By: ABP Desam | Updated at : 14 Apr 2022 07:42 AM (IST)
(Image credit: Pixabay)
ఇంట్లో వాడే వంటనూనె కూడా ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుబాట ధరలో ఉండి డయాబెటిక్ రోగులకు కూడా మేలు చేసే ఆయిల్ ‘రైస్ బ్రాన్ ఆయిల్’. దీనితో వండిన వంటలు తినడం వల్ల మధుమేహు రోగుల్లో ఇన్సులిన్ నిరోధకత సమస్య మెరుగుపడుతుంది. అంతేకాదు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవాకాశాలను ఇది ఎంతో కొంత మేర తగ్గించి నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిక్ రోగులకు మేలు చేసే వంట నూనెగా రైస్ బ్రాన్ ఆయిల్ పేరు తెచ్చుకుంది.
అధికంగా వాడేది ఇక్కడే
రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఆసియా దేశాల్లోనే అధికంగా వాడుతారు. ముఖ్యంగా చైనా, భారత్, జపాన్ దేశాల్లో వినియోగిస్తుంటారు. ఇది వరి ఉత్పత్తి. ధాన్యపుగింజలను తీసేశాక ఆ వరి కంకులను కొంత తవుడు రూపంలో మారుస్తారు. ఆ తవుడును జంతువులకు మేతగా ఉపయోగిస్తారు. అలాగే దాన్నుంచి నూనె కూడా తీస్తారు. అదే రైస్ బ్రాన్ ఆయిల్. వరి ఉత్పత్తి కనుక ఇది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. దీన్ని తయారుచేసిన మొదట్లో ఈ నూనెను కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడలేదు. తరువాతి కాలంలో మాత్రం దీని ప్రయోజనాలు తెలుసుకుని వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు అధికంగా అమ్ముడవుతున్న వంటనూనెల్లో ఇది కూడా ఒకటి.
నిండా పోషకాలు
ఈ నూనెలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. గుండె ఆరోగ్యం కోసం రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం మొదలుపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది ముందుంటుంది. దీనిలో ఓరిజనాల్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, చెడుకొవ్వును బయటికి పంపిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుని పోరాడతాయి. కాబట్టి ఇంట్లో వాడకానికి ఇది ఉత్తమ నూనె అని చెప్పవచ్చు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురించిన ప్రకారం డయాబెటిక్ రోగులు ఈ నూనుతో వండిన వంటలు తినడం వద్ద వారిలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశాన్ని 30 శాతం తగ్గించవచ్చు. అంటే ఏదైనా ఆహారం తిన్నాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ నూనెలో శక్తివంతమైన ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అవి ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
క్యాన్సర్‌కు చెక్
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, టోటోట్రినాల్స్ వంటివి క్యాన్సర్ ఎదుగుదులను అడ్డుకుంటాయి. ఈ నూనె క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. రొమ్ము, కాలేయం, మెదడు, పాంక్రియాస్, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. నోటి ఆరోగ్యానికి కూడా ఈ ఆయిల్ మేలు చేస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
Also read: అలసట, నీరసం వేధిస్తున్నాయా? వీటిని తినడం తగ్గిస్తే ఉత్సాహంతో ఉరకలేయచ్చు
Also read: ఏడాదికి పన్నెండుకోట్లకు పైగా అవాంఛిత గర్భాలు, అందులో మన దేశం వాటా ఎంతో తెలుసా?
Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే