Diabetic Retinopathy: డయాబెటిక్ రెటినోపతి వస్తే చూపు పోతుందా, ఎలా కంట్రోల్ చెయ్యాలి
డయాబెటిక్ రెటినోపతి కేసులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసులో కూడా నేత్ర సమస్యలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి దీని నివారణ మార్గాలను తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ స్థాయిలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారా.. అయితే కొన్ని కీలక టెస్టులు చేయించుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి వ్యాధి ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బాధితులను బాగా దెబ్బ తీస్తోంది. డయాబెటిక్ రెటినోపతి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి? దీనికి సంబంధించిన లక్షణాలు, నివారణ మార్గాలు తెలుసుకుందాం.
మీరు చిన్న వయస్సులోనే డయాబెటిస్ తో బాధపడుతున్నట్లయితే, కాలక్రమేణా, మీ రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగి అవి మీ రెటీనాను దెబ్బతీస్తాయి. డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా ఉండాలంటే డయాబెటిస్ ఉన్నవారు ప్రారంభంలోనే వారి రక్తంలో షుగర్, బీపీ స్థాయిలను తగ్గించుకోవాలని అమెరికా వైద్య బృందం సూచిస్తుంది.
డయాబెటిస్ ప్రారంభ దశలో టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో 52 శాతం, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 56 శాతం మందిలో డయాబెటిస్ రెటినోపతి పరిస్థితి ఉన్నట్లు గమనించారు. అయితే సాధారణ జనాభాలో డయాబెటిక్ రెటినోపతి పట్ల గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది.
కొన్ని పరీక్షలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ కంటిని డయాబెటిక్ రెటీనాపతి వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అందులో మొదటిది HbA1c పరీక్ష, దీని ద్వారా డయాబెటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. బేస్‌లైన్ రెటీనా ఫోటో పరీక్ష చేయించుకోవడం ద్వారా మీరు డయాబెటిస్ రెటీనా పతి బారిన పడ్డారో లేదో తెలుసుకోవచ్చు. డయాబెటిక్ రెటీనాపతి సంబంధిత సమస్యలను నివారించడానికి శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారంతో డయాబెటిస్ నియంత్రణలో పెట్టుకోవచ్చు.
డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి?
డయాబెటిక్ రెటినోపతి అనేది కంటికి వచ్చే వ్యాధి, ఇది డయాబెటిస్ ఉన్నవారిలో సంభవిస్తుంది. ఇందులో దృష్టిని కోల్పోవడంతో, అంధత్వం కూడ వస్తుంది. బ్లడ్ షుగర్ అధికంగా ఉంటే రెటీనాలోని రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది, రెటీనా రక్తనాళం దెబ్బతినడం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
2030 నాటికి ప్రపంచంలోని డయాబెటిక్ రెటినోపతి కేసుల సంఖ్య 1.91 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది డయాబెటిస్ తో జీవిస్తున్నారు , కనీసం 58 శాతం మందికి డయాబెటిక్ రెటినోపతి గురించి అవగాహన ఉండదు.
నివారణ పద్ధతులు:
డయాబెటిక్ రెటినోపతి వ్యాధిని నివారించుకునేందుకు మీ రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు సమతుల ఆహారము, సరైన నిద్ర పోవడం, ఒత్తిడి లేని జీవన విధానం అలవర్చుకోవడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా మన నేత్రాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : ఉప్పు లేదా చక్కెర - వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.