Skin Care with Glycerin : గ్లిజరిన్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది
Glycerin Benefits : మీకు స్కిన్ కేర్‌లో గ్లిజరిన్ ఉపయోగించకపోతే ఇక నుంచి అయినా దానిని మీ రోటీన్లో చేర్చుకోండి. ఎందుకంటే దీనితో మీ స్కిన్ ఎన్ని బెనిఫిట్స్ పొందుతుందో తెలుసా?
![Skin Care with Glycerin : గ్లిజరిన్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది Use glycerin in your skin care routine for beauty benefits Skin Care with Glycerin : గ్లిజరిన్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/fc60a891962f12e2230f2ff6d60c4ff81704351308504874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Glycerin Benefits for Skin : ఏ కాలంలోనైనా మెరిసే, హెల్తీ స్కిన్ కావాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది కాబట్టి స్కిన్‌కు తేమను అందించే ప్రొడెక్ట్స్, సాధనాలను ఎంచుకుంటారు. అయితే మీరు ఎల్లప్పుడూ మెరిసే, హెడ్రేటెడ్ స్కిన్ కావాలనుకుంటే మాత్రం మీ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ చేర్చుకోమంటున్నారు నిపుణులు. ఇది మీ చర్మ ఆరోగ్యం, టోన్‌ను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గించి.. హైడ్రేటెడ్‌గా ఉంచడంలో గ్లిజరిన్ బాగా పని చేస్తుంది. డల్నెస్తో పోరాడుతుంది.
గ్లిజరిన్‌ను చర్మ సంరక్షణలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. దీనిని సబ్బులు, లోషన్లు, టోనర్లలలో వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇలా కాకుండా రోజూవారీ సంరక్షణలో మీరు గ్లిజరిన్‌ను ఎలా ఉపయోగించాలో.. దానివల్ల మీరు పొందగలిగే మేజర్ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాయిశ్చరైజింగ్ కోసం..
గ్లిజరిన్‌ను ముఖ్యంగా మీరు చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇది సహజంగా తేమను లాక్ చేస్తుంది. చర్మంపై నీటి నష్టాన్ని నిరోధించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మీరు డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడుతుంటే మీరు దీనిని కచ్చితంగా ఉపయోగించవచ్చు. చలికాలంలో డ్రై స్కిన్‌ను దూరం చేసి ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది.
హైడ్రేటెడ్ స్కిన్ కోసం
గ్లిజరిన్ అధిక మొత్తంలో హైడ్రేషన్‌ను అందిస్తుంది. చర్మాన్ని పొడిబారడం నుంచి రక్షిస్తుంది. సమర్థవంతమైన పోషణను అందించి.. ఆరోగ్యకరమైన చర్మాన్నిస్తుంది. అంతేకాకుండా దెబ్బతిన్న, చిరాకు కలిగించే చర్మ సమస్యలనుంచి ఉపశమనం అందిస్తుంది.
మొటిమలు దూరం
హైడ్రేటింగ్, పోషణను అందించే చాలా ప్రొడెక్ట్స్ చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ ఎమోలియెంట్లు ఉంటాయి. అయితే గ్లిజరిన్‌లో అలాంటివి ఉండవు. ఇది నాన్ కామెడోజెనిక్. అందువల్ల ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోనీయకుండా చేస్తుంది. కాబట్టి మీకు జిడ్డు చర్మం ఉన్నా ఎలాంటి సమస్యలు ఉండవు. జిడ్డు వల్ల కలిగే మొటిమలను ఇది నిరోధిస్తుంది. మీకు మొటిమల సమస్యలుంటే మీరు హ్యాపీగా గ్లిజరిన్ ఉపయోగించవ్చచు.
స్మూత్ స్కిన్ కోసం..
గ్లిజరిన్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇది పోషణ, హైడ్రేటెడ్ స్కిన్ అందిస్తుంది. చర్మ సంబంధిత అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. డార్క్ స్పాట్స్‌ను పోగొడుతుంది. చర్మం పొడిబారకుండా.. స్మూత్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
వృద్ధ్యాప్య సంకేతాలు దూరం
వయసుతో పాటు చర్మం వాడిపోతూ ఉంటుంది. ముడతలు పడడం మొదలవుతుంది. ఫైన్ లైన్స్ కూడా ఇబ్బంది పెడతాయి. అయితే వీటిని తగ్గించడంలో గ్లిజరిన్ బాగా హెల్ప్ చేస్తుంది. మీ చర్మాన్ని బొద్దుగా చేసి యవ్వనంగా, ప్రకాశవంతమైన రూపాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది.
గ్లిజరిన్‌ను ఎలా ఉపయోగించాలంటే..
గ్లిజరిన్ కాస్త మందంగా ఉంటుంది. కాబట్టి దీనిని కాస్త డైల్యూట్ చేసి ఉపయోగించాలి. నీరు లేదా సరైన ద్రవంతో దానిని డైల్యూట్ చేయాలి. దీనిని మీ ముఖానికి అప్లై చేయడానికి చేతివేళ్లు, కాటన్ ప్యాడ్లు ఉపయోగించవచ్చు. కంటి దగ్గర్లో దీనిని ఉపయోగించకపోవడమే మంచిది. చర్మానికి అప్లై చేసిన తర్వాత మీరు సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ముఖ్యంగా పొడిగా ఉండే ప్రాంతాలపై అప్లై చేయాలి. దీనిని మీ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌తో కలిపి తీసుకోవచ్చు.
మీరు దీనిని ఉపయోగించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఎందుకంటే గ్లిజరిన్ మీ స్కిన్‌కి పడకపోతే ర్యాష్ వచ్చే అవకాశముంది.
Also Read : హెయిర్ కలర్ ఛేంజ్ చేస్తున్నారా? ఏ కలర్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)