అన్వేషించండి

Alcohol mouthwash : ఇలాంటి మౌత్‌వాష్‌లు వాడుతున్నారా? అయితే, మీరు ప్రమాదంలో పడినట్లే, ఎందుకంటే?

Alcohol mouthwash : మౌత్ వాష్ లను ఉపయోగించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ మౌత్ వాష్ లతో ప్రయోజనాలతోపాటు దుష్ప్రభావాలు ఉంటాయి. ఆల్కాహాల్ ఆధారిత మౌత్ వాష్ లు వాడటం ప్రమాదకరమని తాజా అధ్యయనం పేర్కొంది.

Alcohol mouthwash : మనలో చాలా మంది మౌత్ వాష్ లను వాడుతుంటారు. మౌత్ వాష్ వల్ల మన నోటి ఆరోగ్యానికి మంచితోపాటు చెడు కూడా జరుగుతుంది. మౌత్ వాష్ మన నోట్లోని చెడు బ్యాక్టీరియాతోపాటు మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ఆరోగ్యకరమైన సూక్ష్యజీవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. అసలు మౌత్ వాష్ లు ఉపయోగించడం మంచిదా ? కాదా తెలుసుకుందాం. 

మౌత్ వాష్ అనేది నోటికి శుభ్రంగా ఉంచుతుంది. అలాగే చల్లని అనుభూతి ఇస్తుంది. మౌత్ వాష్ నోటిని పరిశ్రుభ్రంగా ఉంచుతుంది. అలాగే కొన్ని దంత సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తితోపాటు మౌత్ వాష్ నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నోట్లో మౌత్ వాష్ వేసుకున్నప్పుడు నోటి మూలాలు, పగుళ్ల మొత్తానికి వెళ్తుంది. టూత్ బ్రష్ లేదా ఫ్లోస్ స్ట్రింగ్ ఈ పనిచేయదు. ఇది ఫలకం, చిగురువాపును కూడా తగ్గిస్తుంది. దంతక్షయం, కుహరాలను నివారించడానికి సహయపడుతుంది. అయితే మౌత్ వాష్ లను వాడటం ఏమాత్రం మంచిది కాదని అధ్యయనం  చెబుతోంది. ఎందుకంటే ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్ లు నోటిలోని సూక్ష్మజీవులపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని వెల్లడించింది. నోటిలో ఉంటే బ్యాక్టీరియా పీరియాంటల్ వ్యాధులు, కొన్ని క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతాయని అధ్యయనం చెబుతోంది. 

మెడికల్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించిన..ఈ పరిశోధనలో  లైంగిక సంబంధం కలిగి ఉండే పురుషులు, లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి మౌత్ వాష్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తారని తెలిపింది. ప్రతిరోజూ మూడు నెలల పాటు ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల వీరి నోటిలో ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం,  స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్ అనే రెండు రకాల బ్యాక్టీరియా పెరిగిందని బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్  బృందం తెలిపింది. ఈ రెండు బాక్టీరియా చిగుళ్ల వ్యాధి, అన్నవాహిక, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఆక్టినోబాక్టీరియా అనే బ్యాక్టీరియా సమూహంలో తగ్గుదలని కూడా పరిశోధకులు గమనించారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది.

ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్‌లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. నోటి దుర్వాసనను పరిష్కరించడానికి లేదా పీరియాంటైటిస్‌ను నివారించడానికి చాలా మంది ప్రతిరోజూ వాటిని ఉపయోగిస్తారు. అయితే మౌత్ వాష్ వాడటం వల్ల వచ్చే ప్రమాదం గురించి వారు తెలుసుకోవాలి. మౌత్ వాష్ లను దీర్ఘకాలికంగా వినియోగించేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే వాటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. 

ఈ విషయం మీకు తెలుసా?

చాలా మౌత్ వాష్ లలో ఆల్కహాల్ ఉంటుంది. ఇలాంటి మౌత్ వాష్ లు అస్సలు మంచివి కావు. ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్ లు నోట్లో ఉండే లాలాజల ఉత్పత్తి మొత్తాన్ని తగ్గిస్తాయి. దీన్ని ఉపయోగించిన తర్వాత నోరు పొడిగా మారుతుంది. అందుకే అల్కహాల్ లేని మౌత్ వాష్ లనే ఉపయోగించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కొన్ని మౌత్ వాష్ లలో క్లోర్హెక్సిడిన్ గ్లూకోనేట్ ఉంటుంది. ఇది చిగురువాపు చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది కొన్ని సార్లు దంతాలపై మచ్చలకు కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించకపోవడమే బెటర్. 

Also read : Anger Management Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget