Skin Care: యవ్వనమైన చర్మం కావాలా? ఈ ఆహార పదార్థాలతో అది సాధ్యమే!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. లేదంటే నిర్జీవంగా కనిపిస్తూ కళ తప్పిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకుని ప్రయత్నించండి.
ప్రతి ఒక్కరూ చర్మం యవ్వనంగా ముడతలు లేకుండా ప్రకాశవంతంగా మెరిసిపోవాలనే కోరుకుంటారు. కానీ చలికాలంలో అది సాధించడం కొంచెం కష్టం. ఎందుకంటే చలి తీవ్రత కారణంగా చర్మం పొడి బారినట్లుగా పొట్టులేస్తూ చూసేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. చర్మం తెల్లగా కనిపించకుండా ఉండేందుకు తప్పనిసరిగా లోషన్స్ రాసుకుంటూ ఉంటారు. చర్మ సంరక్షణ తేలికైన విషయం ఏమీ కాదు. జీవన విధానం, రోజువారీ బిజీ షెడ్యూల్ కారణంగా చర్మ సంరక్షణ మీద కొద్ది ఆశ్రద్ధగా ఉంటారు. అయితే అలా కాకుండా చర్మ ఆరోగ్యం కోసం ఆహారంలో మార్పులు చేసుకుంటే సహజసిద్ధమైన అందాన్ని పొందవచ్చు.
పేలవమైన ఆహారం జీవక్రియకు హాని కలిగిస్తుంది. బరువు పెరిగేలా చేస్తుంది. పైగా చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనం తీసుకునే ఆహారం చర్మ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే పోషకాలు నిండిన సమతుల్య ఆహరం తీసుకోవాలి. వేపుళ్ళు, స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వాటికి ప్రత్యామ్నాయంగా తాజా పండ్లు, కూరగాయలు డైట్లో భాగం చేసుకోవాలి. మనం తీసుకునే ప్రతి ఆహారం శరీరంపై అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. మెరిసే చర్మం కోసం ఈ ఏడు ఆహార చిట్కాలు పాటించారంటే యవ్వనంగా ఆరోగ్యవంతంగా కనిపిస్తారు. చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ నూనెలు క్రమ తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగతామని పోషకాహార నిపుణులు చెప్పుకొచ్చారు.
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ఇవి తీసుకోండి
☀ కెరోటిన్, కెరొటీనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ అధికంగా ఉండే ఆహారాలు UV డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. నారింజ, క్యారెట్లు, ఆప్రికాట్లు, ఖర్భుజ వంటి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి.
☀ ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మృదువైన చర్మానికి దోహదపడుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
☀ బ్రకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.
☀ క్వెర్సెటిన్ అనేది ఫ్లేవనాయిడ్ చర్మ సంరక్షణకి చాలా ఉపయోగపడుతుంది. ఇది యాపిల్స్, ఉల్లిపాయలు, రెడ్ వైన్ లో దొరుకుతుంది. పొడి బారిపోకుండా చర్మం హైడ్రేట్ గా ఉండేందుకు సహకరిస్తుంది.
☀ కూరగాయ ముక్కలతో చేసిన సలాడ్స్ కూడా ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. క్యారెట్, బీట్ రూట్, టొమాటో, పాలకూరతో పాటు ఇతర పండ్ల ముక్కలు వేసుకుని మిక్స్డ్ సలాడ్ చేసుకుని తినొచ్చు. ఈ సలాడ్ విటమిన్ ఏ, హిమోగ్లోబిన్, బీటా కెరోటిన్ అందిస్తుంది. ఈ పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చూస్తుంది.
☀ అన్నింటికంటే ముఖ్యమైన విషయం తగినంత నీరు తాగడం. ఎప్పుడైతే నీళ్ళు బాగా తాగుతారో అప్పుడు చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా నివారిస్తూ అందాన్ని పొందేలా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గాలా? ఈ ఐదు ఆకు కూరలు ట్రై చేయండి