Pregnancy: ఏడాదికి పన్నెండుకోట్లకు పైగా అవాంఛిత గర్భాలు, అందులో మన దేశం వాటా ఎంతో తెలుసా?
అవాంఛిత గర్భాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోవడం కలవరపాటుకు గురిచేస్తున్నట్టు చెబుతోంది ఐరాస.
అసురక్షిత లైంగిక జీవితం అవాంఛిత గర్భాలకు కారణమవుతోంది. దీంతో ఎంతో మంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. మరికొందరు నిరాదరణకు గురై మరణిస్తున్నారు. ఈ అంశంపై ఐరాస ఎప్పట్నించో ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజా రిపోర్టుల ప్రకారం ప్రపంచంలో ఏటా 12 కోట్లకు మంది మహిళలు అవాంఛిత గర్భాలను మోస్తున్నారని, బిడ్డలకు జన్మినిస్తున్నారని చెప్పింది ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్. ఆ రిపోర్టులోని అంశాలు మన దేశంలోని పరిస్థితిని కూడా వివరించాయి. ప్రపంచంలో అవాంఛిత గర్భాల బారిన పడుతున్న ఏడుగురు మహిళల్లో ఒకరు మనదేశానికి చెందిన వారే. ప్రసూతి ఆరోగ్య సంరక్షణ, అనారోగ్య పరిస్థితుల్లో బిడ్డ పుట్టడం, తల్లి ఆరోగ్యం కూడా క్షీణించడం వంటివన్నీ కూడా మనదేశంలోనే అధికంగా ఉన్నట్టు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇండియాలోని అవాంఛిత గర్భాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ రిపోర్టులు చెబుతున్నాయి.
2015 నుంచి 2019 మధ్య రిపోర్టును ఐరాస ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ పేరుతో ప్రచురించింది. దానిలో ప్రపంచవ్యాప్తంగా గర్భం దాల్చిన మహిళల్లో 48 శాతం గర్భాలు అవాంఛితమైనవేనని తేలింది. వాటిలో 61 శాతం గర్భాలు అబార్షన్‌తో ముగిశాయని పేర్కొంది. ప్రపంచంలో జరుగుతున్న అబార్షన్షలో 67 శాతం అసురక్షిత పద్ధతుల్లో జరుగుతున్నట్టు కూడా తెలిపింది.
ఇబ్బందుల్లో టీనేజీ అమ్మాయిలు
టీనేజీ వయసులోనే లైంగిక సంబంధాలు పెట్టుకున్న అమ్మాయిలే అధికంగా అవాంఛిత గర్భాల బారిన పడినట్టు ఐరాస ప్రతినిధి ఆండ్రియా తెలిపారు. అలాగే చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుని 18 ఏళ్లలోనే పిల్లలకు జన్మనిస్తున్న అమ్మాయిలూ అధికంగానే ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 13 శాతం మంది అమ్మాయిలు పద్దెనిమిదేళ్లు నిండకముందే పెళ్లి చేసుకుంటారని , పిల్లలను కంటారని నివేదిక పేర్కొంది. వారిలో కొంతమంది తమ మొదటి బిడ్డను 14 సంవత్సరాల వయస్సులో, రెండో బిడ్డను 20 ఏళ్లు నిండకముందే కంటున్నట్టు తేలింది.
మన సర్వేలో...
మనదేశంలో ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను (NFHS-5) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. 2019 -21 మధ్య జరిగిన ఈ సర్వేలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న వేయి మంది మహిళల్లో 43 మంది పిల్లలను కన్నారు. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని చెప్పుకోవచ్చు. 2015-16 మధ్య ఇదే సర్వే నిర్వహిస్తే 15 నుంచి 19 ఏళ్ల మధ్య పిల్లలను కన్న అమ్మాయిల సంఖ్య 51గా ఉంది. ఇప్పుడు ఎంతో కొంత వారిలో చైతన్యం వచ్చిందని భావించాలి. అమ్మాయిలకు 21 ఏళ్లు వివాహానికి సరైన వయసు. అంతకుముందే పెళ్లి, పిల్లల వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.
Also read: బంగారు బర్గర్, దీన్ని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే, ధరెంతంటే
Also read: మీ కలలో ఎప్పుడైనా ట్రాన్స్‌జెండర్ కనిపించారా? అయితే దానర్ధం ఇదేనట