అన్వేషించండి

Balusaku: బతికుంటే బలుసాకు తినొచ్చంటారు, ఏంటీ బలుసాకు? ఎందుకలా అంటారు?

తెలుగులో ఎన్నో సామెతలు. ఆ సామెతలన్నింటికీ ఒక అర్థం ఉంటుంది.

సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంప్రదాయాలను, జీవనాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. సామెతలను లోకోక్తులు అని కూడా అంటారు. అనుభవ సారాలతోనే సామెతలు పుట్టాయని చెప్పుకోవచ్చు. మాటల మధ్యలో సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినంత తియ్యగా ఉంటాయని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మందికి తెలుగు సామెతలు తెలియవు. ఆధునిక కాలంలో ఆంగ్ల వాడకం ఎక్కువయ్యాక ఏవి సామెతలో, వాటిని ఎందుకు వాడతారో కూడా తెలియకుండా పోయింది. కరోనా వచ్చాక బాగా వినిపించిన సామెత ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అని. లాక్‌డౌన్ సమయంలో సీఎం కేసీఆర్ కూడా ఈ సామెతను వాడారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సామెతల వాడకం ఇంకా ఉంది. 

ఏంటి బలుసాకు?
తెలుగు సామెతల్లో అధికంగా వాడే వాటిలో ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’, ‘బతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు’ అనేవి. ఈ రెండింటిలో వాడిన బలుసాకు గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అది కూడా గ్రామాల్లోని వారికి తప్ప ఆధునిక యువతకు, నగర జీవులకు తెలిసేది తక్కువే. ఆ ఆకు గొప్పతనం వల్లే రెండు సామెతలు పుట్టాయి. ఆ ఆకులు మన పూర్వీకులకి ఎంతగా ఉపయోగపడ్డాయో, సామెతలను చూస్తే అర్ధమైపోతుంది. బలుసాకు అనేది ఒక ముళ్ల మొక్క పేరు. కంపచెట్టులా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం ‘వెబెరా టెట్రాండ్రా - కాంథియం పార్విఫ్లోరమ్’ అంటారు. ఎన్నో ఔషధగుణాలున్న మొక్క ఇది. సంసృతంలో ఈ మొక్కని బారదాజి, బలాక అని పిలుస్తారని చెబుతారు. 

ఆకు వల్ల ఎన్నో లాభాలు
ఈ ఆకుల్లో ఔషధ గుణాలు అధికం. పూర్వం అతిసారానికి మందుగా వాడేవారు. ఈ ఆకుల్నించి సారాన్ని తీసి కషాయం చేసేవారు. అది ఎన్నో రోగాలను తగ్గించే గుణాల కలది. ఈ ఆకుల్లో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. అందుకే అప్పట్లో ఆకులను వంటల్లో కూడా వాడేవారట. పచ్చడి చేసుకునేవారట. జ్వరాన్ని, పైత్యాన్ని తగ్గించే లక్షాలు ఇందులో ఉండేవట. ఈ ఆకు రుచి కాస్త వగరుగా ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం ప్రజలు తినేవారని చెబుతారు.అనారోగ్య పరిస్థితుల్లో పథ్యం పాటించాల్సి వచ్చినప్పుడు బలుసాకు వంటలను లాగించేవారు. అందుకే బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని సామెత పుట్టినట్టు వాదన ఉంది. వందేళ్ల క్రితం పశువులే ప్రజలకు జీవనోపాధిగా ఉండేది. వాటి రోగాలకు కూడా బలుసాకును వాడే వారు. గౌట్ ఆర్థరైటిస్ కు చెక్ పెట్టే లక్షణాలు దీనిలో ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకు వాడకం ఎక్కువే. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది. మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. బలుసు మొక్కకి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. వాటిని కూడా వైద్యంలో వాడేవారు. ఆ ఆకులను పచ్చివి నమిలి తినేవారట. నేరుగా తినలేని వారు వండుకుని, పచ్చడి చేసుకుని తినేవారు. ఎంత కష్టకాలం వచ్చినా బతకాలన్న ఆశ ఉండాలని చెప్పేందుకు కూడా ఈ సామెతను వాడుతారు. 

Also read: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి

Also read: త్వరలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్న కేంద్రప్రభుత్వం, అసలేంటీ ఫోర్టిపైడ్ బియ్యం? ఎందుకు అవసరం?

టాప్ హెడ్ లైన్స్

World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget