Hair Color Trends 2024 : హెయిర్ కలర్ ఛేంజ్ చేస్తున్నారా? ఏ కలర్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
Hair Color Trends : ఈ సంవత్సరంలో మీరు న్యూ లుక్ కోసం హెయిర్ కలర్ చేయించాలనుకుంటున్నారా? అయితే 2024లో ఈ హెయిర్ కలర్స్‌ని ఫాలో అవొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇవే ట్రెండ్ అంటున్నారు నిపుణులు.
Beauty Trends 2024 : అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఏ లుక్ ఛేంజ్ చేయాలనుకున్నా హెయిర్ స్టైల్స్‌ని మారేస్తూ ఉంటారు. అబ్బాయిలైతే జుట్టును పెంచుకుంటారు. అమ్మాయిలు జుట్టును కట్ చేసుకుంటారు. దాదాపు చాలామంది ఇలా చేస్తారని మీకు తెలుసా? రీసెంట్గా జరిగిన ఓ సర్వేలో ఇది నిజమని కూడా తేలింది. ఈ మధ్య కాలంలో హెయిర్‌కి కలర్ చేయించుకునేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇంతకముందు గ్రే హెయిర్ కవర్ చేసుకోవడానికి ఇది ట్రై చేస్తే.. ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్‌కి తగ్గట్లు తమ హెయిర్‌ను కలరింగ్ చేయించుకుంటున్నారు.
ఈ సంవత్సరం మీరు హెయిర్ కలర్ చేయించాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ సమయంలో ఏ రంగు ట్రై చేయవచ్చో.. ఏవి మీకు వైవిధ్యమైన లుక్స్ ఇస్తాయో.. ప్రస్తుతం మార్కెట్లలో ఎలాంటి హెయిర్ కలర్స్ ట్రెండ్‌లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హెయిర్‌కి కలర్ వేయంచుకునే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి కేర్ తీసుకోవాలో చుద్దాం.
హాట్ రెడ్
ఈ హాట్ రెడ్ కలర్ ట్రెండ్ కె-పాప్ ద్వారా ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. దువా లిపా కూడా హాట్ రెడ్ కలర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. 2023లో కూడా ఈ కలర్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ కలర్ మీ స్కిన్ టోన్, కంటి రంగును దృష్టిలో పెట్టుకుని మీరు దీనిని ట్రై చేయవచ్చు. బట్ ఈ కలర్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఈ కలర్ మీరు చేసినప్పుడు మీరు ఆర్గాన్ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఇది జుట్టు సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి నుంచి దెబ్బతినకుండా హెయిర్‌ని రక్షిస్తాయి.
గోల్డెన్ కాపర్ కలర్
గోల్డెన్ కాపర్ హైలైట్స్ ప్రస్తుతం ట్రెండ్. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం గోల్డెన్ కాపర్ చేయవచ్చు. లేదంటే హైలైట్స్ కోసం మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు. లేయర్స్‌తో పాటు ఇలాంటి గోల్డెన్ కాపర్ హైలైట్స్ మీకు మంచి లుక్‌ని ఇస్తాయి. గ్రే హెయిర్ ఉన్నవారికి కూడా ఇది మంచి కవరింగ్నిస్తుంది. ఈ కలర్ మీరు ట్రై చేసినప్పుడు మీరు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీరు అమైనో, లాక్టిక్, టార్టారిక్ యాసిడ్లు కలిగిన షాంపూలూ, కండీషనర్లు ఉపయోగిస్తే మంచిది.
రిబ్బన్ లైట్స్
రిబ్బన్ లైట్స్ కూడా ఎప్పటి నుంచో ట్రెండ్‌లో ఉన్న ట్రెండ్‌నే. ఈ ట్రెండ్కోసం మీరు కుదుళ్ల నుంచి హెయిర్ కలర్ చేయించాల్సిన అవసరం లేదు. కేవలం జుట్టు చివర్లో లేదా మధ్యనుంచి కలర్ చేసుకోవచ్చు. దీనికోసం చాలామంది ముదురు గోధుమ రంగును ఎంచుకుంటారు. ఇది మీ ట్రెడీషనల్, ట్రెండీ లుక్స్‌కి కూడా బాగా సెట్ అవుతుంది. దీనిని ఏ స్కిన్ టోన్ వారు అయినా ఈజీగా ట్రై చేయవచ్చు.
న్యాచురల్ గ్లాస్ లుక్
మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మార్పు లేకుండా.. కలర్ చేయించుకోవాలనుకుంటే మీరు న్యాచురల్ గ్లాస్ లుక్ ట్రై చేయవచ్చు. మీ హెయిర్ కలర్ మార్చుకోకుండానే ఇది మీ లుక్‌ని హెలైట్ చేస్తుంది. పైగా లో మెయింటెనెన్స్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీ హెయిర్ కలర్ షేడ్‌ని బూస్ట్ చేస్తుంది. గ్లాస్ లుక్‌ని ఇచ్చి మెరిసేలా చేస్తుంది.
మీరు జుట్టు రంగును మార్చుకునే ముందు మీరు కచ్చితంగా మీ కలరిస్ట్ను సంప్రదించాలి. అది మీకు నప్పుతుందో లేదో.. అది మీకు ఎలాంటి లుక్‌ని ఇస్తుందో వంటి వాటి గురించి అడగాలి. జుట్టు రంగు వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతే కాకుండా మీ జుట్టు సంరక్షణలో ఏది మీకు బెటర్‌గా పనిచేస్తుందో వంటి విషయాలు తెలుసుకోవాలి. వారి దగ్గర ఉన్న డెమో ఫోటోలు చూస్తే మీకు కూడా ఓ అవగాహన వస్తుంది. అయితే మీరు హెయిర్ కలర్ వేయించుకున్న తర్వాత రంగును తాజాగా ఉంచుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read : మీకు ఈ సెక్షన్ గురించి తెలుసా? అబ్బాయిలైతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే