By: ABP Desam | Updated at : 13 Apr 2022 08:44 AM (IST)
Edited By: harithac
ట్రాన్స్‌జెండర్ కలలో కనిపిస్తే మంచిదా కాదా?
నిద్రా - కల... ఈ రెండింటిది విడదీయరాని బంధం. గాఢనిద్రలోకి జారుకున్నాకే కలలు మొదలవుతాయి. ఒక్కరాత్రి నిద్రలో ఎన్నో కలలు వస్తాయి.ఉదయం లేచాక గుర్తుండేవి మాత్రం ఒకటో లేదా రెండో. నిద్రలో రాపిడ్ ఐ మూమెంట్ వల్ల కలలు వస్తుంటాయని అధ్యయనాలు తెలిపాయి. రాపిడ్ ఐ మూమెంట్ దశలోకి వెళ్లాలంటే ముందుగా గాఢనిద్రలోకి జారుకోవాలి. కలలు వచ్చాయంటే మీకు మంచి నిద్ర పట్టిందనే అర్థం. కలల శాస్త్రంలో ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంది. కొందరికి భయంకరమైన కలలు వస్తుంటాయి, దెయ్యాలు, భూతాలు, పాములు, జంతువులు వెంటాడుతున్నట్టు ఇలా ఎన్నో భయపె కస్వప్నాలు వస్తుంటాయి. కొందరికి కలలో ట్రాన్స్ జెండర్లు కూడా కనిపిస్తారు. చాలా మంది వారు కనిపించగానే తమకేదో అయిందేమో అనుకుంటారు, తాము కూడా అలా అయిపోతామేమో అన్న అనుమానం, భయంతో దిగ్గున లేచి కూర్చుంటారు. ఆందోళన పడతారు. ముఖ్యంగా మగవారిలో ఈ భయం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కలల శాస్త్రం మాత్రం వేరేలా చెబుతోంది. ట్రాన్స్ జెండర్ కలలోకొస్తే వచ్చే ఫలితాలు పాజిటివ్ గా ఉంటాయని వివరిస్తోంది.
మంచి శకునమే...
కలలో ట్రాన్స్‌జెండర్ కనిపిస్తే అది మీలో దాగున్న బలమైన శారీరక శక్తిని సూచిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. శ్రేయస్సు, అదృష్టం, విశ్వాసం, విజయం, ప్రేమ వీటన్నింటికీ ఆ కల సూచిస్తుంది. అంతేకాదు మీరు మీ జీవితంలో కొన్ని అవసరమైన అంశాలను తొలగించి, ముఖ్యమైన విషయాలను సమయం కేటాయించాలని కూడా సంకేతం ఈ కల.
పెళ్లి కాని వారిలో...
పెళ్లికాని వారికి ట్రాన్స్ జెండర్ కనిపిస్తే సమీప భవిష్యత్తులో వివాహం జరుగుతుందని సూచన. మీ ఆలోచనలు విశాలంగా ఉండాలని, బ్రాడ్ మైండ్‌తో ఆలోచించాలని, ఓపెన్ మైండ్ ఉండాలని కూడా సంకేతం.
అమ్మతో అనుబంధం
కలలో ట్రాన్స్ జెండర్‌ను చూడడం అమ్మతో అనుబంధానికి, అమ్మతరుపు వారితో సంబంధాలు మెరుగుపడడానికి సంకేతంగా కూడా చెబుతోంది కలల శాస్ర్తం. ఈ కల సంపద, శక్తి, ధైర్యానికి సంకేతం. మీరు మరింతగా ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలని కూడా ఈ కల మీకు చెప్పకనే చెబుతోంది. అంతేకాదు అమ్మ తరపు కుటుంబం నుంచి మిమ్మల్ని సాయం కోరే అవకాశం ఉంది.
Also read: మహిళలూ జాగ్రత్తగా వినండి, ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, అది క్యాన్సర్ కావచ్చు
Also read: పిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వెళుతున్నారా? వారికి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలివే
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్లా తినేశాడు
Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు
Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు