అన్వేషించండి

Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!

ఛీ, ‘కుక్క జీవితం’ అని అనుకుంటున్నారా? మరి, కుక్కలా జీవిస్తున్న ఇతడి జీవితాన్ని ఏమని పిలవాలి?

పై ఫొటోలో మీకు ఏం కనిపిస్తుంది? ‘‘అదేంటీ అలా అడుగుతారు? అది కుక్కే కదా’’ అనేగా మీ సమాధానం? అయితే, అది కుక్క కాదు. కుక్క రూపంలో ఉన్న మనిషి ఇంకా నమ్ముబుద్ధి కావడం లేదా? అయితే, జపాన్‌లో వింత జీవితం గడుపుతున్న ఆ వ్యక్తి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే. 

ఈ డాగ్ మ్యాన్ పేరు టోకో: చాలామందికి జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో వాటిని కుటుంబ సభ్యులతో సమానంగా పెట్స్‌ను పెంచుతారు. అయితే, అంతా తమ పెంపుడు జంతువులను బాగా పెంచుకోవాలని భావిస్తారేగానీ.. వాటిలా మారిపోవాలని మాత్రం అనుకోరు. కానీ, జపాన్‌కు చెందిన టోకో(సోషల్ మీడియాలో అతడు పెట్టుకున్న పేరు) మాత్రం పూర్తిగా కుక్కలా మారిపోయాడు. అయితే, ఇందుకు సర్జరీల్లాంటివీ ఏవీ చేయించుకోలేదు. జస్ట్ డాగ్ కాస్ట్యూమ్‌ ధరించాడు అంతే. కానీ, ఎప్పుడు చూసినా ఆ కుక్క దుస్తుల్లోనే ఉంటూ వయ్యారాలకు పోవడం అతడికి అలవాటు. 

అల్ట్రా రియలిస్టిక్ కాస్ట్యూమ్స్‌తో..: టోకోకు మనిషిలా జీవించడం అస్సలు ఇష్టం లేదు. కనీసం మనిషి రూపంలో కూడా తనని తాను ఊహించుకోడానికి చిరాకు పడేవాడు. తాను ఎలాగైనా సరే కుక్కలా జీవించాలని కోరుకున్నాడు. ఈ సందర్భంగా టోకోకు ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. వెంటనే స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్‌షాప్ ‘జెప్పెట్‌’ని సంప్రదించాడు. ఈ సందర్భంగా అతడు తన మనసులో మాట చెప్పాడు. ఇకపై తాను కుక్కలా జీవిస్తానని, ఇందుకు అవసరమైన అల్ట్రా-రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్‌ను తయారు చేసి ఇవ్వాలని వారిని కోరాడు. అతడు కోరినట్లే.. ఆ సంస్థ అతడికి ‘కుక్క’ దుస్తులను తయారు చేసి ఇచ్చింది. ఇందుకు రూ.11.64 లక్షలు చెల్లించాడట. ఆ దుస్తులను ధరిస్తే అతడు నిజంగా కుక్కలాగానే కనిపిస్తున్నాడు. 

సోషల్ మీడియాలో భలే పాపులర్: అయితే, కుక్కలా ఇంట్లో ఒంటరిగా జీవిస్తే మజా ఏముందని అనుకున్నాడో ఏమో.. ట్విట్టర్ ద్వారా తన ‘కుక్క జీవితం’ గురించి నెటిజనులకు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించాడు. అయితే, కుక్క రూపానికి, మనిషి రూపానికి చాలా తేడా ఉంటుంది. టోకో చాలా కుక్క దుస్తులు ధరించి చూశాడు. కానీ.. వాటిలో అతడు పగటి వేషగాడిలా కనిపించేవాడు. అందుకే అతడు ఆ సంస్థను ఆశ్రయించాడు. టోకు పూర్తిగా కుక్కలా కనిపించేలా చేసే ఆ డ్రెస్ తయారీకి ఆ సంస్థ ఎంతో శ్రమించింది. 

Also Read: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!

కుక్కలా ఎందుకు జీవించాలని అనుకుంటున్నాడు?: ఎట్టకేలకు అతడిని నూరు శాతం కుక్కలా చూపించే కాస్ట్యూమ్‌ను తయారు చేసి ఔరా అనిపించారు. చివరికి టోకో నోరు తెరిచినా.. కుక్క నోరు తెరిచినట్లే ఉంటుంది. దీని తయారీకి సుమారు 40 రోజులు పట్టిందట. ప్రస్తుతం టోకో ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే, మంచి జీవితాన్ని వదిలేసి కుక్కలా ఎందుకు జీవించాలని అనుకుంటున్నావని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. అయితే, టోకో మాత్రం ఇప్పటివరకు ఇందుకు తగిన సమాధానం చెప్పలేకపోయాడు. బహుశా, నెటిజనులను ఆకట్టుకోడానికి ఇదో కొత్త ఎత్తు కావచ్చని పలువురు అంటున్నారు. 

Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget