Holi 2022: హోలీ రంగులు ముఖం, జుట్టుకు పట్టేశాయా? ఇలా చేస్తే ఇట్టే పోతాయి
హోలీ ఆడినప్పుడే జాలీగానే ఉంటుంది. ఆ తరువాతే సమస్యంతా.
రంగులు చల్లుకునే హోలీ అంటే ఫుల్ జోష్‌లో ఆడతారు అంతా. ఆడినంత సేపు జాలీగానే ఉంటుంది. ఆ తరువాతే ఆ రంగులు చర్మంపైనుంచి పోక, జుట్టుకు పట్టేసి ఇబ్బంది పెడతాయి. ఆ రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హానికి చేస్తాయి కాబట్టి రాసుకున్నాక త్వరగా శుభ్రం చేసుకోవడం ఉత్తమం. కానీ రంగులు రెండు మూడు రోజులైన సరిగా పోవు. హోలీ ఆడిన వెంటనే కొన్ని పద్దతుల్లో రంగులను వదిలించుకోవచ్చు. ఎలాగో చూడండి.
1. హోలీ రంగులు చల్లకోవడానికి సిద్దమయ్యారా? అంతకన్నా ముందు ఒళ్లంతా కొబ్బరినూనె బాగా పట్టించండి. లేదా గ్లిజరిన్ రాసినా మంచిదే. ఇవి రంగులను చర్మంలోపలికి వెళ్లనివ్వవు. సబ్బుతో కడిగినే వెంటనే పోతాయి కూడా.
2. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మరీ చల్లని నీళ్లు, వేడి నీళ్లు వాడకూడదు.
3. పెరుగులో కోడిగుడ్డు సొన కలిపి బాగా గిలక్కొట్టి వాటిని తలకు పట్టించాలి. కాసేపయ్యాక మైల్ట్ షాంపూతో కడిగేస్తే తలకు పట్టిన రంగులు పోతాయి.
4. శెనగపిండి కూడా రంగులో పోగొట్టేందుకు సహకరిస్తుంది. అందులో పాలు, పెరుగు, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఆ పేస్టుతో ముఖాన్ని, చేతులను, మెడను బాగా రుద్దాలి. రంగులు పోయే అవకాశం అధికం.
5. రంగు పూసుకోవడానికి ముందు ఒళ్లంతా మాయిశ్చరైజర్ రాసుకున్నా రంగులు మరీ శరీరానికి అతక్కోకుండా ఉంటాయి.
6. రంగులు వల్ల కొందరికి దురదగా ఉంటుంది. అలాంటి ముఖానికి ముల్తానిమట్టి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరువెచ్చనిన నీటితో కడిగేసుకోవాలి.
7. దుస్తులపై పడిన రంగులు పోవాలంటే నిమ్మరసంతో బాగా రుద్ది వేడినీళ్లలో ఉతకాలి.
8. డిటర్జెంట్, వెనిగర్ కలిపి ఉతికినా కూడా దుస్తులపై పడ్డ మరకలు పోయే అవకాశం ఉంది.
9. దుస్తులపై పడిన మరకలు పోగొట్టుకునేందుకు వెనిగర్ ను కూడా ఉపయోగించవచ్చు. అలాగే గోడలు, ఫ్లోర్లపై పడిన రంగుల మరకలు కూడా వెనిగర్‌తో పోతాయి.
View this post on Instagram
Also read: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో