Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
ఒక టూ వీలర్‌పై ముగ్గురు ప్రయాణించడం నేరమనే సంగతి తెలిసిందే. అయితే, ముంబయిలో ఏకంగా ఆరుగురు ఒకే యాక్టీవాపై ప్రయాణించి ఆశ్చర్యపరిచారు.
మన దేశంలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తారో మీకు తెలిసిందే. పోలీసులు కనిపిస్తే ఒకలా, కనిపించకపోతే మరోలా రూల్స్‌ను మార్చుకుంటారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పినా పట్టించుకోరు. హెయిర్ స్టైల్ పాడవుతుందని కొందరు, చెమట పట్టేస్తుందని మరికొందరు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తారు. కొందరు కుర్రాళ్లయితే హీరోయిజం చూపించడానికి హెల్మెట్ ధరించరు. టూవీలర్‌పై ముగ్గురేసి ప్రయాణించడం ప్రమాదమని చెప్పినా వినరు. ఒక్కోసారి నలుగురేసి కూడా ప్రయాణిస్తుంటారు. అయితే, ముంబయిలో ఏకంగా ఒకే స్కూటర్‌పై ఆరుగురు ప్రయాణిస్తూ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబయిలో హోండా యాక్టీవాపై ఒకేసారి ఆరుగురు ప్రయాణించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే సీటు మీద ఐదుగురు కూర్చోగలిగారు. మరొకరు కూర్చోడానికి అక్కడ అస్సలు ప్లేస్ లేదు. దీంతో స్కూటీ వెనుక చివర్లో కూర్చోన్న వ్యక్తి ఓ బాలుడిని ఏకంగా తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారిని చూసి షాకయ్యారు. సర్కస్ ఫీట్‌ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఫీలయ్యారు. ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు ముంబయి పోలీస్ కమిషనర్, ముంబయి ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు.
Also Read: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!
పోలీసులు ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై స్పందిస్తూ అది ఎక్కడ చోటుచేసుకుందో తెలపాలని కోరారు. దీంతో ఆ ట్విట్టర్ యూజర్ అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్ అని తెలిపాడు. దీంతో ఆ ప్రాంత పోలీసులు ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు. డీఎన్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆ ఉల్లంఘనులను పట్టుకొనే పనిలో ఉన్నారు. మరి, వారు పట్టుబడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.
Also Read: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Heights of Fukra Panti 6 people on one scooter @CPMumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/ovy6NlXw7l
— Ramandeep Singh Hora (@HoraRamandeep) May 22, 2022
We request you to provide exact location details for further action
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 22, 2022