Bathing Tips: స్నానం చేసేప్పుడు కాళ్లు కడుగుతున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోండి
స్నానం చేసేప్పుడు చాలామంది కాళ్లు కడగడానికి బద్దకిస్తారు. వంగిని ఏం క్లీన్ చేసుకుంటాంలే అని కాళ్లతోనే అటూఇటుగా క్లీన్ చేసుకుని వదిలేస్తారు. మరి, ఇది మంచి అలవాటేనా?
స్నానం చేస్తున్నప్పుడు ఒళ్లంతా శుభ్రమవుతుంది. మరి కాళ్లు? చాలామంది స్నానం చేస్తారేగానీ.. తమ కాళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోడానికి ఆసక్తి చూపించారు. చెప్పాలంటే.. కిందకి వంగి కాళ్లను తోమలంటే బద్దకం. అందుకే, ఒక కాలును మరో కాలు మీద వేసి.. క్లీనింగ్ కానిచ్చేస్తారు. కొందరైతే అది కూడా చేయరు. వారి ఫోకస్ మొత్తం శరీరంలో పైభాగం మీదే పెడతారు. సబ్బంతా పొట్టపైనే రుద్దేస్తుంటారు. మరి, స్నానం చేస్తున్నప్పుడు కాళ్లను కూడా సబ్బుతో రుద్ది శుభ్రం చేసుకోవడం అవసరమా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?
స్నానం చేసినప్పుడు కాళ్లను శుభ్రం చేసుకోవాలనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కిందట దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్‌లో సుమారు 20 శాతం మంది స్నానం చేసే సమయంలో కాళ్లు కడుక్కోలేదని సమాధానం చెప్పారట.
తల స్నానం చేస్తున్నామని కేవలం తలకు మాత్రమే స్నానం చేస్తున్నారా? ఇదేమి ప్రశ్న అని అవాక్కయ్యారా? అంటే కేవలం తల మాత్రమే కడుక్కొని కాళ్లు కడుక్కోవడం లేదా?అని కొనార్ ఆర్ప్వెల్ నుంచి ఈ విషయం గురించిన ఒక ట్విట్టర్ పోల్ వైరల్ అయింది. సుమారు 20 శాతం మంది స్నానం చేసే సమయంలో కాళ్లు కడుక్కోలేదట. ఆ పోల్‌కు 92,029 ఓట్లు వచ్చాయి.
క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ జాషువా జీచ్నర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కనిపించేంత మురికిగా ఉంటే తప్ప షవర్ చేసిన ప్రతిసారీ కాళ్లు కడుక్కొవాలని తాను చెప్పనని తెలిపారు. ఎక్కువ కడగడం, ఎక్స్ పోలియేట్ చెయ్యడం వల్ల చర్మం పొడిబారి ఇరిటేట్ చేస్తుందని చెప్పారు. సున్నితమైన చర్మం గలవారు స్క్రబ్బింగ్ చెయ్యకపోవడమే మంచిదట. చెమట ఎక్కువగా రావడం, గాయాలు వంటివి ఏవైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా కాళ్లు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. డెర్మటాలజిస్ట్ వినోద్ నంబూద్రి మాట్లాడుతూ.. అమ్మాయిలు అక్కడ షేవింగ్ చేసే ముందు కాళ్లు కడుక్కోవాలని సూచించారు. లేదా షవర్ బాత్ అయ్యే వరకు ఆగి.. తర్వాత వెంటుకలు, చర్మం పూర్తిగా మృదువుగా మారుతాయి. అప్పుడు షేవ్ చెయ్యడం మంచిదన్నారు.
కాళ్లను ఎందుకు శుభ్రం చేయాలి?
శరీరం మీద చేరిన బ్యాక్టీరియాను తొలగించేందుకు స్నానం చెయ్యడం అవసరం. కాళ్ల మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. పాదాలు తేమగా, చెమటగా ఉంటాయి కనుక కాళ్లపై బ్యాక్టీరియా భిన్నంగా ఉంటుంది. పాదాల కంటే కాళ్ల పై తక్కువ బ్యాక్టీరియా ఉంటుందని మాత్రం అపోహ పడొద్దు. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఎక్కువగా పెరిగి నిరోధకత బలహీనపడి ఉంటే అది ఇంపెటిగో లేదా అథ్లేట్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.
శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మంచి విషయమే కానీ అతి పనికిరాదు. చెమట అంటే నీరు, ఉప్పు. నీళ్లతో కడుకున్నా చాలు శుభ్రపడుతుంది. సన్ స్క్రీన్ వంటివి ఉపయోగించి ఉంటే లేదా కాళ్లు మురికిగా కనిపిస్తే శుభ్రం చేసుకోవడం అవసరమవుతుంది. అలాంటి సందర్భాల్లో మైల్డ్ సోప్ లేదా క్లెన్సర్ ను ఉపయోగించాలి. ప్రతి సారీ సబ్బు, స్క్రబ్బర్ ఉపయోగించే అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
Also read : మీ జీవితం ఇలా లేకపోతే, త్వరగా ముసలోళ్లు అయిపోతారు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.