Vinayaka Chavithi outfit ideas : వినాయకచవితికి ఈ డ్రెస్లు బెస్ట్ ఆప్షన్.. అమ్మాయిలు మీరు ఇలా ముస్తాబైపోండి..
Vinayaka Chavithi outfit ideas : అమ్మాయిలు ఈ వినాయక చవితి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు ఈ డ్రెస్లు ఈ ఫెస్టివల్‌కి బెస్ట్ ఆప్షన్.
Best Outfit Ideas for Women to Celebrate Vinayaka Chavithi 2024 : అమ్మాయిలకు అందంగా ముస్తాబవడం అంటే చాలా ఇష్టముంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో అందంగా కనిపించేందుకు చాలా కేర్ తీసుకుంటారు. అయితే నచ్చిన డ్రెస్‌ని ఎంచుకుని.. ముస్తాబవడం అంత సులభమేమి కాదు. పైగా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనే దగ్గరే ఎక్కువ సమయం పట్టేస్తుంది. ప్రస్తుతం మీరు కూడా ఇదే స్టేజ్‌లో ఉంటే.. కచ్చితంగా ఈ కలెక్షన్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వినాయక చవితి 2024కి ఎలా సిద్ధమవ్వాలో.. ఏ డ్రెస్ లుక్స్ బాగుంటాయో ఇప్పుడు చూసేద్దాం.
పండుగ సమయంలో ట్రెడీషనల్ డ్రెస్లు వేసుకోవడం సంప్రదాయం. అయితే అవి కంఫర్ట్‌గా ఉండడమే మనకి కావాలి. కాబట్టి అటూ ట్రెడీషనల్ని ఫాలో అవుతూ.. కంఫర్ట్‌బుల్‌గా ఉండే డ్రెస్‌లతో ఎలా ట్రెడీషనల్గా కనిపించవచ్చో.. ట్రెడీషనల్ లుక్‌లో స్టైలిష్‌గా ఎలా కనిపించవచ్చో.. ఎలాంటి డ్రెస్లు నప్పుతాయో.. ఎలాంటి జ్యూవెలరీ ధరించవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
చీర..
చీరతో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే. ఇది ట్రెడీషనల్గానూ ఉంటుంది. ట్రెండ్‌కి తగ్గట్లు స్టైల్ చేసుకోవచ్చు. పట్టుచీరలాంటివి పండుగ వైబ్స్ తీసుకువస్తాయి. అలాంటి వాటికి మీరు స్లీవ్ లెస్ బ్లౌజ్ పెయిర్ చేయొచ్చు. హెయిర్ లీవ్ చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకుంటే పండుగ కళ అంత మీ దగ్గరే ఉంటుంది. రెడ్, పింక్, గోల్డెన్ కలర్ పట్టు చీరలు బెస్ట్ ఆప్షన్. సిల్క్ చీరలు కట్టుకుంటే.. బీడ్స్ వంటి జ్యూవెలరీని దానికి సెట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీకు మంచి లుక్‌ని ఇస్తాయి.
కుర్తా సెట్స్..
కంఫర్ట్ అంటే గుర్తొచ్చే డ్రెస్‌లలో కుర్తా సెట్స్ ఒకటి. ప్రింటెండ్ కుర్తాలు చాలా వరకు అందుబాటులో ఉంటాయి. లాంగ్ స్లీవ్స్‌తో వచ్చే కుర్తా సెట్లు మీకు నిండుదనాన్ని ఇవ్వడంతో పాటు.. ట్రెడీషనల్ వైబ్స్ ఇస్తాయి. వీటికి బుట్టలులాంటి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ పెయిర్ చేసి.. హెయిర్ లీవ్ చేసినా.. జడ వేసుకున్నా బాగా నప్పుతుంది. ఎల్లో కలర్, వైట్, గ్రీన్ కలర్ డ్రెస్లు ఫెస్టివల్ సమయంలో చాలా బాగా నప్పుతాయి.
అనార్కలి
అనార్కలి డ్రెస్లు అమ్మాయిల లిస్ట్ లేకుండా ఏ ఫెస్టివల్ వెళ్లదు. ప్లేన్ అనార్కలీ డ్రెస్‌ను ఎంచుకుని.. గ్రాండ్ దుపట్టాతో మీ లుక్‌ని ఫెస్టివల్‌కి సెట్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్లు లాంగ్ హ్యండ్స్ అయితే చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ కూడా మంచి లుక్ ఇస్తుంది. షార్ట్గా ఉండేవాళ్లు లెంగ్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి పెద్ద ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి.
సల్వార్ సూట్..
సల్వార్ సూట్స్‌ని గతంలో నార్త్ వాళ్లు ఎక్కువగా వేసుకునేవారు. ఇప్పుడు సౌత్‌లో కూడా ఈ డ్రెస్లు బాగా ఫేమస్ అయ్యాయి. ఎంబ్రాయిడరీతో వచ్చే సల్వార్ సూట్స్ ఫెస్టివల్ లుక్‌ని రెట్టింపు చేస్తాయి. ఈ తరహా డ్రెస్లు తీసుకునేప్పుడు న్యూడ్ కలర్స్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నిండుగా బ్యాంగిల్స్ వేసుకుని.. మెడలో ఓ గొలుసు.. సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా మీకు మంచి లుక్ ఇస్తాయి.
స్కర్ట్ సెట్స్
బాజీరావు మస్తానీ సమయం నుంచి కుర్తా.. స్కర్ట్ కాంబినేషన్స్ బాగా పెరిగాయి. ఈ తరహా డ్రెస్ల్లో మీరు హెవీ లుక్‌ని ఎంచుకున్నా.. సింపుల్ లుక్‌ని ఎంచుకున్నా గ్రాండ్ లుక్‌ని ఇస్తాయి. వీటినికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ లుక్ కంప్లీట్ అయినట్టే. పైగా ఇవి చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటాయి. మీ దగ్గరున్న లాంగ్ మిడ్డీని కుర్తాతో కూడా సెట్ చేసుకోవచ్చు. ముందు జడ అల్లి హెయిర్ లీవ్ చేస్తే లుక్ మంచిగా ఉంటుంది.
ఈ తరహా డ్రెస్లు మీకు మంచి గ్రాండ్ లుక్‌ని ఇవ్వడంతో పాటు కంఫర్ట్‌ని కూడా అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ ఫెస్టివల్‌కి మీరు కూడా చక్కగా ముస్తాబైపోండి.