిపుణుల ప్యానెల్ ను మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పిల్లల్లో నిరోధకతను సమీక్షీంచింది. ఈ సమీక్ష ప్రకారం హెపటైటిస్ బి వ్యాక్సిన్ 90 శాతం పైగా కవర్ చేశారు.
2022-23 సంవత్సరాల్లో జాతీయ సర్వే ఫలితాలను కూడా నిపుణులు సమీక్షించారు. ఈ వివరాల ఆధారంగా నిపుణుల ప్యానెల్ ఈ రెండు దేశాల్లో హెపటైటిస్ బి నియంత్రణను దృవీకరించడానికి అవసరమైన అన్ని ప్రమాణాలతో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ ఆగ్నేయాసియా హెపటైటిస్ బి నియంత్రణ నిపుణుల ప్యానెల్ చైర్ పర్సన్ డాక్టర్ సుపమిత్ చున్సుట్టివాట్ అభినందనలు తెలిపారు.
2019లోనే ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయ్‌లాండ్ సాధించాయి. ఇప్పుడు కొత్తగా మాల్దీవులు, శ్రీలంక వీటి సరసన చేరాయి. బాల్యంలోనే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ను నివారించడం వల్ల దీర్ఘకాలికంగా కాలేయ క్యాన్సర్, సిర్రోసిన్ వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
ఆగ్నేయాసియా ప్రాంతంలో ఒక ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమంగా హెపటైటిస్ నియంత్రణను WHO నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 11 దేశాలున్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక హెపటైటిస్ బితో దాదాపుగా 60 మిలియన్ల మంది జీవిస్తున్నారు. ప్రతి యేటా 2,18000 మంది హెపటైటిస్ బి, సితో మరణిస్తున్నారు.
2016లో ఆగ్నేయ ఆసియా రీజినల్ ఇమ్యూనైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ హెపటైటిస్ బి నియంత్రణకు సంబంధించిన ప్రాంతీయ లక్ష్యాన్ని ఆమోదించి హెపటైటిస్ బి ప్రాభల్యాన్ని 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 1 శాతం కంటే తక్కువ నమోదయ్యే లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.
పెంటావ్యాలెట్ వ్యాక్సిన్ మూడు మోతాదులలో మొదటి సంవత్సరం పిల్లలకు అందించారు. ఈ ప్రాంతంలోని ఎనిమిది దేశాలు నవజాత శిశువులకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ బర్త్ డోస్ అందిస్తున్నాయి. కోవిడ్ 19 సమయంలో పెంటావ్యాలెట్ టీకా 3 వ డోస్ కవరేజి గణనీయంగా తగ్గింది కానీ తర్వాత 2021 లొ 82 శాతానికి పెరిగింది.
హెపటైటిస్ బి బర్త్ డోసుల కవరేజిని పెంచడానికి ఉన్న అవరోధాల్లో ప్రధానమైంది ఇంట్లో డెలివరీలు జరగడం అని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటి ప్రసవాల్లో పుట్టిన పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ సమయానికి అందించడం సాధ్యపడడం లేదని డబ్య్లూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ ఖేతర్ పాల్ వివరణ ఇస్తున్నారు. హెపటైటిస్ బి టీకా కవరేజి సమర్థవంతంగా జరగాలంటే ప్రచారం, అవగాహన చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
హెపటైటిస్ ను తప్పకుండా నివారించాలి, చికిత్స కూడా అందించాలి. టీకాతోపాటు సురక్షితమైన ఇంజెక్షన్, సురక్షిత రక్తం వంటి నివారణల్లో అత్యంత కీలకం. వీటి గురించి నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండడం చాలా అవసరమని డాక్టర్ ఖెతర్ పాల్ సింగ్ వివరించారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read : Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?